Biker Movie Twitter Review: బైకర్ మూవీ ట్విట్టర్ రివ్యూ
యంగ్ హీరో శర్వానంద్, యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన మూవీ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించారు. బైక్ రేసింగ్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా బైకర్ చిత్రాన్ని నిర్మించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. జిబ్రాన్ మ్యూజిక్ సంగీత దర్శకత్వం వహించగా.. జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో బైకర్ మూవీపై హైప్ నెలకొంది. ఏప్రిల్ 3వ తేదీన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఏప్రిల్ 2వ తేదీన అమెరికాతో పాటు ఇండియాలో ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైకర్ సినిమాపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటీ? క్రిటిక్స్ రివ్యూ ఏమిటీ? అనే వివరాలు పరిశీలిస్తే..

బైకర్ సినిమా చూశాను. ఓసారి అలా చూడొచ్చు. శర్వానంద్ లుక్ బాగున్నది. జెర్సీ స్టోరీకి క్రికెట్ తీసేసి మోటో రేసింగ్ పెట్టినట్టు ఉంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
బైకర్ సినిమాను ఎపిక్ స్క్రీన్‌లో చూశాను. ఫస్టాఫ్ బాగాలేదు. సెకండాఫ్ బాగుంది. ఈ సినిమాకు నా రేటింగ్ 2.5-2.75 అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.
బైకర్ సినిమా నన్ను బాగా డిజాపాయింట్ చేసింది. ఈ సినిమా టెక్నికల్‌గా రిచ్‌గా ఉంది. సౌండ్ డిజైన్ బాగుంది. కెమెరా వర్క్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లేలో పంచ్ లేదు. ఎమోషన్స్ సరిగా పండలేదు. కొన్ని సీన్లు అనవరంగా వచ్చి సినిమాను ల్యాగ్‌గా మార్చాయి. క్లైమాక్స్‌లో రేసింగ్ ఎపిసోడ్ గుడ్. మిగితా సినిమా అంత గొప్పగా లేదు అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజశేఖర్‌కు కమ్ బ్యాక్ మూవీ. బుల్లెట్ సునీల్‌గా ఫెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్. చాలా రోజుల తర్వాత ఆయనకు మంచి రోల్ పడింది. ఎమోషనల్ సీన్లలో అాదరగొట్టాడు. క్లైమాక్స్‌లో రేస్ సీన్లలో సౌండ్ డిజైన్ బాగుంది. శర్వానంద్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications