Awara Zindagi Review బిగ్‌బాస్ శ్రీహాన్ హీరోగా సెట్ అయ్యాడా? మూవీ ఎలా ఉందంటే?
Rating: 2.5/5
నటీనటులు: బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు
దర్శకుడు: దేపా శ్రీకాంత్ రెడ్డి
నిర్మాత: నంద్యాల మధుసూదన్ రెడ్డి
సహ నిర్మాత: కంభంపాటి విజయ కుమార్
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ ప్రసాద్ వీ, ఉరుకుంద రెడ్డి
ఎడిటర్: సాయిబాబు తలారి
సంగీతం: ప్రతీక్ నాగ్
బ్యానర్: విభా ఎంటర్‌టైన్‌మెంట్స్
లైన్ ప్రొడ్యూసర్: వంటేరు ప్రణయ్ రెడ్డి
వీఎఫ్ఎక్స్: కౌశిక్ గుండు (చింటూ)
రిలీజ్ డేట్: 2023-06-23
భట్టి ( బిగ్‌బాస్ ఫేమ్ శ్రీహాన్), సీబీ (ముక్కు అవినాష్ సోదరుడు జబర్దస్త్ అజయ్ ), జస్వంత్ (లంబు), చెర్రీ (ఎల్బీ) నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్. బాధ్యత లేకుండా.. జీవితంలో ఏ లక్ష్యం లేకుండా జులాయిగా తిరుగుతుంటారు. తప్పతాగడం, అమ్మాయిలతో గడపడం చేయడమే ఎంజాయ్ అని బతుకుతుంటారు. రాత్రి పూట తాగి పోలీసులకు చిక్కుతుంటారు. తాగుడు, ఇతర వ్యసనాలు మానుకొని సరిగా ప్రవర్తించకుంటే శిక్షిస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎస్పై కూతురు కిడ్నాప్ అవుతుంది.

శ్రీహాన్ జల్సా బృందం ఎలాంటి వ్యవహారాలను వెలుగబెట్టారు? కిడ్నాప్ గురైన కూతురు పరిస్థితి ఏమిటి? ఎస్పై కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎస్సై కూతురు కిడ్నాప్ వెనుక శ్రీహాన్, అతడి ఫ్రెండ్స్ హస్తం ఉందా? ఎస్సై కూతురు కిడ్నాప్ కథకు క్లైమాక్స్ ఏమిటి? శ్రీహాన్ బ్యాచ్ తమ ప్రవర్తనను మార్చుకొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఆవారా జిందగీ సినిమా కథ.
ఓటీటీల ప్రభావంతో తెలుగులో అడల్డ్ కంటెంట్ ఆధారంగా కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్ తెలుగు ప్రేక్షకులను ఆలరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి కంటెంట్‌తో వచ్చిన కథనే ఈ సినిమా. ఫస్టాఫ్ విషయానికి వస్తే.. శ్రీహాన్ మరో ముగ్గురు యువకుల చుట్టే కథ తిరుగుతుంది. నలుగురు యువకుల పాత్రల చుట్టు బలమైన కామెడీ సీన్లు ఉంటే డెఫినెట్‌గా మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అయ్యేది. దర్శకుడు ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ కథ విస్తరణలో తడబాటు కనిపించింది. అయితే ఎక్కడా బోర్ లేకుండా ఫస్టాఫ్‌ను ముగిస్తారు.
ఇక సెకండాఫ్‌లో కిడ్నాప్ డ్రామా కీలకంగా మారుతుంది. అయితే అడల్డ్ కంటెంట్‌కు కాస్త ఎక్కువగా స్కోప్ ఇవ్వడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందనిపిస్తుంది. కానీ క్లైమాక్స్‌ను డైరెక్టర్ డీల్ చేసిన విధానం బాగుంది. ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడం బాగుంది.
శ్రీహాన్, జబర్దస్త్ అజయ్, లంబు, ఎల్బీ తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీహాన్ సినిమాను తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. కొత్తవాడైనా పరిణితితో కూడిన నటనను ప్రదర్శించాడు. యూత్‌ఫుల్ సినిమాల్లో ఉండే జోష్‌ను పండించారు. ఎస్సైగా షియాజీ షిండే తన పాత్రకు న్యాయం చేశారు. సద్దా కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది.
సాంకేతిక విభాగాల అంశాల విషయానికి వస్తే.. శ్యామ్ ప్రసాద్ వీ, ఉరుకుంద రెడ్డి సినిమాకు తగినట్టుగా సన్నివేశాలను తెరకెక్కించారు. కొన్ని ఎపిసోడ్స్ రిచ్‌గా ఉన్నాయి. ప్రతీక్ నాగ్ సంగీతం బాగుంది. ఇతర విభాగాల తమ బాధ్యతల పరిధి మేరకు ఒకే అనిపించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నంద్యాల మధుసూదన్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాను క్వాలిటీగా మార్చాయి.
యూత్‌ఫుల్, కామెడీ అంశాలతో సాగే ఎంటర్‌టైనర్ ఆవారా జిందగీ. కొత్త నటీనటులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కథ, కథనాలపై మరింత వర్క్ చేసి ఉంటే మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అయి ఉండేది. యూత్ ఫుల్ కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











