twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ ‘బూచి’ మూవీ రివ్యూ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రక్త చరిత్ర సినిమాతో చాలా కాలం తర్వాత తెలుగులో అడుగు పెట్టిన వర్మ ఆ తర్వాత దొంగల ముఠా, డిపార్ట్‌మెంట్ అనే డబ్బింగ్ సినిమాను తెలుగు ప్రేక్షకులపైకి వదిలాడు కానీ వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ దెయ్యం సినిమాల బాట పట్టిన వర్మ హిందీలో తీసిన భూత్ రిటర్న్ చిత్రాన్ని 'బూచి' పేరుతో టాలీవుడ్‌పైకి వదిలాడు. తన గత చిత్రాల కంటే ఈ చిత్రం మరింత భయ పెడుతుందని చెప్పిన వర్మ ఏ మేరకు ప్రేక్షకులను భయ పెట్టాడో ఓ లుక్కేద్దాం..

    కథలోకి వెళితే...
    తరుణ్(జేడీ చక్రవర్తి) ఒక లగ్జరీ బంగ్లాలోకి చీప్ రెంటుకే అద్దెకు దిగుతాడు. అతని భార్య నమ్రత(మనీషా కొయిరాలా), పిల్లలు పదేళ్ల తమన్, ఆరేళ్ల నిమ్మి(ఆలయానా). తరుణ్ చెల్లెలు పూజ(మధు శాలిని) కొన్ని రోజులు ఇక్కడ గడపడానికి వస్తుంది. నిమ్మి ఎప్పుడూ ఏదో ఊహలో ఉండటం, అక్కడ ఏమీ లేకున్నా ఎవరితోనో మాట్లాడుతున్నట్లు చేస్తుంది. మొదట అంతా నిమ్మి ఊహించుకుని అలా చేస్తుందని అనుకుంటారు. కానీ ఆమె శభు అనే దెయ్యంతో మాట్లాడుతుందని పని వాడు లక్ష్మణ్ తెలుసుకుని పూజలు చేయాలని సలహా ఇస్తాడు. అనంతరం లక్ష్మణ్ కనపడకుండా పోతాడు. కనపడకుండా పోయిన వ్యక్తి కోసం ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తర్వాతి కథ.

    సినిమాలో మైనస్ పాయింట్ ఏమింటే ఇందులో నటనకు పెద్దగా స్కోపు లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత సినిమాల్లో కనిపించిన మనీషా కొయిరాలా ఉన్నంతలో బ్రిలియంట్‌గా నటించింది. జేడీ చక్రవర్తి తన పాత్రలో బాగానే నటించాడు కానీ సినిమా మొత్తం ఒకే రకమైన లుక్స్‌తో బోర్ తెప్పించాడు. మధు శాలిని, చైల్డ్ ఆర్టిస్ అలయ్నా తన పాత్రలో ఇమిడి పోయారు.

    టెక్నికల్ విషయాలకొస్తే సినిమాకు సందీప్ చౌతా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచింది. ఎఫెక్ట్స్ ఆర్టినరిగానే ఉన్నాయి. హర్ష్ రాజ్, రవిచందర్ సినిమాటో గ్రఫీ గుడ్. కానీ 3డి టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసుకోలేక పోయారు. ఎడిటింగ్ వర్క్ కూడా యావరేజ్.

    ఓవరల్‍‌గా సినిమా ఎలా ఉందనే విషయానికొస్తే..... బూచి చిత్రం రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు తీసిన హారర్ చిత్రాల్లో టాప్ ప్లేస్ దక్కించుకోలేక పోయింది. బూచి కంటే వర్మ గతంలో తీసిన రాత్, ఫూంక్ చిత్రాలు చాలా బెటర్. తన గత దెయ్యం సినిమాల్లో ఉపయోగించిన టెక్నిక్సే మళ్లీ ఇందులో రిపీట్ చేసి బోర్ కొట్టించాడు.

    దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
    నిర్మాత: జితేంద్ర జైన్
    సంగీతం: సలీమ్-సులేమాన్
    బ్యాగ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా
    తారాగణం: జేడీ చక్రవర్తి, మనీషా కొయిరాలా, ఆలయానా శర్మ, మధు శాలిని తదితరులు...

    English summary
    Filmmaker Ram Gopal Varma has rocked the Telugu viewers with his stunning crime thriller Rakta Charitra last year. Although his recent movie Department was to release with dubbed version in Telugu, he could not do it due to the poor response. Now, he is back with a horror movie Boochi. But RGV lets you down badly this time. Overall, it can be said that Boochi is not the top horror movie of RGV. It is ranked lowest in the list of RGV's previous horror films like Raat, Bhoot and Phoonk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X