Vasantha Kokila Review: సరిగ్గా నిద్ర పోకుంటే? బాబీ సింహా 'వసంత కోకిల' ఎలా ఉందంటే?

రేటింగ్: 2.25/5

టైటిల్: వసంత కోకిల
నటీనటులు: బాబీ సింహా, కశ్మీరా పరదేశీ, ఆర్య, శరత్ బాబు, రమా ప్రభ తదితరులు
సినిమాటోగ్రఫీ: గోపీ అమర్ నాథ్
సంగీతం: రాజేష్ మురుగేశన్
నిర్మాతలు: రజనీ తాళ్లూరి, రేష్మీ సింహా
కథ, దర్శకత్వం: రమణన్ పురుషోత్తమ
ఓటీటీ విడుదల తేది: మార్చి 3, 2023
ఓటీటీ వేదిక: ఆహా

తమిళనాట మంచి పేరు తెచ్చుకున్న తెలుగు నటుడు బాబీ సింహా. నటుడిగా, విలన్ గా అలరిస్తున్న బాబీ సింహా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వసంత ముల్లై. దీన్ని తెలుగులోకి 'వసంత కోకిల' పేరుతో విడుదలైంది. రమణనన్ పురుషోత్తమ తెరకెక్కించిన ఈ చిత్రంలో కాశ్మీరా పరదేశీ హీరోయిన్ గా నటించగా.. హీరో ఆర్య ముఖ్యపాత్ర పోషించాడు. ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు బాబీ సింహా సతీమణీ రేష్మీ సింహా కూడా ఒక నిర్మాతగా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ లాంచ్ చేయడంతో ఈ సినిమాపై కాస్తా బజ్ క్రియేట్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ 20 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందనే రివ్యూలోకి వెళితే..

కథ:

కథ:

రుద్ర (బాబీ సింహా) సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం సరిగ్గా తిండి, నిద్ర లేకుండా అహర్నిశలు పనిచేస్తుంటాడు. అయినా ప్రాజెక్ట్ వర్కౌట్ కాదు. దీంతో బ్లాక్ అవుట్ అవుతాడు. అప్పుడు అతన్ని తన గర్ల్ ఫ్రెండ్ నిషా (కాశ్మీరా పరదేశీ) హాస్పిటల్ కు తీసుకెళ్తుంది. అప్పుడు డాక్టర్ అతనికి రెస్ట్ అసరం అని చెబుతుంది. అందుకోసం ఇద్దరు టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో అడవిలో ఉన్న వసంత కోకిల అనే హోటల్ లో స్టే చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లిన ఈ ప్రేమ జంటకు విచిత్రమైన సంఘటనలు ఎదురయ్యాయి? ఆ సంఘటనలు ఏంటీ? నిషా ఎందుకు కనిపించకుండా పోయింది? కమల్ (ఆర్య) ఎవరు? అతను నిషాను ఎందుకు చంపాలనుకుంటాడు? వంటి థ్రిల్లింగ్ విషయాల సముహారమే ఈ 'వసంత కోకిల'.

విశ్లేషణ:

విశ్లేషణ:

వసంత కోకిల సినిమా పాయింట్ కొత్తగా ఉంటుంది. అది ఒక మెసేజ్ ఒరియెంటెండ్ మూవీ. అయితే ఆ కథను ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రంగా ఆవిష్కరించారు. కాస్తా థ్రిల్లింగ్ గా అనిపించిన నేరేషన్ మాత్రం అంతగా వర్కౌట్ చేయలేదని ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీగా ప్రారంభమైన ఈ సినిమా సడెన్ గా టైమ్ లూప్ ట్రాక్ తీసుకుంటుంది. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ దానికి సంబంధించిన కథనం చాలా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అయితే దర్శకుడు అనుకున్న కథ క్లియర్ గానే ఉన్నా నేరేషన్ లో మాత్రం తడబడ్డారు.

ఎటు కాకుండా..

ఎటు కాకుండా..


సినిమాలో ఒక జోనర్ నుంచి మరో జోనర్ కు వెళ్లేటువంటి కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు ఒకరకమైన నేరేషన్ తో వెళితేనే ప్రేక్షకులకు అర్థం అవుతుంది. మధ్యలో ఇంకో జోనర్ ను తీసుకొస్తే ఆ కథ రెండింటికీ కాకుండా పోయే అవకాశం ఉంది. ఈ సినిమాలో కూడా అలానే జరిగింది. అటూ పూర్తిగా లూప్ కాన్సెప్ట్ కాకుండా.. ఇటు లవ్ లేదా సస్పెన్స్ డ్రామా కాకుండా పోయింది. మూడింటిని బేస్ చేసుకుని కొత్తగా తెరకెక్కించాలన్న డైరెక్టర్ ప్రయత్నం ఫలించలేదనే చెప్పాలి.

అలా చేస్తే థ్రిల్లర్ అయ్యేది..

అలా చేస్తే థ్రిల్లర్ అయ్యేది..


సినిమా ప్రథమార్థం ఎక్కువగా హీరో పని ఒత్తిడి, లవ్ స్టోరీపైనే నడుస్తుంది. హోటల్ లోకి ఎంట్రీ అయ్యాకే అంటే ఇంటర్వెల్ కు 15 నిమిషాలు ముందు నుంచే అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ మాత్రం మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్, ఆ నేరేషన్ సెకండాఫ్ లో 15 నిమిషాలకే పరిమితం అవుతుంది. ఆ తర్వాత కథ ఇంకో టర్న్ తీసుకుంటుంది. అలా కాకుండా సెకండాఫ్ మొత్తం ఇంటర్వెల్ ట్విస్ట్ పైనే కొనసాగిస్తూ నేరేట్ చేస్తే మంచి థ్రిల్లర్ అయ్యేది. సినిమా నిడివి గంట 46 నిమిషాలు (106 నిమిషాలు). అయితే ప్రథమార్థంలో కొన్ని సీన్లు తగ్గించి ట్విస్ట్ పై కొనసాగిస్తే ఇంకాస్తా మెరుగ్గా ఉండేది. ఈ లూప్ కాన్సెప్ట్ చూసేటప్పుడు చాలా డౌట్స్ వచ్చిన వాటన్నింటికి క్లైమాక్స్ లో క్లారిటీ మాత్రం ఇచ్చేశారు.

ఎవరెలా చేశారంటే..

ఎవరెలా చేశారంటే..

వాల్తేరు వీరయ్య, డిస్కో రాజా, అమ్ము వంటి సినిమాలతో ఆకట్టుకున్న బాబీ సింహా తన నటనతో పర్వాలేదనిపించుకున్నాడు. బ్యూటిఫుల్ కాశ్మీరా పరదేశీ కూడా తన అందం, నటనతో ఆకట్టుకుంది. మిగతా పాత్రల నటన పరిధి మేర బాగుంది. ఇక సినిమా బీజీఎమ్ బాగుంది. సస్పెన్స్ మూడ్ ను బాగానే క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఆర్ట్ వర్క్ ఎంతో బాగుంది. ముఖ్యంగా హోటల్ లోని డిజైనింగ్ సస్పెన్స్ డ్రామాకు బాగా కలిసొచ్చేలా చేశారు.

ఫైనల్ గా చెప్పాలంటే..

ఫైనల్ గా చెప్పాలంటే..

లూప్, లవ్, సస్పెన్స్ అన్ని టచ్ చేసి చివరిగా ఇది ఒక మెసేజ్ ఒరియెంటెడ్ ఫిల్మ్ లా అనిపిస్తుంది. ఒక మనిషికి నిద్ర ఎంత అవసరమో చెప్పే ప్రయత్నం చేశారు. ఎలాంటి స్ట్రెస్, టెన్షన్ లేకుండా సరిపోయో నిద్ర ఉంటే ప్రశాంతంగా ఉండగలం అని ఒక కీ రోల్ తో చెప్పించారు. ఇది ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే కోణం నుంచి తెరకెక్కిన సినిమా. థియేటర్ సంగతి ఎలా ఉన్నా.. ఓటీటీలో మాత్రం చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X