Blast First Review: బ్లాస్ట్ మూవీ ఫస్ట్ రివ్యూ
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన తాజా చిత్రం బ్లాస్ట్ జోన్. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అభిరామి తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ ఆఘోరమ్, కల్పతి ఎస్ గణేష్, కల్పి ఎస్ సురేష్ నిర్మాతలుగా నిర్మించారు. ఈసినిమాకు తొలి చిత్ర దర్శకుడిగా సుభాష్ కే రాజ్ వ్యవహరించారు.
ఈ సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: రవి బస్రూర్, సినిమాటోగ్రఫి: అరుణ్ రాధాకృష్ణన్, ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్, ప్రొడక్షన్ డిజైనర్: వీరమణి గణేషన్, ఫైట్స్: ఫోనిక్స్ ప్రభు, క్యాస్టూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా మే 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

మిడిల్ క్లాస్ కుటుంబానికి పెద్దగా వ్యవహరించే రాజరామన్ (అర్జున్) హెడ్మాస్టర్. భార్య నీలవేణి (అభిరామి), కూతురు నీల (ప్రీతి ముకుందన్) సంతోషంగా లైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతూ భార్య టైలర్‌గా అండగా ఉండటంతో కాలం సాఫీగా గడిచిపోతుంటుంది. ఈ క్రమంలో ఈ కుటుంబానికి, ముఖ్యంగా కూతురుకు ఓ మాఫియా గ్యాంగ్ నుంచి సమస్య ఎదురువుతుంది. ఆ సమస్య ఏమిటి? ఆ ప్రాబ్లెంను కుటుంబం కలిసి ఎలా ఎదురించారు. రాజా రామన్ వారికి ఎలా స్పూర్తిని అందించారు. మహిళా చైతన్యం నేపథ్యంగా సాగే ఈ సినిమాను ఇటీవల రివ్యూ చేశారు.
ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్, కథ, కథనాలను క్షుణ్ణంగా పరిశీలించిన సెన్సార్ బోర్డు అధికారులు పెద్దగా అభ్యంతరాలు తెలియజేయకుండానే ఒకే చేశారు. కొన్ని మార్పులు, చేర్పులు సూచించగా. వాటిని చిత్ర యూనిట్ సానుకూలంగా పరిష్కరించారు. ఈ చిత్రంలో వచ్చే యాక్షన్ సీన్లు, ట్విస్టులు, ఎమోషన్స్‌ను సెన్సార్ బోర్డు అధికారులు ప్రశంసించారు. మహిళలకు స్పూర్తిని అందించే సన్నివేశాలు సినిమాకు ఆకర్షణగా మారుతాయని చెప్పారు.
బ్లాస్ట్ సినిమాను రివ్యూ చేసిన అనంతరం ఈ మూవీకి యూఏ (UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే యాక్షన్ సీన్లు, వయోలెన్స్ ఎక్కువగా ఉండటం కారణంగా ఈ సర్టిఫికెట్ జారీ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సెన్సార్ నిబంధనల ప్రకారం.. ఈ చిత్రాన్ని 16 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అభ్యతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సూచించారు.
పిల్లలను తల్లిదండ్రులు ఎలా పెంచాలి? ఏదైనా సమస్య వస్తే కన్న బిడ్డలు ఎలా రియాక్ట్ అవ్వాలనే కోణంలో సాగే ఈ సినిమాలో దాదాపు 9 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ఎలిమెంట్స్ అలరిస్తాయి.ఈ క్రమంలో ఈ సినిమా నిడివిని బ్యాలెన్స్‌గా ఫిక్స్ చేశారు. ఈ చిత్రం నిడివి 2 గంటల 24 నిమిషాలు అంటే.. మొత్తంగా 144 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు అని వెల్లడించారు. ఈ చిత్రం ఫ్యామిలీనే కాకుండా యూత్‌ను ఆకట్టుకొనే అవకాశం ఉందని సెన్సార్ రిపోర్ట్ ద్వారా బయటకు తెలిసింది.


Click it and Unblock the Notifications