Border 2 First Review: బోర్డర్ 2 మూవీ ఫస్ట్ రివ్యూ
హిందీ సినిమా రంగంలో 1997 సంవత్సరంలో సంచలన విజయం సాధించిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన మూవీ బోర్డర్ 2. యాక్షన్, ఇండియన్ వార్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సీరిస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించారు. ఈ మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా డైరెక్షన్‌లో బోర్డర్ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.
ఇండియా, పాకిస్థాన్ మధ్య 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి అన్షుల్ చోబే సినిమాటోగ్రఫి, మనీష్ మోరే ఎఢిటింగ్, జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా పాటలు అందించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొన్నది. సెన్సార్ రివ్యూ తర్వాత ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ మూవీ రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

బోర్డర్ 2 సినిమా విషయానికి వస్తే.. 1971 పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం, ఆపరేషన్ చెంఘీజ్ ఖాన్, పూంచ్, బసంతార్, ఐఎన్ఎస్ కుక్రీ లాంటి అంశాలతో రూపొందింది. ఈ యుద్దంలో సైనికుల భావోద్వేగాలు, వీరత్వం లాంటి అంశాలు ప్రధానంగా హైలెట్ కానున్నాయి. ఇలాంటి నేపథ్యంతో రూపొందిన ఈ మూవీని సెన్సార్ ప్రతినిధులు, అధికారులు చూసి అభినందించారు. కొన్ని సలహాలు, సూచనలు కూడా అందజేశారు. వాటికి చిత్ర యూనిట్ సానుకూలంగా స్పందించి కొన్ని మార్పులు చేర్పులు చేశాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
బోర్డర్ 2 సినిమాకు దాదాపు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) క్లీన్ సర్టిఫికెట్ అందజేసింది. ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయకుండా ఈ సినిమాకు యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమాను 13 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు చూడొచ్చు. 13 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ సర్టిఫికెట్ నిబంధనల్లో పేర్కొన్నారు.
సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టే భారత సైన్యం నేపథ్యంగా కథ సాగుతుంది. ఈ యుద్దంలో భారతీయ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు శత్రుదేశం వ్యూహాన్ని తిప్పికొట్టే సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయి. ఈ సినిమా కథా స్వభావం రీత్యా నిడివి భారీగానే పెంచారు. ఈ సినిమా నిడివి 3 గంటల 19 నిమిషాలు. సుమారుగా 200 నిమిషాల రన్‌టైమ్ అని సెన్సార్ సర్టిఫికెట్ జారీతో స్పష్టమైంది. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ కథనాలు, రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











