Bison Movie Review: బైసన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి, అమీర్, లాల్, కే పాండియన్, మదన్ కుమార్ దక్షిణామూర్తి తదితరులు
రచన, దర్శకత్వం: మరీ సెల్వరాజ్
నిర్మాతలు: సమీర్ నాయర్, పా రంజిత్, అదితి ఆనంద్
సినిమాటోగ్రఫి: ఎజిల్ అరసు కే
ఎడిటింగ్: శక్తి తిరు
మ్యూజిక్: నివాస్ కే ప్రసన్న
బ్యానర్: అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, నీలమ్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2025-10-17
కులం పట్టింపులు, సామాజిక పరంగా గొడవలు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని మారుమూల ప్రాంతానికి చెందిన కిట్టన్ (ధృవ్ విక్రమ్)కు కబడ్డీ ఆట అంటే ప్రాణం. ప్రాణం పెట్టి ఉత్తమ ప్రతిభ చాటడంతో జపాన్‌లో జరిగే 1994 సంవత్సరంలో జరిగిన ఆసియా గేమ్స్‌లో పాల్గొనే కబడ్డీ జాతీయ జట్టులో చోటు సంపాదిస్తాడు. రాణి (అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడుతాడు.కబడ్డీ, రాణితో ప్రేమను కొనసాగిస్తూ లైఫ్‌ను ఆస్వాదిస్తుంటాడు. ఆ క్రమంలో అనూహ్యంగా కిట్టన్‌ను కబడ్డీ ఆడకూడదని తండ్రి (పశుపతి) ఆంక్షలు పెట్టి తన ఆశలు, ఆశయాలపై నీళ్లు జల్లుతాడు.

కబడ్డీ ఆట అంటే కిట్టన్‌కు ఎందుకు అంత ఇష్టం ఏర్పడింది? భారత జట్టుకు ఎంపికయ్యే క్రమంలో కుల, సామాజిక, రాజకీయ ప్రతికూలతను ఎలా ఎదుర్కొన్నాడు? తన గ్రామంలోని రెండుకులాల మధ్య చిచ్చు కిట్టన్ ఆటకు అడ్డుగా మారింది. పాండిరాజన్ (అమీర్), కందస్వామి (లాల్) గ్రూపుల మధ్య వైరం ఏమిటి? రాణితో ప్రేమ వ్యవహారం ఎలా నడిచింది. దేశ క్రీడా జట్టుకు ఎంపికై అంతర్జాతీయ వేదికలపై తన సత్తాను నిరూపించుకొనే సమయంలో కిట్టన్‌పై తండ్రి ఎందుకు ఆంక్షలు విధించాడు. పాకిస్థాన్‌తో జరిగే భారత్ మ్యాచ్ నుంచి కిట్టన్‌ను ఎందుకు తప్పించారు? జపాన్ ఆసియా క్రీడల్లో చివరకు కిట్టన్ పాల్గొన్నాడా? దేశ ప్రతిష్టను ఆసియా క్రీడల్లో చాటాడా? అనే ప్రశ్నలకు సమాధానమే బైసన్ సినిమా కథ.
సామాజిక, కుల అంశాలతో కబడ్డీ క్రీడ బ్యాక్ డ్రాప్‌తో దర్శకుడు మారి సెల్వరాజ్ అల్లుకొన్న కథ అత్యంత భావోద్వేగమైనది. అర్జున అవార్డు సాధించిన తమిళనాడు కబడ్డీ ఆటగాడు మనతి గణేషన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రాంతీయాభిమానం, దేశభక్తి, క్రీడా రాజకీయాలు, గ్రామీణ రాజకీయాలను కలబోసి రాసిన కథలో కిట్టన్ పాత్రను డిజైన్ చేసిన విధానం పక్కాగా ఉందనే చెప్పాలి. ఇలాంటి ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాను వాస్తవానికి, జీవితాలు ప్రతిబింబించేలా అత్యంత సహజంగా తెరకెక్కించిన విధానం ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉంటుంది.
1990 నాటి వాస్తవ పరిస్థితులను కళ్లకట్టినట్టు చూపించిన విధానం, గ్రామస్థాయిలో కులం పేరిటి పగ, ప్రతీకారాలు ఎలా ఉంటాయి? ఆ కారణంగా యువత ఎలాంటి ప్రతికూలతలను ఎదిరించాల్సి వస్తుందనే విషయానికి ప్రేమ కథను కూడా జోడించి సినిమాకు ఆడియెన్‌ను కనెక్ట్ అయ్యేలా చేశాడు. అయితే కథను నేచురల్‌గా చెప్పే విధానం సాగదీసినట్టు, సన్నివేశాల్లో వేగం లోపించి నత్త నడకన నడిచాయనే ఫీల్‌ను అక్కడక్కడ కలిగిస్తాయి. అంతా ఊహించినట్టే ముగింపు, ఇతర అంశాలు సాగడం ఈ సినిమాను రెగ్యులర్'గా మార్చేశాయా అనే సందేహం కలుగుతుంది.
నటీనటులు విషయానికి వస్తే.. కిట్టన్ పాత్రలో ధ్రువ్ విక్రమ్ పవర్‌ఫుల్‌గా కనిపించడమే కాకుండా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. కబడ్డీ ఆటగాడికి కావాల్సిన బాడీతోపాటు బాడీ లాంగ్వేజ్‌ను చూపించిన విధానం ఎక్సలెంట్‌గా ఉంది. ప్రతీ సీన్‌లోను కంటిచూపు తిప్పుకొలేని విధంగా తన యాక్టింగ్ ప్రతిభను తెర మీద చూపించాడు. యాక్షన్, ఫైట్స్, కబడ్డీ ఆటలో అత్యంత సహజంగా నటించి మెప్పించాడు. రాణిగా అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన టాలెంట్‌ను పూర్తిస్థాయిలో ప్రదర్శించి తన బెస్ట్‌ను ఇచ్చే ప్రయత్నం చేశారు. లవ్ ట్రాక్‌లో ధ్రువ్‌తో కలిసి మంచి కెమిస్ట్రినీ ప్రదర్శించారు. పశుపతి, లాల్, అమీర్, స్కూల్ టీచర్‌గా మదన్ కుమార్ దక్షిణామూర్తి గుర్తుండిపోయే పాత్రలను చేశారు.
బైసన్ సినిమాను సాంకేతిక అంశాలు పర్‌ఫెక్ట్ స్పోర్ట్స్ డ్రామాగా మార్చాయి. ఎజిల్ అరసు చిత్రీకరించిన సన్నివేశాల్లో భావోద్వేగాలు, యాక్షన్ అంశాలు మనసుకు హత్తుకొనేలా ఉన్నాయి. నివాస్ కే ప్రసన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు తెలుగు నేటివిటి మిస్ అయ్యాయి. శక్తి తిరు ఎడిటింగ్ విభాగం పనితీరు సినిమాను మరింత క్రిస్పీగా మార్చింది. పా రంజిత్ ఇతర నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
బైసన్ సినిమా విషయానికి వస్తే.. ధ్రువ్ విక్రమ్ పెర్ఫార్మెన్స్, ఆయన పాత్రతోపాటు పశుపతి ఇతర క్యారెక్టర్లను చిత్రీకరించిన తీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారింది. కథ, కథనాలు మరో ప్లస్ పాయింట్, ఫస్టాఫ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది. కానీ రెండో భాగంలో అంతా ఊహించినట్టే సన్నివేశాలు ఉండటం కొంత మైనస్., తమిళ వాసన ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు రుచించని అంశంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఆద్యంతం కట్టిపడేసే కథనం, ఆలోచింపజేసే కథ, స్పోర్ట్స్, దేశభక్తిని రగిలించే అంశాలు ఉన్న ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. హై ఎండ్ థియేట్రికల్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. ఎలాంటి అంచనాలు ఉన్న చక్కటి అనుభూతిని పంచే మూవీ బైసన్. ఈ వారం థియేటర్‌లో చూడటానికి, సినిమాటిక్ అనుభూతిని పొందడానికి ప్రేక్షకులకు, సినీ అభిమానులకు చక్కటి ఆప్షన్. డోంట్ మిస్ బైసన్ దిస్ వీక్.


Click it and Unblock the Notifications











