Bhool Bhulaiyaa 3 Twitter Review: భూల్ భులయ్యా 3 ట్విట్టర్ రివ్యూ.. మాధురీ దీక్షిత్ జాదూ చేసిందా?
భూల్ భులయ్యా, భూల్ భులయ్యా 2 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత మూడో సీక్వెల్‌గా వస్తున్న చిత్రం భూల్ భులయ్యా 3. హిందీ సినిమా రంగంలో హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్ తదితరులు నటించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు టీ సిరీస్, సినీ1 స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. నవంబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్స్ ఎలా ఉన్నాయనే విషయంలోకి వెళితే..
ప్రముఖ నిర్మాతలు భూషన్ కుమార్, కృషన్ కుమార్ ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయలతో నిర్మించారు. సందీప్ శిరోద్కర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు మంచి స్పందనను కూడగట్టుకొన్నాయి. అలాగే ప్రమోషన్ కార్యక్రమాలు ఊపొందుకోవడం కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి.

కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్య 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద ధమాకా క్రియేట్ చేస్తున్నది. జాతీయ మల్టీప్లెక్స్ చైన్ థియేటర్‌లో రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తాయని నెటిజన్లు అభిప్రాయపడ్డుతున్నాయి.
కార్తీక్ ఆర్యన్ సినిమా కెరీర్‌లో భూల్ భులయ్యా 3 సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా సింగమ్ అగైన్ సినిమాకు గట్టి పోటీ ఇస్తున్నది.
భూల్ భులయ్యా 3 మూవీ చూశాను. దర్శకుడు అనీస్ బాజ్మీ నిరాశపరిచాడు. ఫస్టాఫ్ చాలా దారుణంగా ుంది. కథ లేకపోవడంతో బోరింగ్‌గా ఉంది. కార్తీక్ ఆర్యన్ అరుపులు చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నాయి. సెకండాఫ్ బాగుంటుందని అనుకొంటున్నాను. విద్యాబాలన్ మంచి యాక్టర్ అయితే కార్తీక్ ఆర్యన్ చెత్త యాక్టర్ అనిపించాడు. అక్షయ్‌ను తీసుకొని ఉంటే బాగుండేదనిపిస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
భూల్ భులయ్యా 3 మూవీ లో విద్యాబాలన్, కార్తీక్ ఆర్యన్ కెమిస్ట్రీ బాగుంది. ప్రతీ సీన్ ఎంజాయ్ చేస్తున్నాను అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
భూల్ భులయ్యా 3 మూవీ సినిమా బాగుంది. ప్రతీ సీన్ అద్బుతంగా తెరకెక్కించాడు. ప్రతీ సీన్ డిఫరెంట్‌గా ఉంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
భూల్ భలయ్యా 3 మూవీలో కార్తీక్ ఆర్యన్ పెర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. సీటు చివర్లో కూర్చొనే అనేంతగా థ్రిల్స్ ఉన్నాయి. ఈ సీక్వెల్‌లో కంటెంట్ బలంగా ఉందనిపించింది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
కార్తీక్ ఆర్యన్ కామిక్ టైమింగ్ బాగుంది. కామెడీ సీన్లకు విరగబడి నవ్వాల్సిందే. కంటెంట్ బాగా రాయడం వల్లే ప్రతీ సీక్వెల్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాను. ఈ సినిమా ప్రతీ ప్రేక్షకుడిని ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











