Border 2 Movie Review: బోర్డర్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.5/5

మూవీ: బోర్డర్ 2
నటీనటులు: సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ తదితరులు
దర్శకత్వం: అనురాగ్ సింగ్
నిర్మాతలు: భూషణ్ కుమార్,కిషన్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా
సినిమాటోగ్రఫి: అన్షుల్ చోబే
ఎడిటింగ్: మనీష్ మోరే
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి
పాటలు: అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా
బ్యానర్: టీ సీరిస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2026-01-23

భారత్‌పై దాడులకు వ్యూహా రచన చేసిన పాకిస్థాన్‌ను 1971లో భారత సేనలు ఎదుర్కొనేందుకు ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ (సన్నీ డియోల్) నేతృత్వంలోని ఆర్మీ మేజర్ హోషియార్ సింగ్ దహియా (వరుణ్ ధావన్), ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ (దిలిజిత్ దోసాంజ్), ఇండియన్ నేవీ ఆఫీసర్ ఎంఎస్ రావత్ (ఆహాన్ శెట్టి) సిద్దమవుతారు. పాక్‌ చొరబాటును ఎలా ఎదుర్కొన్నారు? వారు ఎలాంటి వ్యూహాలను సరిహద్దులో అనుసరించారు? ఈ నలుగురు జవాన్లు తమ వ్యక్తిగత జీవితాలను ఎలా త్యాగం చేశారు? వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే బోర్డర్ 2 సినిమా కథ.

1997 సంవత్సరంలో అంటే సుమారుగా రెండు దశాబ్దాలు క్రితం వచ్చిన బోర్డర్ సినిమా ఇప్పటికీ దేశభక్తిని రగలించే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అలాంటి వార్ బ్యాక్ డ్రాప్ చిత్రం బోర్డర్ విషయానికి వస్తే.. పాక్ చొరబాటుదారులను ఫతే సింగ్ ఎదుర్కొంటూ ఎంట్రీ ఇచ్చే ఎపిసోడ్‌తో ఫుల్ మాస్ ఎలిమెంట్స్ మొదలవుతుంది. ఆ తర్వాత హోషియార్ సింగ్, నిర్మల్, రావత్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఫస్టాఫ్‌ను ఫ్యామిలీ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సినిమాను అనురాగ్ డిజైన్ చేశాడు. అయితే సైనిక జవాన్ల త్యాగాలను హృదయాలను హత్తుకొనేలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 1971 వార్ ఎపిసోడ్‌ను తెరపైకి తీసుకొచ్చి ఫస్టాఫ్‌ను యాక్షన్‌ మోడ్‌లో ముగించడంతో సెకండాఫ్‌పై అంచనాలు పెంచేశాడు.

Border 2 Movie Review and Rating

ఇక సెకండాఫ్‌లో ఫతే సింగ్ కొడుకు పాకిస్థాన్ ముష్కరులతో పోరాడుతూ వీరమరణం పొందే ఎపిసోడ్ గుండెలను పిండేస్తుంది. అలాంటి ఎమోషనల్ ఎపిసోడ్ తర్వాత సినిమాను మొత్తంగా మూడు రకాల వార్ సీక్వెన్స్‌ను అద్బుతంగా చిత్రీకరించారు. ఎయిర్, నేవీ, ఆర్మీ దళాల పోరాటలను మూడు లేయర్లుగా చూపించడానికి డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే బాగుంది. అనుక్షణం ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగించడంలో దర్శకుడు అనురాగ్ సఫలమయ్యాడు. ఇక క్లైమాక్స్‌లో పాక్ సైనికుడిని ఫతే సింగ్ కాల్చి చంపే సీన్ గూస్ బంప్స్‌గా ఉండటమే కాకుండా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

ఈ చిత్రంలో ఎప్పటిలానే ఫతే సింగ్ పాత్రలో సన్నీడియోల్ తన డైలాగ్స్‌తో సింహంలా గర్జించాడు. ఆడియెన్స్‌లో జాతీయ భావం పెంచేలా, దేశభక్తిని రగిలించేలా రాసిన డైలాగ్స్‌కు పూర్తిగా న్యాయం చేశాడు. ఇక హోషియార్ పాత్రలో వరుణ్ ధావన్ తన ఇమేజ్‌కు భిన్నంగా నటించి ఫుల్ మార్కులు కొట్టేశాడు. నిర్మల్ జిత్‌గా దిలిజిత్, రావత్‌గా సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారు. సిమి (మోనా సింగ్) మంజిత్ సెకాన్ (సోనమ్ బజ్వా), మేధా రానా (ధన్వంతరి దేవీ దహియా), సుధా రావత్ (అన్యా సింగ్) పాత్రలు కథకు బలంగా నిలిచాయి. పాపులారిటీ లేని హీరోయిన్లను భార్యల పాత్రలకు వాడటం వల్ల ఈ సినిమాకు రావాల్సిన ఎమోషనల్ మైలేజ్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. పాక్ ముష్కరుల పాత్రలకు పెద్దగా గుర్తింపులేని ఆర్టిస్టులను ఉపయోగించుకోవడంతో ఆ పాత్రలు తేలిపోయాయి.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు రైటింగ్ వర్క్ ప్లస్ పాయింట్. అలాగే సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ మూవీని మరో లెవెల్‌కు తీసుకెళ్లడానికి ఉపయోగపడ్డాయి. తెరమీద తుపాకులు, లాంచర్లు, గ్రెనేడ్లు ఎలా పేలాయో... అంతకుమించి డైలాగ్స్ బ్లాస్ట్ అయ్యాయి. పాటలు ఆడియెన్స్‌ను భావోద్వేగంతో బంధించేలా చేశాయి. వార్ సీక్వెన్స్‌ను బాగా చిత్రీకరించారు. కానీ గ్రాఫిక్, వీఎఫ్ఎక్స్ వర్క్ నాసిరకంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ భారీగా ఉన్నాయి.

ఫైనల్‌గా బోర్డర్ 2 సినిమా గురించి చెప్పాలంటే.. టోటల్‌గా బాలీవుడ్ హీరోల పవర్ హౌజ్ ఫెర్ఫార్మెన్స్‌తో చూపించిన చిత్రంగా గుర్తుండిపోతుంది. సన్నీడియోల్ యాక్షన్ మోడ్, యువ హీరోలు వరుణ్, దిలిజిత్, ఆహాన్ కొత్తగా విభిన్నమైన పాత్రల్లో జీవించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, దేశభక్తి, జాతీయభావం అంశాలు బాగా దట్టించి తెర మీద సన్నివేశాలను ఆవిష్కరించారు. బోర్డర్ రేంజ్‌లో ఈ మూవీ ఉందా? అంటే లేదనే చెప్పాలి. కానీ ఈ సినిమా కూడా కొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా ఈ సినిమాను థియేటర్లలోనే చూడండి.

Read more about: Border 2 sunny deol varun dhawan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X