Biker Movie Public Talk: బైకర్ మూవీ పబ్లిక్ టాక్.. శర్వానంద్ సినిమా ఎలా ఉందంటే?

Biker Movie Public Talk: యంగ్ హీరో శర్వానంద్, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లెటెస్ట్ మూవీ 'బైకర్'. ఈ సినిమాలో మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మేళవిస్తూ దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

టెక్నికల్ టీమ్ పరంగా చూస్తే సినిమా మంచి స్థాయిలో రూపొందినట్లు తెలుస్తోంది. జిబ్రాన్ సంగీతం అందించగా, జే యువరాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. అనిల్ పసాల ఎడిటింగ్, ఏ.పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్షన్‌తో సినిమా విజువల్‌గా మరింత గ్రాండ్‌గా కనిపించేలా తీర్చిదిద్దారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, అంతకుముందు ఏప్రిల్ 2న అమెరికా సహా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలో బైకర్ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది? ప్రేక్షకుల అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..

Biker Movie Public Talk  Sharwanand s Racing Drama public review audience response

'బైకర్' సినిమా ప్రధానంగా బైక్ రేసింగ్ చుట్టూ తిరిగే స్పోర్ట్స్ డ్రామా.ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ సంపాదించుకుంది. ట్రైలర్, టీజర్, ప్రమోషన్స్ అన్ని కలిసి ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మూవీ కేవలం రేసింగ్ మాత్రమే కాకుండా, తండ్రి-కొడుకుల అనుబంధం, వ్యక్తిగత పోరాటం, భావోద్వేగాలు అన్నీ కలిపి కథను తెరకెక్కించారు. ఒక యువకుడు తన కల కోసం చేసే ప్రయాణం, అతడు ఎదురయ్యే సవాళ్లు, కుటుంబంతో ఉన్న భావోద్వేగ బంధాలు అన్ని కలిపి ఒక కమర్షియల్ ప్యాకేజ్‌గా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు.

ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ బైక్ రేసింగ్ సన్నివేశాలే అని టాక్. టెక్నికల్‌గా ఈ సీన్స్ చాలా గ్రాండ్‌గా, రియలిస్టిక్‌గా తెరకెక్కించారంట. ముఖ్యంగా క్లైమాక్స్ రేస్ సీక్వెన్స్ థియేటర్లలో గూస్‌బంప్స్ ఇస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇంతకు ముందు తెలుగు సినిమాల్లో ఇలాంటి రేసింగ్ ఎపిసోడ్స్ చూడలేదని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. స్టంట్స్, కెమెరా వర్క్, సౌండ్ డిజైన్ అన్ని కలిసి ఈ సీన్స్‌ను హైలైట్‌గా నిలబెట్టాయి.'జెర్సీ తరహా కథను బైక్ రేసింగ్‌తో చెప్పినట్టుంది' అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కథలోని కొన్ని ఎమోషనల్ అంశాలు మాత్రం ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకున్నాయి.

నటన విషయానికి వస్తే.. శర్వానంద్ ఈ సినిమాలో తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా అతను ఈ పాత్ర కోసం చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రేసర్‌గా అతని బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్‌లోని ఎనర్జీ అన్ని బాగా వర్క్ అయ్యాయి. చాలా మంది ప్రేక్షకులు 'ఇది శర్వా వన్ మ్యాన్ షో'అని అభిప్రాయపడ్డారు. మరోవైపు డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాలో కీలక పాత్రలో మెప్పించారు. ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన సినిమాకు బలాన్ని ఇచ్చింది. కొంతకాలం తర్వాత ఆయనకు వచ్చిన మంచి పాత్రగా ఇది నిలిచిందని టాక్ వినిపిస్తోంది.

టెక్నికల్ అంశాల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉందని టాక్. సినిమాటోగ్రఫీ విజువల్‌గా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందట. బైక్ రేసింగ్ సన్నివేశాల్లో కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. సౌండ్ డిజైన్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయిందట. ముఖ్యంగా రేస్ సీన్స్‌లో సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్ అనుభూతిని పెంచాయనీ, జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఫాదర్-సన్ బాండింగ్ కథలో మెయిన్ ఎలిమెంట్ అయినప్పటికీ, అది పూర్తిగా ప్రేక్షకులను కనెక్ట్ చేయలేదని కొందరు అభిప్రాయపడ్డారు.

ఇక సోషల్ మీడియా రివ్యూలు, పబ్లిక్ టాక్ చూస్తే.. ఈ సినిమాకు కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చినట్టు తెలుస్తోంది. కొందరు 'బ్లాక్‌బస్టర్ అవుతుంది', "శర్వా పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది" అని ప్రశంసిస్తుండగా, మరికొందరు 'స్టోరీ కాస్త వీక్', 'స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉంది' అంటూ విమర్శిస్తున్నారు. ఈ రెండు రకాల స్పందనలు సినిమా ఎలా ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మొత్తంగా చూస్తే 'బైకర్' ఒక డీసెంట్ కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా. బైక్ రేసింగ్, యాక్షన్, విజువల్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. అయితే స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామా ఆశించే వారికి మాత్రం నచ్చకపోవచ్చు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాలి.

Read more about: Biker malvika nair sharwanand
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X