Bhoothadham Bhaskar Narayana Review:18 ఏళ్లలో 17 హత్యలు.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో.. భూతద్ధం భాస్కర్ నారాయణ

Rating: 2.75/5

నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత తదితరులు
దర్శకత్వం: పురుషోత్తం రాజ్
నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫి: గౌతమ్ జార్జ్
ఆర్ట్ డైరెక్టర్: రోషన్ కుమార్
కాస్ట్యూమ్స్: అశ్వంత్, ప్రతిభ
రిలీజ్ డేట్: 2024-03-01

ఏపీ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో సీరియల్ కిల్లింగ్స్ సంచలనంగా మారడమే కాకుండా పోలీస్ యంత్రాంగానికి ఛాలెంజ్‌గా నిలుస్తాయి. మహిళలను కిరాతకంగా హత్య చేసి వారి తలల స్థానంలో దిష్డిబొమ్మను పెడుతారు. ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేసి అధికారులకు సవాల్‌గా మారడంతో సీరియల్ మర్డర్ కేసును స్థానికంగా ఉండే డిటెక్టివ్ భాస్కర్ నారాయణకు అప్పగిస్తారు.

మహిళలను కిరాతకంగా హత్యలు చేసే సైకో కిల్లర్ ఎవరు? దారుణంగా హత్య చేయడానికి పురిగొల్పిన సంఘటనలు ఏమిటి? దిష్టిబొమ్మ హత్యలు స్థానికంగా ఎలాంటి భయభ్రాంతులకు గురి చేశాయి? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేపట్టిన భాస్కర్ నారాయణ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? రిపోర్టర్ లక్ష్మీ (రాశీ సింగ్) ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? భాస్కర్ నారాయణ ఈ కేసు చిక్కు ముడిని విప్పాడా? ఈ హత్య సంఘటనలకు పురాణాలకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా కథ.

Bhoothadham Bhaskar Narayana Movie Review in Telugu: Shiva Kandukuri, Purushottam impressive with Screenplay

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా కథ, కథనాల విషయానికి వస్తే.. దర్శకుడు పురుషోత్తం అనుసరించిన స్క్రీన్ ప్లే ఈ సినిమా కథకు కనెక్ట్ అయ్యేలా చేసిందని చెప్పవచ్చు. హీరో బాల్యం నాటి సంఘటనలతో కథను ఆరంభించడం ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా మారిందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్‌తో సరదా సంఘటనలు వినోదానికి పెద్ద పీటవేసేలా ఉన్నాయి. ఇక సీరియల్ మర్డర్స్ కథలోకి రావడంతో సినిమా కథాస్వరూపం, ఫీల్, లుక్ మారిపోతుంది. గ్రిప్పింగ్‌గా సినిమాను నడిపించిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో వినోదం, సెకండాఫ్‌లో సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు సినిమాను బ్యాలెన్స్ చేయడంతో కొత్త అనుభూతికి గురి చేశాయి.

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. యువ హీరో శివ కందుకూరి మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఫలితం కనపడటం లేదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమాలో క్యారెక్టర్‌లో యాప్ట్‌గా అనిపించింది. భాస్కర్ నారాయణ పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా మంచి పరిణతితో కూడిన ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొన్నాడు. రాశీ సింగ్ తన పాత్ర పరిధి మేరకు రాణించడమే కాకుండా అందంతో కూడా ఆకట్టుకొన్నది. ఈ చిత్రంలో నటించిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేశాడు.

Bhoothadham Bhaskar Narayana Movie Review in Telugu: Shiva Kandukuri, Purushottam impressive with Screenplay

భూతద్ధం భాస్కర్ నారాయణ మూవీకి ఆర్ట్ విభాగం పనితీరు, మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. శ్రీచరణ్ పాకాల ఎప్పటిలానే మంచి బీజీఎంతో సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. గౌతమ్ జార్జ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాతలు స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

Bhoothadham Bhaskar Narayana Movie Review in Telugu: Shiva Kandukuri, Purushottam impressive with Screenplay

18 ఏళ్ల కాలంలో 17 హత్యలు.. వాటి వెనుక కారణాల అనే పాయింట్‌తో గ్రిప్పింగ్‌ స్క్రిన్ ప్లేతో రూపొందిన చిత్రం భూతద్ధం భాస్కర్ నారాయణ. సైకో కిల్లింగ్స్ కథానేపథ్యంగా సాగిన ఈ చిత్రానికి నటీనటులు ఫెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల పనితీరు ప్లస్ సాయింట్స్. ఫస్టాఫ్‌లో అసలు కథలోకి వెళ్లడానికి సమయం తీసుకోవడం కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అధికంగా ఉండే ఈ సినిమా ఎలాంటి అంచనాలతో వెళ్లినా నిరాశపరచదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X