Bookie First Review: బూకి (పూకి) తెలుగు మూవీ ఫస్ట్ రివ్యూ

ప్రముఖ ఎడిటర్, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, నటుడు విజయ్ ఆంటోని నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం పూకి. తెలుగు సినీ వర్గాలు, ప్రేక్షకుల అభ్యంతరంతో ఈ సినిమా టైటిల్‌ను బూకిగా మార్చారు. ఈ చిత్రానికి గణేష్ చంద్ర దర్శకత్వం వహించారు. భావోద్వేగమైన ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో లక్ష్మీ మంచు కీలక పాత్రలో నటించగా... అజయ్ దిషాన్, ఆర్కే ధనుషా, పాండ్యరాజన్, శియారా తదితరులు లీడ్ యాక్టర్లుగా నటించారు.

బూకీ సినిమా నిర్మాణంలో కీలక పాత్ర వహించడమే కాకుండా ఎఢిటింగ్, మ్యూజిక్ విభాగాల్ల విజయ్ ఆంటోని తన ప్రతిభను చూపించారు. ఈ చిత్రానికి గణేష్ చంద్ర సినిమాటోగ్రఫిని, ప్రగతీశ్వరన్ పన్నీర్ సెల్వం ఆర్ట్ విభాగం, హరి కరణ్ కొరియోగ్రఫిని అందించారు. ఈ సినిమాకు పుతియా పరితి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. తమిళంలో ఇప్పటికే పూకీ పేరుతో రిలీజైన ఈ చిత్రం ఫిబ్రవరి 20 తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాల గురించిన వివరాల్లోకి వెళితే..

Bookie First Review

బూకీ సినిమా కథ విషయానికి వస్తే.. కైలాష్ (అజయ్ దిషాన్), ఆజీ (ఆర్కే ధనుషా) ఇద్దరు ఆరేళ్లపాటు ప్రేమించుకొంటారు. ఓ అర్ధరాత్రి జరిగిన ఓ వాదన వారి రిలేషన్‌షిప్‌ బీటలు వారేలా చేస్తుంది. ఆ ఆర్గ్యూమెంట్‌తో వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొంటారు. ఆ తర్వాత ఇద్దరు ఇగోలతో ఫైట్స్‌కు దిగుతారు. ఆ ఒక్క సంఘటన ఇద్దరి మధ్య మానసిక సంఘర్షణకు దారి తీయడమే కాకుండా కథకు బలంగా మారుతుంది. ఇద్దరి మధ్య బ్రేకప్‌కు దారి తీసిన వాదన ఏంటి? బ్రేకప్ ఆ ఇద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? మళ్లీ వారి మధ్య ప్రేమ చిగురించిందా? అనేది సినిమా కథ.

నేటితరం యువత అభిప్రాయలు, ఆలోచన విధానానికి అద్దం పట్టేలా రూపొందించిన ఈ సినిమాపై సెంట్రల్ బోర్డు ఆఫ్ సెన్సార్ సర్టిఫికెట్ (CBFC) సానుకూలంగా స్పందించింది. ఈ సినిమాపై పెద్దగా అభ్యంతరాలు తెలియజేయకుండానే క్లీన్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాపై సంతృప్తి చెందిన సెన్సార్ అధికారులు, ప్రతినిధులు యూఏ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాను 13 ఏళ్లకుపైబడిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ తమ సర్టిఫికెట్‌లో స్పస్టం చేశారు.

బూకీ సినిమా కథకు అనుగుణంగా, సన్నివేశాలను సాగదీయకుండా.. క్యూట్, అండ్ ఎమోషనల్ స్టోరీని చెప్పేందుకు తక్కువ నిడివినే సెట్ చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమాను 2 గంటల 12 నిమిషాల నిడివిని అంటే సుమారుగా 132 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు.

ఇదిలా ఉంటే.. గతవారం రిలీజైన పూకీ చిత్రం తమిళనాడులో మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే తెలుగు ప్రేక్షకుల ఈ సినిమాను ఎలా ఆదరిస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విజయ్ ఆంటోనికి మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో ఓపెనింగ్స్ ఏ రేంజ్‌లో వస్తాయనే విషయంపై ట్రేడ్ వర్గాలు దృష్టిపెట్టారు.

More from Filmibeat

Read more about: vijay antony Bookie Ajay Dhishan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X