twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bhoot Police movie review: సైఫ్, అర్జున్ కపూర్, జాక్వలైన్ మూవీ ఎలా ఉందంటే?

    |

    Rating:
    2.5/5
    Star Cast: సైఫ్ ఆలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్
    Director: పవన్ కృపలానీ

    కథ, దర్శకత్వం: పవన్ కృపలానీ
    నిర్మాతలు: రమేష్ తౌరానీ, ఆక్షయ్ పూరి
    సినిమాటోగ్రఫి: జయకృష్ణ గుమ్మడి
    ఎడిటింగ్: పూజా లాధా శృతి
    మ్యూజిక్: సచిన్ జిగర్
    బ్యానర్: టిప్స్ ఇండస్ట్రీస్, 12 స్ట్రీట్ ఎంటర్‌టైన్‌మెంట్
    ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్ యాప్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2021-09-10

    భూత్ పోలీస్ కథ

    భూత్ పోలీస్ కథ

    తండ్రి ఉల్లత్ బాబా వారసత్వంగా వచ్చిన భూతవైద్యాన్ని అన్నాదమ్ములు విభూతి వైద్య (సైఫ్ ఆలీ ఖాన్), చిరౌంజి వైద్య (అర్జున్ కపూర్) కొనసాగిస్తుంటారు. అయితే భూతాలు ఉన్నాయని చిరౌంజీ నమ్మితే.. విభూతి మాత్రం దెయ్యాలు లేవని కొట్టిపడేస్తుంటాడు. కాకపోతే పొట్టకూటి కోసం విభూతి ఎదుటి వాళ్ల బలహీనతలను క్యాష్ చేసుకొంటూ బతుకు సాగిదిస్తుంటాడు. అలాంటి సమయంలో ధర్మశాలలోని టీ ఎస్టేట్ ఓనర్ మాయ (యామీ గౌతమ్) భూతం ఆవహిస్తుంది. భూతాన్ని వదిలించేందుకు చిరౌంజీ ప్రయత్నించే క్రమంలో విభూతి దేహంలోకి దెయ్యం ప్రవేశిస్తుంది.

    భూత్ పోలీస్ కథలో ట్విస్టులు

    భూత్ పోలీస్ కథలో ట్విస్టులు

    భూతవైద్యంపై చిరౌంజికి ఎలాంటి నమ్మకం ఏర్పడింది? భూతవైద్యాన్ని చిరౌంజీ నమ్మడానికి కారణమేమి? అదే ఇంటి నుంచి వచ్చిన విభూతి భూతవైద్యాన్ని నమ్మకపోవడానికి ఏర్పడ్డ కారణాలు ఏమి? నిజంగా మాయాను భూతం ఆవహించిందా? మాయకు ఆవహించిన భూతాన్ని చిరౌంజీ ఎలా వదలించాడు? మాయ దేహంలో నుంచి భూతం బయటకు వచ్చి విభూతి దేహంలోకి ఎందుకు ప్రవేశించింది? తన సోదరుడికి పట్టిన భూతాన్ని వదిలించాడా? లేదా?, ఇంతకు విభూతి దేహంలోకి ప్రవేశించిన ఆ భూతం వెనుకు అసలు కథ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే భూత్ పోలీస్ సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఉన్నత చదువులు అభ్యసించాలని కోరికతో ఉన్న ఓ యువతికి బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే.. ఆ అమ్మాయి భూతం పట్టినట్టు నటించే సీన్లోకి విభూతి, చిరౌంజీ ఎంట్రీ ఇచ్చే ఓ హాస్యభరితమైన సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. అయితే ప్రజల భూతాల గురించి నమ్మకం, బలహీనతలు ఉన్నంత కాలం తమ జిందగీకి ఎలాంటి ఢోకాలేదనే నమ్మకంతో విభూతి ఉంటే.. తండ్రి పేరు నిలబెట్టడానికి చిరౌంజీ ప్రయత్నించడం లాంటి విరుద్దమైన భావజాలంతో ఫస్టాఫ్‌లో కథ నడుస్తుంది.

    సెకండాఫ్‌లో ఎమోషన్ పాయింట్స్‌తో

    సెకండాఫ్‌లో ఎమోషన్ పాయింట్స్‌తో

    ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే.. భూతవైద్యం పేరుతో ప్రజలను మోసగిస్తున్నారనే నెపంతో వారిద్దరిని అరెస్ట్ చేసేందుకు పోలీస్ ఆఫీసర్ చెడీలాల్ (జావెద్ జాఫ్రీ) పాత్ర కథలో వినోదానికి ముడిసరుకుగా మారింది. కథంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుండగా.. క్లైమాక్స్‌లో ఓ మహిళను ఆంగ్లేయులు దహనం చేసే సన్నివేశం సినిమాను ఎమోషనల్‌గా మారుస్తుంది. ఆ సంఘటన చిరౌంజీ, విభూతల ఆలోచనలను మార్చేసేందుకు కారణమవుతుంది. అయితే స్టోరికి సంబంధించిన బేసిక్ పాయింట్, దానిని కథగా మలిచే విధానం బాగుంది. కానీ కథను గమ్యస్థానానికి చేర్చే మార్గంలో దర్శకుడు తడబాటుకు గురయ్యాడనిచెప్పవచ్చు.

    సైఫ్, అర్జున్ కపూర్, ఇతర నటుల ఫెర్ఫార్మెన్స్

    సైఫ్, అర్జున్ కపూర్, ఇతర నటుల ఫెర్ఫార్మెన్స్

    విభూతి వైద్యగా సైఫ్ ఆలీ ఖాన్ తుంటరి, చిలిపి చేష్టలతో ఆకట్టుకొంటే.. చిరౌంజీగా అర్జున్ కపూర్ ఎమోషనల్ పాత్రతో మెప్పిస్తాడు. భూతవైద్యాన్ని ఎంత బలంగా నమ్ముతాడో.. అంతే మొత్తంలో నిస్వార్థంగా పీడితులకు సహాయం చేయాలనే పాత్రలో అర్జున్ కపూర్ ఒదిగిపోయాడనిపిస్తుంది. ఇక జాక్వలైన్ ఫెర్నాండేజ్ బబ్లీ క్యారెక్టర్‌లో అలరించింది. పెద్దగా నటనకు స్కోప్ లేని పాత్రలో కనిపించిదని చెప్పవచ్చు. అలాగే యామీ గౌతమ్ భావోద్వేగమైన పాత్రలో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. పాత్ర పరంగా పెద్దగా చేయడానికి విస్తృతి లేనందున ఆ పాత్ర పరిధికే కట్టుబడిపోయింది. జావేద్ జాఫ్రి, జానీ లివర్ కూతురు జామీ లివర్ ఇంట్రెస్టింగ్ పాత్రలో ఆకట్టుకొన్నది.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రాఫర్‌గా వ్యహరించారు. హిమచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, అలాగే ధర్మశాల పరిసర ప్రాంతాలను చక్కగా తెరకెక్కించారు. అలాగే హారర్, థ్రిలర్ కావాల్సిన లైటింగ్‌ను క్రియేట్ చేసి సన్నివేశాల మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేశారని చెప్పవచ్చు. సచిన్ జిగర్ మ్యూజిక్ ఫర్యాలేదనిపిస్తుంది. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోయింది. రీరికార్డింగ్ ద్వారా ఈ సంగీతద్వయం కొన్ని సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చారు. పూజా లాద సుర్తి ఎడిటింగ్ బాగుంది. టిప్స్ ఇండస్ట్రీస్, 12 స్ట్రీట్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

    Recommended Video

    Auto Ramprasad's Peep Show First Look | Poster Launch Press Meet
    ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    హ్యుమర్, ఎంటర్‌టైన్‌మెంట్, హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలిసి ఉన్న చిత్రంగా భూత్ పోలీస్ రూపొందింది. మూలకథ బాగున్నప్పటికి.. కథా విస్తరణ సరిగా జరగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. స్క్రిప్టు పరంగా ఎమోషనల్ పాయింట్స్ సరిగా వర్కవుట్ కాకపోవడం, అలాగే కథ మొత్తానికి సంబంధించిన బేసిక్ పాయింట్ సినిమాను పర్‌ఫెక్ట్‌గా డ్రైవ్ చేయలేకపోయిందని చెప్పవచ్చు. డిస్నీ+ హాట్ స్టార్‌లో రిలీజైన ఈ చిత్రాన్ని సెలవు రోజుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే.. కాస్త వినోదాన్ని గ్యారెంటీ పంచుతుంది.

    English summary
    Bollywood star Saif Ali Khan, Arjun Kapoor, Jacqueline Fernandez, Yami Gautam's latest movie Bhoot Police Hits the theatres on September 10th. This movie released on Disney+hotstar app.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X