Border 2 Twitter Review: బోర్డర్ 2 మూవీ ట్విట్టర్ రివ్యూ అండ్ రేటింగ్

హిందీ సినిమా రంగంలో 1997 సంవత్సరంలో సంచలన విజయం సాధించిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన మూవీ బోర్డర్ 2. యాక్షన్, ఇండియన్ వార్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సీరిస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించారు. ఈ మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా డైరెక్షన్‌లో బోర్డర్ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.

ఇండియా, పాకిస్థాన్ మధ్య 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి అన్షుల్ చోబే సినిమాటోగ్రఫి, మనీష్ మోరే ఎఢిటింగ్, జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా పాటలు అందించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా గురించి ఆడియెన్స్, క్రిటిక్స్, నెటిజన్స్ వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

Border 2 Hindi Movie Twitter Review

బోర్డర్ 2 సినిమా మాస్ ఎలిమెంట్స్‌తో ఉన్న దేశభక్తి చిత్రాన్ని అందించింది. లోతైన భావోద్వేగాలు, జాతీయభావం హృదయాన్ని ఉప్పెంగేలా చేసింది. ఇది కేవలం ఓ సినిమా కాదు. ఓ ఎమోషన్. థియేటర్లలో పవర్ ప్యాక్ట్ వార్ మూవీ. ఈ సినిమాకు నా రేటింగ్ 4.5 పాయింట్స్ అంటూ నెటిజన్ పోస్టు పెట్టారు.

బోర్డర్ 2 సినిమా చూశాను. దర్శకుడు అనురాగ్ సింగ్ చాలా నిజాయితీగా, పవర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. ఫస్టాఫ్‌లో క్యారెక్టర్లను పరిచయం చేస్తూ ఎమోషనల్ అంశాలతో కథను నడిపించాడు. సెకండాఫ్‌లో వార్ జోన్‌లో యాక్షన్ ఎపిసోడ్‌తో కథను నడిపించాడు. క్లైమాక్స్ రోమాలు నిక్కబొడిచే విధంగా ఉంటుంది. సన్నీడియోల్ తెర మీద సింహాంలా కనిపించాడు. వరుణ్ ధావన్ సర్‌ప్రైజింగ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు అని ఓ నెటిజన్ తన రివ్యూను పోస్టు చేశాడు.

బోర్డర్ 2 చిత్రం ఎమోషనల్ రోలర్ కోస్టర్. సన్నీడియోల్ పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్‌తో కేక పెట్టించారు. విలక్షణతో వరుణ్ ధావన్ ఆకట్టుకొన్నాడు. తొలి చిత్రంతోనే అహాన్ శెట్టి అందరి మనసులను దోచుకొన్నాడు. దిలిజిత్ దొసాంజ్ యాక్టింగ్ బాగుంది. తప్పకుండా చూడాల్సిన దేశభక్తితో కూడిన చిత్రం. ఈ సినిమాకు నా రేటింగ్ 4.5 అని నెటిజన్ కామెంట్ చేశాడు.

బోర్డర్ 2 సినిమా 1971 నాటి యుద్ధ పరిస్థితులను మరోసారి గుర్తు చేసింది. 2014 సంవత్సరానికి ముందు ఇండియా వీక్ అనే ఫీలింగ్ కల్పిస్తుంది. బోర్డర్ సినిమా అందించిన అనుభూతిని మళ్లీ ఓసారి ఈ సినిమా గుర్తు చేస్తుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

క్రిటిక్ కేఆర్కే ఈ సినిమా గురించి కామెంట్ చేస్తూ.. ఫస్టాఫ్ చాలా స్లో, బోరింగ్‌గా ఉంది. సన్నీడియోల్ ఇంటర్వెల్‌కు ముందు ఎంట్రీ ఇస్తాడు. అయితే సన్నీలో ఎనర్జీ కనిపించలేదు. ముసలివాడిగా, శక్తివిహీనుడుగా కనిపించాడు. దిలిజిత్ కామెడీ సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. వరుణ్ ధావన్ యాక్టింగ్ బాగాలేదు. ఓవరాక్షన్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్లు హారిబుల్‌గా ఉన్నారు. ఈ సినిమా సింగిల్ స్క్రీన్ ఆడియెన్స్ బాగుంటుంది. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ నచ్చకపోవచ్చు. ఓవరాల్‌గా మాస్ ఎంటర్‌టైనర్. బీసీ సెంటర్లలో ఆడుతుంది అని తన రివ్యూను ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Read more about: Border 2 sunny deol gadar 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X