Blast Movie Review: బ్లాస్ట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి, జాన్ కొక్కేన్, పవన్ కృష్ణ, అర్జున్ చిదంబరం తదితరులు
దర్శకత్వం: సుభాష్ కే రాజ్
నిర్మాతలు: కల్పతి ఎస్ ఆఘోరమ్, కల్పతి ఎస్ గణేష్, కల్పి ఎస్ సురేష్
మ్యూజిక్: రవి బస్రూర్
సినిమాటోగ్రఫి: అరుణ్ రాధాకృష్ణన్
ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్
ప్రొడక్షన్ డిజైనర్: వీరమణి గణేషన్
ఫైట్స్: ఫోనిక్స్ ప్రభు
క్యాస్టూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్
బ్యానర్: ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2026-05-28
హెడ్మాస్టర్‌గా వృత్తిని కొనసాగించే రాజారామన్ (అర్జున్ సర్జా) మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. టైలర్ పని చేసుకొంటూ నీలవేణి (అభిరామి) భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. చిన్నతనం నుంచే అన్యాయంపై తిరుగుబాటు చేయాలంటూ కూతురు నీల (ప్రీతి ముకుందన్)కు కరాటే ట్రైనింగ్ ఇచ్చి మానసికంగా సంసిద్దం చేస్తారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా మెడికల్ షాపును నడిపుకొంటూ సంతోషంగా జీవిస్తుంటారు. అయితే పారిశ్రామిక వేత్త వరుణ్ దయాళ్ (జాన్ కొక్కెన్) 7000 కోట్ల ఓ భారీ కాంట్రాక్ట్ కోసం 1000 కోట్ల రూపాయలు హవాలా చేయడానికి 100 రూపాయల నోటును వాడుకొంటారు. ఆ 100 రూపాయల నోటు రాజరామన్, ఆయన కూతురును పెద్ద సమస్యలో పడేస్తుంది. దాంతో జాన్ కొక్కెన్ రాజా రామన్ కుటుంబాన్ని మట్టుపెట్టడానికి కుట్ర పన్నుతాడు.
రాజా రామన్ తన కూతురు నీలను ఎలా పెంచాడు? స్త్రీ శక్తి ప్రాముఖ్యతను నీలకు చిన్నతనం నుంచే ఎలా తెలియజేశాడు? తండ్రి బాటలో నీల ఎలా ప్రయాణించింది? వరుణ్ దయాళ్ కాంట్రాక్టు వెనుక కుట్ర ఏమిటి? ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న రాజా రామన్ ఫ్యామిలీకి ఆ కుట్ర ఎలా లింక్ అయింది? రాజ రామన్ 1000 హవాలా వ్యవహారం ఎలా బెడిసి కొట్టింది? 7000 కోట్ల కాంట్రాక్టును ప్రీతి అడ్డుకొనేందుకు కారణం ఏమిటి? వరుణ్ మాఫియా సామ్రాజ్యాన్ని రాజారామన్ ఫ్యామిలీ కలిసి కట్టుగా ఎలా ఎదుర్కొన్నది? అనే ప్రశ్నలకు సమాధానమే బ్లాస్ సినిమా కథ.

బ్లాస్ట్ సినిమా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ఫ్యామిలీ డ్రామాను దర్శకుడు సుభాష్ ఎంచుకొన్న తీరు.. పాత్రలను మలిచిన విధానం బాగుంది. ఫస్టాఫ్‌లో స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకోవడం కొంత విసుగు, బోర్ కొట్టించేలా ఉంటుంది. ఎప్పడైతే కథలోకి వెళ్లి సన్నివేశాలు యాక్షన్ మోడ్‌లో వెళ్లాయో.. అప్పటి నుంచి సినిమా వేగంగా పరుగులు పడుతుంది. ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ వల్లే సెకండాఫ్‌పై మంచి ఆసక్తిని కలిగేలా చేస్తుంది.
బ్లాస్ట్ సినిమా సెకండాఫ్‌లో మాఫియా గ్యాంగ్‌ను రాజరామన్ ఫ్యామిలీ ఎదుర్కొనే తీరు, యాక్షన్ సీన్ల కోసం కంపోజ్ చేసిన కొరియోగ్రఫి ప్రేక్షకులను సీట్లకు అత్తుకుపోయేలా చేస్తుంది. సెకండాఫ్‌లో ఓ మంచి సెంటిమెంట్ పాయింట్‌ను లింక్ చేయడం బాగుంది. కానీ పూర్తిగా ఆ పాయింట్ రిజిస్టర్ అయ్యేలా చేసి ఉంటే కథకు మరింత బలం చేకూరేలా మారేదనిపిస్తుంది. ఇటీవల కాలంలో మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్‌తో వచ్చిన క్లీన్ ఎంటర్‌టైనర్ బ్లాస్ట్ అని చెప్పవచ్చు.
రాజారామన్ పాత్రలో అర్జున్ సర్జాను మరోసారి వింటేజ్ లుక్, రోల్‌లో చూసే ఛాన్స్ దక్కిందని చెప్పాలి. మధ్య తరగతి స్కూల్ మాస్టర్ పాత్రలో యాక్షన్ కింగ్ చక్కగా ఒదిగిపోయాడు. ప్రతీ ఇంట్లో ఓ ఫాదర్ అలా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కల్పించాడు. ఇక ప్రీతి ముకుందన్ చలాకీగా, చురుకుగా, గ్లామరస్‌గానే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకొన్నారు. అభిరామి కూడా మధ్య తరగతి గృహిణిగానే కాకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొన్న మహిళగా ఆకట్టుకొన్నది. అర్జున్‌తోపాటు ఇద్దరు కూడా తామేమి తక్కువ కాదన్నట్టు నటించారు.
టెక్నికల్ విభాగాల విషయానికి వస్తే.. ఫైట్స్ కంపోజర్ ఫోనిక్స్ ప్రభుకు 100 మార్కులు వేయాల్సిందే. ఈ సినిమాలో ఫీల్ గుడ్‌గా యాక్షన్ సీన్లను కంపోజ్ చేసిన తీరు చాలా బాగున్నది. ఇటీవల కాలంలో ఇలాంటి హై ఎండ్ యాక్షన్ మూవీ రావడం అరుదుగా కనిపిస్తుంది. ఇక రవి బస్రూర్ మ్యూజిక్ చాలా సీన్లను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. ఏజీఎస్ బ్యానర్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రమే కాకుండా టీనేజ్ అమ్మాయిలందరూ ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి. మహిళా చైతన్యం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాను ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో చేర్చుకోవచ్చు. ఈ సినిమా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం. కాబట్టి వీలైతే తప్పకుండా థియేటర్‌లోనే చూడమని సలహా.


Click it and Unblock the Notifications