twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫర్వాలేని బాబీ

    By Staff
    |

    Bobby
    -జలపతి
    చిత్రం: బాబీ
    నటీనటులు: మహేష్‌ బాబు, ఆర్తి అగర్వాల్‌, రఘువరన్‌, ప్రకాష్‌ రాజ్‌
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: కె.కృష్ణమోహనరావు
    రచన, దర్శకత్వం: శోభన్‌

    చాలా అవాస్తవికతతో రూపొందించిన ప్రేమకథ చిత్రం బాబీ. కథ గురించి పక్కన పెడితే, లోపాలను కాస్తా దిగమింగుకుంటే..ఈ సినిమా అలరిస్తుంది. మహేష్‌, ఆర్తిల నటనే ప్రాణం మిగతా అంతా సాధారణం. సంగీతం బాగుండడంతో కథలోని అబ్సర్డ్‌ పెద్దగా మనకు తెలియకుండానే సినిమా ముగుస్తుంది. కొత్త దర్శకుడు శోభన్‌ స్క్రీన్‌ ప్లేలో చూపిన బిగువు సినిమా మొత్తమ్మీద దృష్టి పెడితే బాగుండేది.

    మహేష్‌ ఎంత చిలిపిగా నటించాడో, ఆర్తి కూడా అదే స్థాయిలో నటించింది. కేవలం వీరిద్దరే సినిమాను తమ భుజస్కందాలపై వేసుకొని నడిపించారు. అయితే, సి-గ్రేడ్‌ స్థాయి కళాదర్శకత్వం, అనవసరమైన ఛీఫ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌, పోసాని అరుపులు, హోంమంత్రి పాత్ర సినిమాకు పెద్ద అడ్డంకులు.

    రఘువరన్‌ ఒక పారిశ్రామిక వేత్త. ప్రకాష్‌ రాజ్‌ ఆయన ఫ్యాక్టరీలో కార్మికుడు. కానీ కాలక్రమేణా వీరిద్దరూ హైదరాబాద్‌ లో పేరుమోసిన రౌడివర్గాలకు ప్రతినిధులుగా మారుతారు. ఈ కక్షలకు దూరంగా తన కుమారుడు మహేష్‌ బాబును అమెరికాలో పెంచుతాడు రఘువరన్‌. కానీ భారతదేశం మీద ప్రేమతో పాటు 'ఒంట్లో కోరికలను ఆపుకోలేక పెళ్ళిచేసుకోవాల'ని మహేష్‌ బాబు ఇండియాకు వస్తాడు. ఇక్కడికి రాగానే ప్రకాష్‌ రాజ్‌ కూతురు ఆర్తి ప్రేమలో పడుతాడు.

    'తన మనసుకు నచ్చిన అసలైన మగాడు' మహేషే అనుకొని ఆర్తి కూడా ప్రేమలో పడుతుంది. కానీ వీరిద్దరూ తండ్రులు వైరివర్గీయులు కాబట్టి పెళ్ళిచేయరని ఇద్దరూ కలిసి పారిపోతారు. అక్కడ రోడ్డు మీద రోమాన్స్‌, పాటలు, అల్లరి అయింతర్వాత..హైదరాబాద్‌ లో వీరిద్దరి మూలానా గొడవలు అవుతున్నాయని తెలుసుకుంటారు. ఆ గొడవలు ఆపేందుకు వీరు తిరిగి హైదరాబాద్‌ వస్తారు. శత్రువులైన వీరిద్దరు తల్లితండ్రులను ఎలా ఏకం చేసి పెళ్ళిచేసుకుంటారనేది క్లైమాక్స్‌.

    ఆవేశపూరిత డైలాగ్‌ లు, మరీ అధికంగా హింస చూపించకుండా దర్శకుడు శోభన్‌ మంచి పనే చేశాడు. కానీ కాస్తా ఆర్ట్‌ డైరక్షన్‌ మీద కూడా దృష్టిపెడితే బాగుండేది. మహేష్‌ మాటలే ఈ సినిమాలో చాలావరకు నవ్విస్తాయి. ప్రకాష్‌ రాజ్‌, రఘువరన్‌ నటన బాగుంది.

    కానీ మహేష్‌, ఆర్తిలే ఈ సినిమాలో ఎలివేట్‌ అవుతారు నటన విషయంలో. 'అడుగడుగు..', 'పుల్లని పుల్లట్లు..' బాగున్నాయి. కానీ ఒక్క పాట చిత్రీకరణ కూడా అందంగా లేదు. వెంకట్‌ ప్రసాద్‌ ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. మొత్తమ్మీద ఫర్వాలేదనిపించే చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X