Bholaa Shankar Twitter Review మాస్ ఎంటర్‌టైనర్.. గాడ్ ఫాదర్‌కు ఎక్కువ వాల్తేరు వీరయ్యకు తక్కువ!
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజైంది. అందాల భామలు తమన్నా భాటియా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించారు. చాలా రోజుల తర్వాత దర్శకుడు మెహర్ రమేష్ మెగా ఫోన్ పట్టుకొని ఈ సినిమాను నిర్మించాడు. అమెరికాలో ప్రీమియర్ల తర్వాత ట్విట్టర్‌లో అభిమానులు,ప్రేక్షకులు పోస్టు చేసిన కామెంట్స్ వివరాల్లోకి వెళితే..

భోళా శంకర్ యూఎస్ ప్రీమియర్ షో రివ్యూ. డెడ్లీ బ్లాక్ బస్టర్. కంప్లీట్ పైసా వసూల్ చిత్రం. మాస్ ఎంటర్‌టైనర్. పవర్ ప్యాక్ట్ ఫైట్స్, డ్యాన్స్, హిలేరియస్ కామెడీ సీన్లు ఉన్నాయి. చిరంజీవి పవర్‌ఫుల్‌గా రివెంజ్ మోడ్‌లో కనిపించారు. చిరంజీవి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. డబుల్ బ్లాక్‌బస్టర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
భోళా శంకర్ సినిమా సూపర్ హిట్, 2024లో పవన్ కల్యాణ్ సీఎం కావడం గ్యారెంటీ. మన ప్రపంచంలో ఉంటూ వాస్తవాలను పట్టించుకోవద్దు. చిరంజీవి గారు ఇంకా చాలా రీమేక్స్ చేయాలి. భోళా శంకర్ లాంటి సినిమాలు మెహర్ రమేష్‌తో చేయాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
భోళా శంకర్ సినిమా చూశాను. ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన బ్లాక్‌బస్టర్. సెకండాఫ్ చాలా బాగుంది. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ వర్క్ అయింది. క్లైమాక్స్ ఫైట్‌లో చిరంజీవి ఇరుగదీశాడు. జై చిరంజీవ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
భోళా శంకర్ గుడ్ మూవీ. సెకండాఫ్ చాలా బాగుంది. ఫస్టాఫ్‌లో విషయానికి వస్తే.. వీక్ డైరెక్షన్. సాంగ్స్ బాగాలేవు. పక్కా మాస్ కమర్షియల్ మూవీ. సిస్టర్ సెంటిమెంట్ వర్కవుట్ అయింది. కామెడీ ట్రాక్ కొంత వరకు ఫర్వాలేదనిపిస్తుంది. ఈసినిమా గాడ్ ఫాదర్‌కు ఎక్కువ.. వాల్తేరు వీరయ్యకు తక్కువ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
భోళా శంకర్ సినిమా చాలా స్లోగా స్టార్ అవుతుంది. కథలోని సమస్య చుట్టే సినిమా తిరుగుతుంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీలో ఎమోషన్స్ మిస్ అయ్యాయి. పాతతరం స్క్రీన్ ప్లే, డైరెక్షన్. మ్యూజిక్ అంతగా బాగాలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
భోళా శంకర్ యావరేజ్ కంటే బెటర్‌గా ఉంది. నా రేటింగ్ 3/5. చాలా గ్యాప్ తర్వాత మెహర్ అన్నకు హిట్ వచ్చింది. సెకండాఫ్‌లో సిస్టర్ సెంటిమెంట్ వర్క్ అయింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు అని ఓ నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భోళా శంకర్ కమర్షియల్ మూవీ. కొన్ని కామెడీ సీన్లు, యాక్షన్ బ్లాక్‌లు బాగున్నాయి. మిగితా విషయాలకు వస్తే పెద్దగా వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్ పేలవంగా ఉంది. సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. పవర్‌తో కూడిన పంచ్ మిస్ అయిందనే ఫీలింగ్ ఉంటుంది. అవుట్ డేటేడ్ స్క్రిప్టు, స్టోరి నేరేషన్. సినిమా యావరేజ్‌గా ఉంది అని నెటిజన్ కామెంట్స్ చేశారు.
భోళా శంకర్ సినిమా చూసిన తర్వాత అవుట్ డేటేడ్ డైరెక్షన్. .జీరో హై మూమెంట్స్, సాంగ్స్ ప్లేస్‌మెంట్ బాగాలేవు. కామెడీ సీన్లు అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ బాగాలేదు. 2010లో తీసినట్టుగా స్క్రీన్ ప్లే ఉంటుంది. సెకండాఫ్ వర్కవుట్ అయితే సినిమా హిట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











