Bichagadu 2 Review విజయ్ ఆంటోని వన్ మ్యాన్ షో.. ఎమోషన్స్ పీక్స్.. క్లైమాక్స్ అదుర్స్!

Rating: 2.75/5

నటీనటులు: విజయ్ ఆంటోని, కావ్య థాపర్, హరీష్ పెరడీ, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు, రాధా రవి తదితరులు
మ్యూజిక్, ఎడిటింగ్: రచన, దర్శకత్వం: విజయ్ ఆంటోని
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫి: ఓం నారాయణ్
బ్యానర్: విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్
రిలీజ్ డేట్: 2023-05-19

బిచ్చగాడు 2 కథ గురించి:విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) లక్ష కోట్ల రూపాయల విలువైన బిజినెస్ సామ్రాజ్యానికి అధిపతి. తన చుట్టూ ఉండే ముగ్గురు (హరీష్ పెరడీ, దేవ్ గిల్, జాన్ విజయ్) కుట్రపన్ని విజయ్ గురుమూర్తిని చంపడానికి ప్లాన్ చేస్తారు. విజయ్ గురుమూర్తికి సరిపోయే టిష్యూస్ ఉన్న వ్యక్తిని వెతికి.. అతడి మెదడు ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్రమంలో దొరికిన బాల నేరస్థుడైన బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని)ని దొరుకుతాడు. సత్యను సృహ కోల్పోయేలా చేసి విజయ్ గురుమూర్తికి సత్య మెదడును ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు.

బిచ్చగాడు 2 కథలో ట్విస్టులు:విజయ్ గురుమూర్తికి సత్య మెదడు ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత ఏం జరిగింది? విజయ్ గురుమూర్తి గ్రూపులో ఉండే ముగ్గురు ప్లాన్ వర్కవుట్ అయిందా? సత్య మెదడు పెట్టుకొన్న విజయ్ గురుమూర్తి ఆ ముగ్గురు కుట్రదారుల చేతిలో కీలుబొమ్మగా మారాడా? విజయ్ గురుమూర్తి ప్రియురాలు హేమ (కావ్య థాపర్) పరిస్థితి ఏమైంది? బిచ్చగాడైన సత్య ఎందుకు బాల నేరస్థుడిగా మారాడు? చిన్నతనంలో జైలుకు వెళ్లడం తాను కోల్పోయిన సోదరి రాణిని కలిసేందుకు సత్య ఎలాంటి ప్రయత్నాలు చేపట్టాడు. చివరకు తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే సోదరి రాణిని కలిశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే బిచ్చగాడు సినిమా కథ.

Bichagadu 2 Review and Rating: Vijay Antony one Man Show

బిచ్చగాడు 2 ఫస్టాఫ్ ఎలా సాగిందంటే?:విజయ్ గురుమూర్తికి షాడోగా ఉండే ప్రియురాలు హేమను అతడి నుంచి విడదీసే కుట్రతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. విజయ్ గురుమూర్తిని తమ చేతుల్లో కీలుబొమ్మగా మార్చుకొనేందుకు బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కాన్సెప్ట్‌గా కొత్తగా ఉండటంతో.. కథతో ట్రావెల్ అయ్యేలా చేసింది. అయితే సినిమాకు క్లైమాక్స్ అనుకునే పాయింట్‌ను ఇంటర్వెల్‌లోనే ముగించడంతో.. సెకండాఫ్‌లో ఏం చేస్తాడనే క్యూరియాసిటీ పెరుగుతుంది.

Bichagadu 2 Review and Rating: Vijay Antony one Man Show

బిచ్చగాడు 2 క్లైమాక్స్ గురించి:ఇక సెకండాఫ్‌లో విజయ్ గురుమూర్తిలా కాకుండా సత్యలా బిహేవ్ చేయడంతో కథ మరో కోణంలో కొనసాగుతుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత కథ మరీ సాగదీసి.. విసుగు పుట్టించేలా చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బిచ్చగాళ్లకు సంబంధించిన డిటేయిలిటీ కాస్త ఎక్కువగా అనిపించడం బోర్‌ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ముందు ఏపీ సీఎంతో సత్య అమీతుమీకి తేల్చుకొనేందుకు సిద్దం కావడం, సీఎం మనుషులతో ఫైట్‌తో కథ ఊపందుకోవడమే కాకుండా మరో రేంజ్‌కు వెళ్తుంది. ఈ సినిమాను క్లైమాక్స్ మరో రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు.

Bichagadu 2 Review and Rating: Vijay Antony one Man Show

విజయ్ ఆంటోని వన్ మ్యాన్ షో..:కథకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా విజయ్ ఆంటోని వన్ మ్యాన్ షో. కథను నడిపించిన విధానం, కథలో సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించిన విధానం సినిమాకు హైలెట్‌గా మారిందని చెప్పవచ్చు. సత్యగా ఎమోషనల్ క్యారెక్టర్‌ను పండించిన విధానం నటననపరంగా విజయ్ ఆంటోనికి ఉన్న తపన కనిపిస్తుంది. సెంటిమెంట్‌ సీన్లను చిత్రీకరించిన విధానం దర్శకుడిగా ఆయన ప్రతిభ మాత్రమే కాకుండా ఆడియెన్స్ పల్స్ తెలుస్తుంది. చివరి 15 నిమిషాల్లో ఆయన నటన ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది.

Bichagadu 2 Review and Rating: Vijay Antony one Man Show

మిగితా క్యారెక్టర్లలో:మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. గురు మూర్తి, సత్య పాత్రల చుట్టూ తిరిగే పాత్రలు నామమాత్రంగానే కనిపిస్తాయి. తన క్యారెక్టర్‌ను విజయ్ ఆంటోని బలంగా రాసుకోవడం వల్ల మరే పాత్రలు కూడా బయటకు ఎలివేట్ కాలేకపోయాయి. ప్రియురాలిగా కావ్య థాపర్ ఒకట్రెండు సీన్లలో మెప్పించింది. సీఎంగా రాధారవి ఫర్వాలేదనిపిస్తారు. హరీష్ పేరడి, జాన్ విజయ్, దేవ్ గిల్ ఓకే అనిపిస్తారు. చెల్లెలు క్యారెక్టర్ చేసిన యాక్టర్లు ఇద్దరు ఆకట్టుకొంటారు.

Bichagadu 2 Review and Rating: Vijay Antony one Man Show

సాంకేతిక అంశాల గురించి:సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. బిచ్చగాడు 2 సినిమాకు ఓం నారాయణ్ అందించిన సినిమాటోగ్రఫి హై క్వాలిటీతో ఉంటుంది. ప్రతీ సీన్‌ను చాలా రిచ్‌గా, అందంగా చూపించే ప్రయత్నం చేశారు. ఫైట్స్ చిత్రీకరించిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో బిచ్చగాళ్ల సమావేశం సీన్ బాగుంది. విజయ్ ఆంథోని ఎడిటింగ్, మ్యూజిక్ అన్నీ విభాగాలపై ఆయన కమాండ్ కనిపిస్తుంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

Bichagadu 2 Review and Rating: Vijay Antony one Man Show

ఫైనల్‌గా బిచ్చగాడు 2 ఎలా ఉందంటే?:బిచ్చగాడు సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకొన్నది. దాంతో ఆ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా బిచ్చగాడు 2పై కూడా భారీ అంచనాలే ఉండటం సహజం. అలాంటి అంచనాలతో వచ్చిన ప్రేక్షకులను ఏ మాత్రం కూడా నిరాశపరచదు. బిచ్చగాడులో తల్లి సెంటిమెంట్‌తో ఆకట్టుకొంటే.. ఇందులో సిస్టర్ సెంటిమెంట్‌తో కంటతడి పెట్టించేంతగా కథ రాసుకొన్నారు. బిచ్చగాడులో పాట ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా ఉంటుంది. కానీ ఇందులో అలాంటి ఫ్యాక్టర్ మిస్ అయిన ఫీల్ కనిపిస్తుంది. ఫస్టాఫ్ మంచి ఫీల్ కలిగిస్తే.. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు గుండెను పిండేసే ఎమోషన్స్, కోడలితో విజయ్ అంటోని సీన్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. బిచ్చగాడు 2 మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా. తప్పకుండా మీరు పెట్టే ప్రతీ పైసా వసూలు చేసుకొనే అనుభూతిని కలిగిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X