For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  బ్లఫ్ మాస్టర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: నందిత శ్వేత, సత్యదేవ్, పృథ్వీ
  Director: గోపి గణేష్ పట్టాబి

  ఆదిత్య 369, జెంటిల్మన్, సమ్మోహనం లాంటి చిత్రాలను అందించిన శ్రీదేవి మూవీస్ బ్యానర్‌ సమర్పించిన తాజా చిత్రం బ్లఫ్ మాస్టర్. అభిషేక్ ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన షతురంగ వేట్టై సినిమాకు రీమేక్. సమకాలీన పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న రెండు తలలపాము, రైస్ పుల్లింగ్ లాంటి మోసాలను ప్రధాన అంశాలుగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సత్యదేవ్, నందిత శ్వేత హీరో, హీరోయిన్లుగా, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం శ్రీదేవీ మూవీస్ బ్యానర్ ప్రమాణాలకు తగినట్టు ఉందా? సత్యదేవ్, నందిత శ్వేత, గోపి గణేష్‌కు సక్సెస్‌ను అందించిందా అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  బ్లఫ్ మాస్టర్ స్టోరీ

  డబ్బే సర్వస్వంగా భావించే ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) గ్యాంగ్ (చైతన్య కృష్ణ తదితరులు) రకరకాల పేర్లు, వేషాలతో ప్రజలను బురిడీ కొట్టించే వైట్ కాలర్ మోసగాడు. తాను మోసానికి పాల్పడుతున్న క్రమంలో అవని (నందిత శ్వేత) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఇష్టంగా మారుతుంది. ఇదిలా యదేచ్ఛగా మోసాలు చేసి ఉడాయించే క్రమంలో పోలీసులకు పట్టుబడుతారు. తమను మోసగించారని కోపంతో బసవ గ్యాంగ్ (ఆదిత్య మీనన్, వంశీ) ఉత్తమ్‌ను చంపడానికి ప్రయత్నిస్తాడు.

  బ్లఫ్ మాస్టర్‌లో ట్విస్టులు

  తనను చంపాడనికి ప్రయత్నించిన గ్యాంగ్‌ను తెలివిగా మోసగించి అక్కడి నుంచి తప్పించుకొంటాడు. ఆ క్రమంలో అవనికి చేరువతాడు. అవని పెళ్లి చేసుకొని దందాలకు దూరంగా బతుకుతుంటాడు. ఆ క్రమంలో బసవ గ్యాంగ్‌ చేతికికు మళ్లీ చిక్కుతాడు. ఆ క్రమంలో ప్రెగ్నెంట్‌గా ఉన్న అవని వదిలేసి ఓ ఆపరేషన్‌ కోసం బయలు దేరుతాడు? తాను చేపట్టిన 100 కోట్ల మోసాన్ని పక్కాగా చేయడంలో సఫలమయ్యాడా? ఈ కథలో ధనశెట్టి (పృథ్వీ) రోల్ ఏంటి? ధనశెట్టిని ఉత్తమ్ ఎలా బురిడీ కొట్టించాడు? నిండు గర్భిణిగా ఉండే అవని పరిస్థితి ఏమైంది? చివరకు ఉత్తమ్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే బ్లఫ్ మాస్టర్ కథ.

  తొలిభాగంలో

  ధనశెట్టి (ఫృథ్వీ)ని మోసచేయడానికి ఉచ్చులోకి దించడమనే పాయింట్‌తో కథ ప్రారంభమవుతుంది. పృథ్వీ మోసపోయిన తీరు, ఆ మోసంలో అనుసరించిన ట్విస్టులు ప్రేక్షకుడిని కథపై పట్టుబిగించేలా చేస్తాయి. పృథ్వీ ఎపిసోడ్‌లో అంతర్లీనంగా ఉండే హాస్యం ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే మోసాలు ప్రజలకు కనువిప్పు కలిగించేలా ఉంటాయి. తొలి భాగంలో పోలీస్ విచారణలో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే తాను మోసగాడికి మారడానికి కారణమైన ఫ్లాష్ బ్యాక్‌ను ఉత్తమ్ చెప్పిన తీరు భావోద్వేగానికి గురిచేస్తుంది.

  సెకండాఫ్‌లో

  రెండవ భాగంలో ఉండే మోసాలు చాలా పక్కాగా, ప్రేక్షకుడిని ఆలోచింప జేసేవిలా ఉంటాయి. ప్రధానంగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం అమ్మకాలపై చూపించిన సెటైర్ చాలా బాగుంది. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే రైస్ పుల్లింగ్ అంశం మరింత ఆసక్తిని కలుగజేస్తుంది. పక్కాగా డిజైన్ చేసిన మోసాలు కథలో టెంపోను పెంచడానికి ఉపయోగపడ్డాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌లో ఓ పక్క పురిటి నొప్పులతో బాధపడే అవని, మరో పక్క తన భార్య కోసం తపన పడే ఉత్తమ్ అంశాలు సినిమాను మరో లెవెల్ తీసుకుపోయాయి. చకచకా సీన్లు పరిగెత్తేలా రాసుకొన్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.

  దర్శకుడు గోపి గణేష్ ప్రతిభ

  తమిళంలో విజయవంతమైన షతురంగ వేట్టైలో ఉండే బలమైన కథను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చడంలో దర్శకుడు గోపి గణేస్ సఫలమయ్యాడు. ధనశెట్టి పాత్రను మలచడంలోను, అలాగే సత్యదేవ్, నందితశ్వేత పాత్రలను డిజైన్ చేసిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. ప్రధానంగా పులగం చిన్నారాయణ సహకారంతో గోపి అందించిన డైలాగ్స్ బ్రహ్మండంగా పేలాయి. కొన్ని సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇక కథలో టెంపోను కొనసాగించిన తీరు చాలా బాగుంది. ఒరిజినల్ కంటే మరింత భావోద్వేగాలను పండించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

  హీరో సత్యదేవ్ యాక్టింగ్

  సహజసిద్ధమైన నటనను ప్రదర్శించే యువ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. ఆయన టాలెంట్‌కు, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగానే ఉండే పాత్రలో సత్యదేవ్ ఒదిగిపోయాడు. ఉత్తమ, ఆకాశ్ విహారి, స్వామి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశాడా అనేంతగా ఫెర్ఫార్మ్ చేశాడు. మల్టీ లెవెల్ మార్కెంటింగ్ ఎపిసోడ్‌లో సత్యదేవ్ చెప్పిన డైలాగ్స్, హావభావాలు ప్రేక్షుకుడి చేత చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. అలాగే రైస్ పుల్లింగ్ ఎపిసోడ్‌లో సత్యదేవ్ నటన హైలెట్ అని చెప్పవచ్చు. తన పాత్రకు 100 శాతం సత్యదేవ్ న్యాయం చేశారానడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

  నందిత శ్వేత ఫెర్ఫార్మెన్స్

  ఎమోషనల్ పాత్రలతో ఆకట్టుకొంటున్న నందితా శ్వేతకు మరోసారి పూర్తిస్థాయిలో తన ప్రతిభను చాటుకొనే పాత్ర లభించింది. అవని పాత్రలో అమాయకురాలిగా చక్కగా మెప్పించింది. కీలక సన్నివేశాల్లో హావభావాలు పలికించిన తీరు మరింత ఆకట్టుకొన్నది. అలాగే సెకండాఫ్‌లో గృహిణిగా తన నటనలో మరో కోణాన్ని చూపించింది. క్లైమాక్స్‌లో పురిటినొప్పుల ఎపిసోడ్‌లో నటిగా నూటికి నూరు మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు.

  పృథ్వీ కామెడీ

  ధనశెట్టిగా పృథ్వీ తన మార్కు కామెడిని పండించాడు. పాము ఎపిసోడ్‌లో ఆయన నటన హైలెట్. శెట్టి పాత్రకు తగినట్టుగా ఆయన గెటప్ హాస్యాన్ని పండించింది. బ్రూస్‌లీ, గోవిందా అంటూ చెప్పిన డైలాగ్స్ అలరించాయి. ప్రీ క్లైమాక్స్‌లో సీరియస్‌గా నటించిన తీరు బాగుంది.

  మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రల్లో సీనియర్ నటుడు సిజ్జు, విలన్ పాత్రల్లో ఆదిత్య మీనన్, వంశీ, బ్రహ్మాజీ తదితరులు నటించారు. సాఫ్ట్ పోలీస్ ఆఫీసర్‌గా సిజ్లు తనదైన మార్కు నటన ప్రదర్శించారు. ఆదిత్య మీనన్ అగ్రెసివ్ పాత్రలో రాణించాడు. ప్రధానంగా క్లైమాక్స్‌లో వంశీ నటన బాగుంది. ఇప్పటి వరకు వంశీ చిన్న విలన్ పాత్రలకే పరిమితమయ్యాడు. ఈ చిత్రంలో వంశీ ఎమోషన్స్ పండించడం అతనిలోని నటుడిని కూడా బయటపెట్టింది. బ్రహ్మాజీ యాక్టింగ్ పాత్రకు అనుగుణంగా బాగుంది.

  సునీల్ కశ్యప్ సంగీతం

  ఇక టెక్నికల్ విభాగాలకు వస్తే.. బ్లఫ్ మాస్టర్‌కు సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఆయన అందించిన పాటలు ఎమోషనల్‌గా సాగాయి. కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మ్యూజిక్ సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. బ్రహ్మ కడలి ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. కొండ మీద పురి గుడిసె సెట్ సింపుల్ అండ్ సూపర్బ్.

  దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫి

  బ్లఫ్ మాస్టర్ చిత్రానికి దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. కొడైకెనాల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. మాంటేజ్ షాట్స్‌తో సాగే పాటలను అద్భుతమైన ఫీల్ అందించేలా షూట్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ మరో ప్లస్ పాయింట్. ఎక్కడా జర్క్స్ లేకుండా సినిమాను సాఫీగా తీసుకెళ్లడంలో ఆయన పనితనం కొట్టొచ్చినట్టు కనిపించింది.

  ప్రొడక్షన్ వాల్యూస్

  శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్, అభిషేక్ ఫిలింస్ అధినేత రమేష్ పిళ్లై సంయుక్తంగా బ్లఫ్ మాస్టర్ చిత్రాన్ని రూపొందించారు. గతంలో వీరు నిర్మించిన చిత్రాల స్థాయిలో నిర్మాణ ప్రమాణాలు ఉన్నాయి. నటీనటులు, సాంకేతిక వర్గాల ఎంపిక బాగుంది. మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు చేసిన ప్రయత్నం సఫలమైందని చెప్పవచ్చు.

  ఫైనల్‌గా

  సమకాలీన సమాజంలో జరిగే హైటెక్ మోసాలు, అన్యాయాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం బ్లఫ్ మాస్టర్. అత్యాశకు వెళ్లి మోసపోయే ప్రజలకు కనువిప్పు కలిగించేలా ఉంది. జీవితం అంటే డబ్బే కాదు.. ప్రేమ కూడామనే సందేశాన్ని ఇచ్చిన చిత్రమని చెప్పవచ్చు. అన్నివర్గాలను ఆకర్షించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొనే అవకాశం ఉంది.

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  కథ, కథనాలు
  సత్యదేవ్, నందితశ్వేత యాక్టింగ్
  పృథ్వీ కామెడీ
  ప్రొడక్షన్ వ్యాల్యూస్
  సినిమాటోగ్రఫి

  మైనస్ పాయింట్స్
  సెకండాఫ్‌లో కామెడీ లేకపోవడం
  సీరియస్ నోట్‌లో సాగడం
  విలన్ పాత్ర బలంగా లేకపోవడం

  తెర ముందు, తెర వెనుక

  సత్యదేవ్, నందిత శ్వేత, పృథ్వీ, బ్రహ్మాజి, ఆదిత్య మీనన్, వంశీ, చైతన్య కృష్ణ, సిజ్జు తదితరులు
  దర్శకత్వం: గోపి గణేష్ పట్టాభి
  నిర్మాతలు: శివలెంక కృష్ణ ప్రసాద్, రమేష్ పిళ్లై
  సంగీతం: సునీల్ కశ్యప్
  సినిమాటోగ్రఫి: దాశరథి శివేంద్ర
  బ్యానర్: శ్రీదేవి మూవీస్, అభిషేక్ ఫిలింస్
  రిలీజ్: 2018-12-28

  English summary
  Nandita Swetha will be seen sharing the screen space with Satyadev in Bluff Master in the direction of Gopi Ganesh Pattabhi. The film is remake of Kollywood hit shaturanga Vettai. This movie set to release on December 28th. In this occassion, Telugu filmibeat brings exclusive review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more