Biker Movie First Review: బైకర్ మూవీ ఫస్ట్ రివ్యూ
యువ హీరో శర్వానంద్, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్, యువ హీరోయిన్ మాళవిక నాయర్ నటించిన తాజా చిత్రం బైకర్. బైక్ రేస్ నేపథ్యంగా యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి రచన, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్ని పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డ, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంట్‌గా సాగే ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పసాల ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏప్రిల్ 3వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) జారీ చేసిన సర్టిపికెట్ ఏంటి? ఈ సినిమాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ మూవీ రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

బైకర్ సినిమా కథ విషయానికి వస్తే.. వికాస్ నారాయణ్‌కు బైక్స్ అన్నా.. బైక్ రేసింగ్ అన్నా ప్రాణం. బైక్ రేసింగ్ టెక్నిక్, బైక్ నడపడంలో కంట్రోల్‌పై పట్టు సాధించడం బలం. తండ్రి (రాజశేఖర్)తో ఇగో ప్రాబ్లెం కొనసాగుతుంటుంది. ఫ్యామిలీ, ఫాదర్ మధ్య మానసిక సంఘర్షణ వికాస్ రేసింగ్ ట్రాక్‌పై ఎలాంటి ప్రభావం చూపించింది. ఒక వ్యక్తి డ్రీమ్, మరొకరి కెరీర్ పట్ల చోటు చేసుకొన్న ఊగిసలాట. లైఫ్ గేమ్‌లో, బైక్ రేసింగ్‌లో వికాస్ ఎలా విజయం సాధించాడు? తండ్రి ఇగోను, భార్య డ్రీమ్‌ను ఎలా ఫుల్‌ఫిల్ చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే బైకర్ సినిమా కథ.
బైకర్ ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్, కుటుంబం మధ్య మానసిక సంఘర్షణ సాగే ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్ బోర్డు సభ్యులు, అధికారులు డైలాగ్స్, సన్నివేశాల్ల కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే అభ్యంతరాలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని కొన్నింటికి వివరణ ఇచ్చారు. దాంతో ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ జారీ చేశారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక బైకర్ సినిమాకు సెన్సార్ బోర్డు సంతృప్తి చెందిన తర్వాత ఈ సినిమాకు యూ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం 13 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు ఈ సినిమాను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 13 ఏళ్ల కంటే తక్కువగా ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ తమ సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.
బైకర్ సినిమా కథ విస్తృతి, రేసింగ్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండటం, ఫాదర్, సన్ కాంబినేషన్ సీన్లు ఎమోషనల్‌గా ఉండటం వల్ల నిడివి పెరిగింది. దాంతో ఈ సినిమా నిడివిని 2 గంటల 42 నిమిషాలు అంటే.. 162 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా సెన్సార్ రివ్యూ తర్వాత పాజిటివ్ టాక్ కొంత కనిపిస్తున్నది. ఈ సినిమాపై ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











