Bhooth Bangla First Review: భూత్ బంగ్లా మూవీ ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ హీరోయిన్ టబు జంటగా నటించిన ఫాంటసీ, హారర్ కామెడీ భూత్ బంగ్లా. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వమికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు నటించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఈ సినిమాను ఏక్తా కపూర్, శోభా కపూర్, అక్షయ్ కుమార్ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: దివాకర్ మణి, ఎడిటింగ్: ఎంఎస్ అయ్యప్పన్ నాయర్, మ్యూజిక్: ప్రీతమ్, రోని రాఫెల్ అందించారు. కామెడీ, హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అందించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రానికి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Bhooth Bangla CBFC Review

భూత్ బంగ్లా సినిమా కథ విషయానికి వస్తే.. 30 ఏళ్ల అర్జున్ ఆచార్య (అక్షయ్ కుమార్) ఆర్థిక సమస్యలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు కష్టపడుతుంటాడు. ఇలాంటి కష్టాల్లో ఉన్న సమయంలో ఉత్తర భారత్‌లో ని మంగళ్‌పూర్ అనే గ్రామంలో తాత సంపాదించిన ఆచారయ నివాస్ అనే ప్యాలెస్ గురించి తెలుస్తుంది. ఆ ప్యాలెస్‌తో తన ఆర్థిక సమస్యలు తీరిపోతాయని ఓ ప్లాన్ వేస్తాడు. చాలా కాలంలో పెండింగ్‌లో ఉన్న చెల్లెలి పెళ్లిని ఆ ప్యాలెస్‌లో చేయాలని భావిస్తాడు. అయితే ఆ బంగ్లా వల్ల ఊరికి శాపం ఉంది. ఆ బంగ్లాలో దెయ్యం ఉందనే విషయం తెలుస్తుంది. అయినా అర్జున్ ఆచార్య పెళ్లి పనులు ఆపకుండా ముందుకెళ్తాడు. ఆ బంగ్లాలో దెయ్యం వల్ల ఎలాంటి సమస్యలు అర్జున్‌కు వచ్చాయి? ఆ ప్యాలెస్‌లో చెల్లెలి పెళ్లి జరిగిందా? అర్జున్‌కు ఆర్థిక కష్టాలు తీరాయా? అనే ప్రశ్నలకు సమాధానం భూత్ బంగ్లా సినిమా కథ.

భూత్ బంగ్లా కథ వినడానికి రొటీన్, రెగ్యులర్‌గా అనిపించినప్పటికీ.. ఈ మూవీ కోసం ప్రియదర్శన్ రాసిన స్క్రీన్ ప్లే, రూపొందించిన సన్నివేశాలు, కల్పించిన పాత్రలు మంచిగా కుదిరాయి. కామెడీ ట్రాక్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అక్షయ్ కుమార్, టబు మధ్య కెమిస్ట్రీ, అక్షయ్, రాజ్‌పాల్ యాదవ్, పరేశ్ రావెల్ మధ్య సన్నివేశాలు ఫ్రెష్‌గా, ఫన్‌గా ఉంటాయనే విషయం సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చాయి.

ఇక కామెడీ, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్ అధికారులు పూర్తిగా సంతృప్తి చెందారు. ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా క్లీన్ సర్టిఫికెట్ అందించారు. సెన్సార్ సూచనలు, సలహాల మేరకు చిత్ర యూనిట్ కొన్ని సవరణలు చేసింది. దాంతో ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్ అందించారు ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లకుపై బడిన వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా వీక్షించవచ్చు అని సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్‌లో స్పస్టం చేశారు.

భూత్ బంగ్లా సినిమా పూర్తిగా హాస్య భరితంగా సాగుతుంది. ఈ సినిమా కథలో సాగదీతకు ఛాన్స్ లేకపోవడం వల్ల నిడివిని బ్యాలెన్స్‌గా చేశారు. ఈ చిత్రాన్ని 2 గంటల 45 నిమిషాలు అంటే.. 165 నిమిషాల రన్‌టైమ్‌కు ఫిక్స్ చేశాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా అన్నివర్గాలను ఆదరించేలా రూపొందించామని చెప్పారు. ఈ సినిమా గురించిన లేటేస్ట్ అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..

Read more about: bhooth bangla akshay kumar tabu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X