Bholaa Shankar Review చిరంజీవి మార్కు మసాలా చిత్రం.. కీర్తి సురేష్‌తో వర్కవుట్ అయిందా? భోళా శంకర్ రివ్యూ
నటీనటులు: చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్, శ్రీముఖి, గెటప్ శ్రీను, హైపర్ ఆది, తరుణ్ అరోరా, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: అనిల్ సుంకర
సినిమాటోగ్రఫి: డడ్లీ
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
మ్యూజిక్: మహతి స్వర సాగర్
కథ: శివ, ఆది నారాయణ
డైలాగ్స్: మమిడాల తిరుపతి
బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
రీమేక్: వేదాళం
రిలీజ్ డేట్: 2023-08-11క
శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మీ (కీర్తి సురేష్) చదువు కోసం కోల్‌కత్తాకు చేరుకొంటాడు. అక్కడే లాయర్‌గా పనిచేసే లాస్య (తమన్నా భాటియా)తో పరిచయం జరుగుతుంది. శంకర్ చేసిన ఓ పని వల్ల లాస్య ప్రొఫెషన్ ఇబ్బందిలో పడుతుంది. దాంతో శంకర్‌పై కోపం పెంచుకొంటుంది. అలాంటి పరిస్థితుల్లో లాస్య సోదరుడు శ్రీకర్ (శ్రీశాంత్)తో మహాలక్ష్మీ ప్రేమలో పడుతుంది. దాంతో వారిద్దరికి పెళ్లి చేయాలని శంకర్, శ్రీకర్ కుటుంబం నిర్ణయించుకొంటుంది. అయితే శంకర్‌పై కోపంతో పెళ్లికి లాస్య ఒప్పుకోదు. అలాంటి సమయంలోనే అమ్మాయిలను అక్రమ రవాణా చేసే అంతర్జాతీయ ముఠా విషయం శంకర్‌కు తెలుస్తుంది. ముఠా నాయకుడు అలెక్స్ (తరుణ్ అరోరా) తమ్ముడిని శంకర్ దారుణంగా చంపేస్తాడు.

గతంలో హైదరాబాద్‌లో ఆకురౌడిగా పేరున్న భోళా శంకర్.. కోల్‌కత్తాలో అమాయకుడైన శంకర్‌గా ఎందుకు నటించాడు? మహాలక్ష్మీ చదువు కోసమే కోల్‌కత్తాకు శంకర్ వచ్చాడా? శంకర్‌పై కోపంతో మహాలక్ష్మి, శ్రీకర్ పెళ్లికి లాస్య ఎలాంటి అడ్డంకులు కల్పించాలనుకొన్నది? శంకర్‌ను అలెక్స్ ముఠా ఎందుకు టార్గెట్ చేసింది? మహాలక్ష్మిని కిడ్నాప్ చేసిన అలెక్స్ ముఠాకు ఎలాంటి గుణపాఠం నేర్పాడు? శ్రీకర్, మహాలక్ష్మీ పెళ్లి జరిగిందా? శంకర్‌పై కోపంతో రగిలిపోయే లాస్య అతనిపై ఎలా మనసు పారేసుకొన్నది? భోళా శంకర్‌కు రష్మి గౌతమ్, శ్రీముఖికి ఉన్న రిలేషన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే భోళా శంకర్ సినిమా కథ.

అమ్మాయిల అక్రమ రవాణా అంశంతో భోళా శంకర్ కథ కోల్‌కత్తాలో మొదలవుతుంది. శంకర్, మహాలక్ష్మీ ఎంట్రీ, రొటీన్, రెగ్యులర్ సన్నివేశాలతో అతి సాధారణంగా సాగుతుంది. లాస్యతో కోర్టు సీన్ మంచి కామెడీ పండించినా.. అదే స్థాయి, అదే జోష్‌తో సినిమా ముందుకెళ్లకపోవడంతో ఏదో రొటీన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పక్కా ఫార్మాలతో ఓ కామెడీ సీన్, పాట, ఫైట్ సీక్వెన్స్‌తో కథను ఇంటర్వెల్ వరకు బలవంతంగా లాగే ప్రయత్నం కనిపిస్తుంది. లాస్యకు శంకర్ ఓ షాకింగ్ ట్విస్టు చెప్పడం ద్వారా భోళా శంకర్ ఫస్టాఫ్ చాలా కష్టంగా ఫినిష్ అవుతుంది.

ఇక భోళా శంకర్ సెకండాఫ్ ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందా అని ఆశించిన అభిమానులు, ప్రేక్షకులకు అదే రొటీన్ పంథా కొనసాగుతుంది. కాకపోతే పవన్ కల్యాణ్ అభిమానిగా భోళా శంకర్ చేసే మానియా ఫ్యాన్స్‌కు పండగలాంటి ఫీలింగ్ కలుగ జేస్తుంది. సెకండాఫ్‌లో రష్మీ గౌతమ్, శ్రీముఖితో సీన్లు అభిమానులకు గిలిగింతలు పెట్టేలా ఉంటుంది. ఖుషి ఇంటర్వెల్ సీన్ రీ క్రియేషన్ కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. సినిమా ముగింపు దశకు చేరుకొనే క్రమంలో సినిమా మరీ బోర్‌గా, నాటు కొట్టుడు, పరమ రొటీన్ సీన్లతో సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. 80 దశకంలో చూసిన క్లైమాక్స్‌తో భోళా శంకర్ మానియాకు తెర పడుతుంది.

దర్శకుడు మెహర్ రమేష్‌కు తప్పనిసరి హిట్ కావాల్సిన సమయంలో భోళా శంకర్ వస్తుండటంతో అందరిలో ఓ ఆసక్తికి పెరిగింది. చిరంజీవికి మరో హిట్టు ఇవ్వడం ద్వారా తనపై ఉన్న అనుమానాలు, సందేహాలకు సమాధానం చెప్పేలా భోళా శంకర్ ఉంటుందా? అనే వారికి ఈ సినిమా నిరాశను కలిగించిందనే చెప్పాలి. రీమేక్ అనేది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్‌ను ధీటుగా మెహర్ రమేష్ ఎదుర్కొనలేకపోయారనే చెప్పాలి. చిరంజీవి ఫ్యాన్స్ కోసమే ప్లాన్ చేసిన సినిమాలా అనిపిస్తుంది.
భోళా శంకర్ సినిమాలో ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మూవీలో చిరంజీవి తప్ప మరోకరు ఎలివేట్ అయ్యే ఛాన్సే కనిపించలేదు. ఎప్పటిలానే తన మేనరిజం, స్టయిల్స్‌తో తన వరకు భోళా శంకర్‌గా రఫ్ ఆడించాడు. కామెడీ టైమింగ్, ఫైట్స్ విషయంలో తనదైన సత్తాను చూపించాడు. ఈ సినిమా కథలో విషయం లేకపోవడం వల్ల చిరంజీవిని కొత్తగా చూడటానికి అవకాశమే లేకపోయింది. చిరంజీవి చుట్టు వచ్చే పాత్రల్లో ఇతర నటీనటులు అలా కనిపించిపోతారు. చిరంజీవి తర్వాత కీర్తి సురేష్‌కు కొంత ఫెర్ఫార్మ్ చేసే చిన్న ఛాన్స్ ఉందనిపిస్తుంది. తమన్నా ఎప్పటిలానే గ్లామర్ పాత్రకే పరిమితమైంది.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. చిరంజీవి సినిమా రేంజ్‌కు కావాల్సినంతగా పాటలు లేవేనే చెప్పాలి. కానీ మహతి సాగర్ రీరికార్డింగ్‌తో అదరగొట్టడమేడ కాకుండా సినిమాలో బలహీనంగా ఉండే సీన్లను కూడా మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. డడ్లీ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ అంత గొప్పగా లేదు. సీన్లు జంప్ అవుతూ అతికించినట్టుగా కొన్ని ఉంటాయి. చాలా సీన్లలో మమిడాల తిరుపతి రాసిన డైలాగ్స్ బ్రహ్మండగా పేలాయి. అనిల్ సుంకర అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

చిరంజీవి ఇమేజ్‌కు, ఆయన అభిమానులకు అభిరుచికి తగినట్టుగా రాసుకొన్న సన్నివేశాలు, డైలాగ్స్‌తో రొటీన్ ఎమోషన్స్, రెగ్యులర్ సీన్లతో సాగే చిత్రం భోళా శంకర్. రెండు గంటలపాటు చిరంజీవి నుంచి వచ్చే కామెడీ, హ్యుమర్, ఫైట్స్ మాత్రమే కనిపించే చిత్రంగా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో చిరంజీవి, కీర్తి సురేష్ మధ్య వచ్చే సిస్టర్ సెంటిమెంట్ సీన్లు మెప్పించేలా ఉండటం కొంత ఊరట. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సెంటిమెంట్ సీన్ల కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కావాల్సినంత చిరు మానియా ఉండనే ఉంది. రొటీన్ సినిమాలను ఒంటి చేత్తో బాక్సాఫీస్ వద్ద రఫ్ ఆడించే చిరు ఈ సినిమా విషయంలో కూడా అలాంటి మ్యాజిక్ చేస్తారా? లేదా అనే వేచి చూడాల్సిందే. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు ఈ సినిమా కిక్ ఇస్తే.. చిరుకు మరో భారీ విజయం దక్కడం ఖాయం. సిస్టర్ సెంటిమెంట్‌తో సాగే భోళా శంకర్ పరమ రొటీన్ సినిమా.


Click it and Unblock the Notifications











