Bhakshak Review: క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌.. మహిళల రక్షణ కోసం ఉత్కంఠగా సాగిన పోరాటం

Rating:
3.0/5

చిత్రం: భక్షక్‌
నటీనటులు : భూమి పెడ్నేకర్‌, సంజయ్‌ మిశ్రా, సాయి తమంకర్‌, ఆదిత్య శ్రీవాత్సవ సహా తదితరులు
సంగీతం : అనురాగ్‌ శుక్లా, క్లింటన్‌ సెరోజో
సినిమాటోగ్రఫీ : కుమార్‌ సౌరభ్‌
ఎడిటింగ్‌ : జుబిన్‌ షేక్‌
నిర్మాత : గౌరీ ఖాన్‌, గౌరవ్‌ వర్మ
రచన : జోత్స్న నాథ్‌ స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం : పుల్‌కిత్‌,
స్ట్రీమింగ్‌ వేదిక : నెట్‌ఫ్లిక్స్‌

బాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్​లో ముందుకు సాగుతున్న నటి భూమి పెడ్నేకర్‌. తాజాగా ఆమె నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ కమ్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌ భక్షక్‌. పుల్‌కిత్‌ దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..

Bhumi Pednekar Bhakshak  Review Web Series OTT Review and Streaming Details Here

కథేంటంటే : ఈ కథ పట్నా నేపథ్యంలో ప్రారంభమవుతుంది. పట్నాలోని మునావర్‌పూర్‌లో ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌గా పని చేసే వైశాలి (భూమి పెడ్నేకర్‌)... యూట్యూబ్‌లో సొంతంగా న్యూస్‌ ఛానల్ మెయిన్ టెయిన్ చేస్తుంటుంది. స్థానిక సంఘటనలపై తన ఛానల్​ ద్వారా వార్తలను ఇస్తుంటుంది. తనకు భాస్కర్ (సంజయ్ మిశ్రా) కెమెరామెన్‌గా పని చేస్తుంటాడు. అయితే మునావర్‌పూర్‌లోని ఓ అనాథ బాలికల వసతిగృహంలో పిల్లలపై లైంగిక దాడులు జరుగుతుంటాయి.

కాని దీన్ని రాజకీయ నాయకులు, అధికారులు పెద్దగా అస్సలు పట్టించుకోరు. అందుకు కారణం ఆ వసతి గృహాన్ని నడిపించేది బన్సీలాల్ (ఆదిత్య శ్రీవాత్సవ). అతడికి లోకల్ పొలిటికల్ లీడర్స్​తో మంచి సంబంధాలు ఉంటాయి. అందుకే పోలీసులు అతడిని ఏం చేయరు. అయితే ఆ వసతిగృహంలో చిన్నపిల్లలపై జరిగే లైంగిక దారుణాల గురించి వైశాలి తెలుసుకుంటుంది. మరి ఆమె దానిని నివారించేందుకు ఏం చేసింది? ఒంటరిగా ఎలా పోరాడింది? చివరకు బన్సీలాల్‌కు శిక్ష పడేలా చేసిందా? లేదా? అనేదే కథ.

ఎలా ఉందంటే : సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సిల్వర్ స్క్రీన్​పై ఎన్నో సినిమాలు వచ్చాయి. పెద్దగా గుర్తింపు ఉన్న నటులు లేకపోయినా, బలమైన స్ట్రాంగ్ కంటెంట్​ ఉంటే చాలు ప్రేక్షకులు ఇలాంటి వాటిని బాగా ఆదరిస్తారు. అలాంటి జానరే ఈ భక్షక్ చిత్రం. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా, నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నవారు చాలా మంది ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి వారిని ఉపయోగించుకుంటూ సామాజిక సేవతో వ్యభిచారం, మానవ అక్రమరవాణా అంటూ ఎన్నో దురగతాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి.

Bhumi Pednekar Bhakshak  Review Web Series OTT Review and Streaming Details Here

మరి అలాంటి వాటిపై ఒక మహిళా జర్నలిస్ట్‌ చేసిన పోరాటమే భక్షక్‌. కమర్షియల్‌ హంగుల జోలికి పోలేదు. ప్రతి సన్నివేశాన్ని సహజత్వానికి దగ్గరగా చూపించారు. క్లైమాక్స్ సీన్స్ బాగా ఎమోషనల్​గా సాగాయి. మొత్తంగా మంచి ఎమోషనల్ డ్రామాగా సాగింది కథ. వైశాలిగా భూమి పెడ్నేకర్​ తన నటనతో బాగా ఆకట్టుకుంది. సిస్టమ్‌ ఇలాగే ఉంటుంది. ఒక చేత్తో అధికారం ఇస్తుంది. మరొక చేత్తో అదే అధికారాన్ని లాక్కుంటుంది. న్యాయస్థానానికి వాస్తవాలతో సంబంధం లేదు. కేవలం సాక్ష్యాలు మాత్రమే కావాలి అంటూ ఆమె చెప్పిన సంభాషణలు ఆలోచించేలా చేస్తాయి.

ఎవరెలా చేశారంటే : జర్నలిస్ట్‌ వైశాలి పాత్రలో భూమి పెడ్నేకర్‌ బాగా నటించింది. సాటి మహిళల రక్షణ కోసం పోరాడే యువతిగా తన పాత్రలో జీవించేసింది. సాయి తమంకర్‌, సంజయ్‌ మిశ్రా, ఆదిత్య శ్రీవాత్సవ ప్రతిఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగం పని తీరు బాగుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భక్షక్‌ మెస్సేజ్‌ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌ విత్‌ బ్రిలియెంట్‌ పెర్ఫామెన్స్‌.

చివరగా.. భక్షక్.. చిన్నారుల, మహిళల రక్షణ కోసం ఉత్కంఠగా సాగిన పోరాటం. ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X