Blast Twitter Review: బ్లాస్ట్ మూవీ ట్విట్టర్ రివ్యూ
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన తాజా చిత్రం బ్లాస్ట్ జోన్. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అభిరామి తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ ఆఘోరమ్, కల్పతి ఎస్ గణేష్, కల్పి ఎస్ సురేష్ నిర్మాతలుగా నిర్మించారు. ఈసినిమాకు తొలి చిత్ర దర్శకుడిగా సుభాష్ కే రాజ్ వ్యవహరించారు.
ఈ సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: రవి బస్రూర్, సినిమాటోగ్రఫి: అరుణ్ రాధాకృష్ణన్, ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్, ప్రొడక్షన్ డిజైనర్: వీరమణి గణేషన్, ఫైట్స్: ఫోనిక్స్ ప్రభు, క్యాస్టూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా మే 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. దళపతి విజయ్‌తో బిగిల్, గోట్ సినిమాలు నిర్మించిన ఏజీఎస్ బ్యానర్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఫస్ట్ షో, ప్రీమియర్ల తర్వాత నెటిజన్లలో ఎలాంటి టాక్ ఉంది? క్రిటిక్స్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తున్నది? ట్విట్టర్‌లో ఈ సినిమా గురించి రివ్యూలు ఎలా వస్తున్నాయి? అనే వివరాల్లోకి వెళితే..

బ్లాస్ట్ సినిమా ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకొంటారో అలాంటి అంశాలతో మూవీ వస్తున్నది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన ట్రేడ్ మార్క్ పవర్‌ను చూపించారు. ప్రీతి ముకుందన్, అభిరామి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఈ ముగ్గురి ఎలివేషన్స్ కథను కొత్తగా చెప్పేందుకు ఉపయోగపడుతాయి. మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ పొందిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ ఇది. డిఫరెంట్ యాక్షన్ ఫ్లేవర్‌తో సినిమాను రూపొందించారు. అర్జున్ సర్జా కరాటే మాస్టర్‌గా కనిపిస్తారు. మార్షల్ ఆర్ట్స్‌లో తన ప్రావీణ్యాన్ని చూపించబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన పోషించిన పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు అదే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కానున్నది అని నెటిజన్ అభిప్రాయపడ్డారు.
బ్లాస్ట్ సినిమా సమ్మర్ సెలవుల్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమా. సోలో హీరోగా అర్జున్ సర్జాకు మరోసారి మార్కెట్ పెంే సినిమా అవుతుంది. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది. ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ సీన్లు ఈ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించాయి అని నెటిజన్ అభిప్రాయపడ్డారు.
సమ్మర్ సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌గా బ్లాస్ట్ సినిమా అనిపిస్తున్నది. యాక్షన్ కింగ్ అర్జున్ తన వింటేజ్ లుక్‌తో పర్‌ఫెక్ట్ రోల్ చేశారు. ప్రీతి ముకుందన్, అభిరామి తమ పెర్ఫార్మెన్స్‌తో ఇప్పటికే ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్నారు. ఎమోషన్స్, ఇంటెన్సిటీ మిక్స్ చేసిన ఫ్రెష్, యాక్షన్ ప్యాక్డ్ సినిమాను ఏజీఎస్ ప్రొడక్షన్స్ అందించింది అని క్రిటిక్ రమేష్ బాలా పేర్కొన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన బ్లాస్ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. ప్రీతి ముకుందన్, అభిరామి ఈ సినిమాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్‌గా మారారు. ట్రైలర్ ఈ సినిమా అంచనాలు పెంచింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకోంటారో వేచి చూడాల్సిందే అని క్రిటిక్ ఆమద భారతీ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications