Bookie Movie Twitter Review: బూకి మూవీ ట్విట్టర్ రివ్యూ

విలక్షణ నటుడిగా తమిళ, తెలుగు భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. నటుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా, నిర్మాతగానూ ఆయన సత్తా చాటారు. తాజాగా విజయ్ ఆంటోనీ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం బూకి. దీనిని తమిళ, తెలుగు భాషలలో పూకిగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే తెలుగు ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ మూవీ టైటిల్‌ను బూకిగా మార్చారు. ఈ మూవీకి గణేష్ చంద్ర దర్శకత్వం వహించగా ఫాతిమా విజయ్ ఆంటోనీ కంపెనీ, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోనీలు నిర్మించగా.. మీరా విజయ్ ఆంటోనీ సమర్పకురాలిగా వ్యవహరించారు.

అజయ్ దిశాన్, ఆర్కే ధనుష, పాండియ రాజన్, సునీల్, మంచు లక్ష్మీ, ఇందుమతి మణిగందన్, ఆదిత్య కథిర్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పండి, బిగ్‌బాస్ సత్య, రాధ, అశ్విన్ రామ్, ప్రియాంక తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రానికి గణేష్ చంద్ర దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. విజయ్ ఆంటోనీ ఎడిటర్‌గా, సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. పుతియ పారితి స్టోరీ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. ఫిబ్రవరి 20వ తేదిన బుకి మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై నెటిజన్లు అందించిన టాక్ ఏమిటీ? క్రిటిక్స్ రివ్యూ ఏమిటీ? అనే వివరాలు పరిశీలిస్తే...

Bookie Movie Twitter Review in Telugu  Is Vijay Antonys Movie hits the bulls eye

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో అల్లిన ఒక సాధారణ ప్రేమ- బ్రేకప్ డ్రామాయే ఈ బూకి. వినోదం, భావోద్వేగాలు కొన్నిచోట్ల వర్కవుట్ అయ్యాయి. పాటలు చాలా నెమ్మదిగా సాగాయి. బ్రేకప్ తర్వాత వచ్చే సీన్స్.. తండ్రి కొడుకుల ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. మొత్తం మీద చూడొచ్చు అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.

ఒక జంట విడిపోవడం గురించి సరదాగా సారే జెన్ జెడ్ ఎంటర్‌టైనర్ బూకి. మంచి తారాగణం, విజయ్ ఆంటోనీ ఫన్ వైబ్ మ్యూజిక్. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ఫస్టాఫ్ బాగుంది, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ డల్‌గా ఉన్నాయి. క్లైమాక్స్ వర్క్ అయ్యింది. మొత్తం మీద చూడొచ్చు అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

More from Filmibeat

Read more about: Bookie vijay antony
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X