twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bomma Blockbuster Review.. నందూ, రష్మీ గౌతమ్ కెమిస్ట్రీ అదుర్స్.. పూరీ జగన్నాథ్ బ్యాక్ డ్రాప్‌తో

    |

    Rating:
    2.5/5
    Star Cast: Nandu, Rashmi Gautam, Raghu Kunche
    Director: Raj Virat

    నటీనటులు: నందూ విజయ్ కల్యాణ్, రష్మీ గౌతమ్, కీర్తీ దామరాజు, రఘు కుంచే తదితరులు
    దర్శకుడు: రాజ్ విరాట్
    నిర్మాతలు: ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిరుమోలు, ఆనంద్ రెడ్డి మడ్డీ, మనోహర్ రెడ్డి ఈడ
    మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారి
    సౌండ్ డిజైనర్: వరుణ్ వేణుగోపాల్
    సినిమాటోగ్రఫి: సుజాత సిద్దార్థ్
    ఎడిటర్: బీ సుభాస్కర్
    బ్యానర్: విజయీభవ ఆర్ట్స్
    రిలీజ్ డేట్: 2022-11-04

    పాపులర్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు పోతురాజు (నందూ విజయ్ కృష్ణ) అభిమాని. తండ్రి అంటే నందూకి ప్రాణం. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకొన్న కథను సినిమా తీయాలనే కలతో ఉంటాడు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వాణి (రష్మీ గౌతమ్)తో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో నందూ తండ్రి దారుణ హత్యకు గురవుతాడు.

    Bomma Blockbuster

    తండ్రి మరణం తర్వాత నందూ జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకొన్నాడు? సినిమా తీయాలనే తన జీవితాశయం తీరిందా? పూరీ జగన్నాథ్‌ను కలిసి కథ వినిపించాలనే కోరిక తీరిందా? వాణితో ప్రేమ వ్యవహారం ఎంత వరకు వచ్చింది. తండ్రిని చంపిన వ్యక్తిపై నందూ ప్రతీకారం తీర్చుకొన్నాడా? తండ్రి చావుకు కారణమైన ఎకరం పోలంలో నిందితుడిని చంపుతానని శపథం చేసిన నందూ.. దానిని తీర్చుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా కథ.

    రంగస్థలం సన్నివేశాలు, ఎమోషన్స్, నేటివిటిని జొప్పించి దర్శకుడు రాజ్ విరాట్ రాసుకొన్న పాయింట్ కొత్తగా ఉంది. పాయింట్‌ను విస్తరించి భావోద్వేగాలను తెరపైన పండించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించడమే కాకుండా.. యువ కళాకారుల నుంచి మంచి ప్రతిభను రాబట్టుకొన్నారు.

    మత్స్యకారుడిగా పోతురాజు పాత్రలో నందూ ఒదిగిపోయాడు. పాత్రకు కావాల్సిన డైలాగ్ డెలీవరి, బాడీ లాంగ్వేజ్‌ను చక్కగా పట్టుకొన్నాడు. మాస్ లుక్స్‌తో సరికొత్తగా స్క్రీన్‌పై తనను తాను ఆవిష్కరించుకొన్నాడు. ఇక రష్మీ గౌతమ్‌తో రొమాంటిక్ సీన్లలో తన స్టైల్ చూపించాడు. వాణిగా రష్మీ గౌతమ్ అలరించింది. నందూతో కలిసి తెరపైన మంచి కెమిస్ట్రీని పండించింది. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా తనదైన శైలిలో నటించింది. రఘు కుంచే, మిగితా పాత్రల్లో నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. వైజాగ్‌ థియేటర్ ఆర్ట్స్‌కు సంబంధించిన ఔత్సాహిక కళాకారులు బ్రహ్మండంగా నటించారు. నేటివిటీని తెరపైన పండించడంలో తమ ప్రతిభను చాటుకొన్నారు.

    సాంకేతిక విభాగాల పనీతీరు విషయానికి వస్తే.. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన పాటలే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫి, ఎంచుకొన్న కలర్ ప్యాలెట్ బాగుంది. నేటివిటిని ఫీల్‌గుడ్‌గా కెమెరాలో బంధించారు. బీ సుభాస్కర్ ఎడిటింగ్, వరుణ్ వేణుగోపాల్ సౌండ్ డిజైనింగ్ సినిమాకు ప్లస్‌గా మారాయి.

    Bomma Blockbuster

    కథ, నటీనటులు ఎంపిక విషయం చూస్తే.. నిర్మాతలు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిరుమోలు, ఆనంద్ రెడ్డి మడ్డీ, మనోహర్ రెడ్డి ఈడ, విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ అభిరుచి ఏమిటో తెలిసిపోయింది. క్వాలిటీని తెరపైన చూపించేందుకు ఖర్చుకు రాజీ పడలేదనే విషయం తెరపైన స్పష్టంగా తెలుస్తుంది. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా ఉంటుంది.

    ఫాదర్ సెంటిమెంట్, లవ్, ఎమోషన్స్, నెటివిటీ అంశాలతో రూపొందిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. నటీనటుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. కథపరంగా అక్కడక్కడ రొటీన్‌గా అనిపిస్తుంది. కొన్ని సీన్లు రెగ్యులర్‌గా అనిపిస్తాయి. ఇలాంటి అంశాలు మినహాయిస్తే.. సినిమా ఫీల్‌గుడ్‌గా సాగిపోతుంది. నెటివిటీ, కొత్తదనాన్ని ఆశించే వారికి సినిమా నచ్చుతుంది.

    English summary
    Nandu, Rashmi Gautam's latest movie Bomma Blockbuster movie hits the theatres on November 4th. Here is the movie exclusive review by Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X