బాస్‌ - ఫస్ట్‌ క్లాస్‌

By Staff

Boss
బాస్‌ - ఫస్ట్‌ క్లాస్‌
సినిమా: బాస్‌ - ఐ లవ్‌ యూ‌
విడుదల తేదీ: 27 సెప్టెంబర్‌ 2006‌
నటీనటులు: నాగార్జున, నయనతార, పూనమ్‌ బజ్వా,‌
శ్రియ, చంద్రమోహన్‌, తనికెళ్ల భరణి, సునీల్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం,‌
షాయాజి షిండే, హేమ, ఎం ఎస్‌ నారాయణ, నాజర్‌,‌
సుమలత, అలీ, బ్రహ్మానందం తదితరులు..‌
కెమెరా: శివకుమార్‌‌
సంగీతం: కల్యాణిమాలిక్‌‌
మాటలు: చింతపల్లి రమణ‌
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేశ్‌‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఎన్‌. ఆదిత్య‌
నిర్మాణం: కామాక్షి మూవీస్‌‌
నిర్మాత: డి. శివప్రసాద్‌ రెడ్డి‌

నాగార్జున హీరోగా కామాక్షి మూవీస్‌ పతాకంపై నిర్మించిన అన్ని చిత్రాలలో వైవిధ్యభరితమైన చిత్రం - బాస్‌. నాగార్జున, నిర్మాత శివప్రసాద్‌ రెడ్డి, దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య కాంబినేషన్‌లో వచ్చిన నేనున్నాను చిత్రం కలెక్షన్ల పరంగా ఘనవిజయం సాధించగా.. మళ్లీ అదే కాంబినేషన్‌లో వచ్చిన బాస్‌ కూడా ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశపర్చదు. ఆడియో విడుదల సందర్భంగా నాగార్జున చెప్పినట్టు ఇది పైసా వసూల్‌ చిత్రమే.

కథ విషయానికి వస్తే.. గోపాలకృష్ణ (జి.కె.) ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అధినేత. బిజినెస్‌లో నెంబర్‌వన్‌గా ఉండాలన్న లక్ష్యంతో పనిచేసే నిత్యశ్రామికుడు ఈ బాస్‌. తనకు అన్ని విధాలా సరిపోయే సెక్రటరీ కావాలని అన్వేషిస్తున్న తరుణంలో పరిచయం అవుతుంది నయనతార. రోడ్డున పోయే ఒక వ్యక్తిని రక్షించడానికి గోపాలకృష్ణని సహాయం అడుగుతుంది అనురాధ (నయనతార). అలా పరిచయం అయిన అనూరాధ ఎంబిఎ అని తెలుసుకుని రేపే వచ్చి కలవమని చెబుతాడు జికె. ఆమె వ్యక్తిత్వం నచ్చి సెక్రటరీగా ఉద్యోగం కూడా ఇస్తాడు. మనిషి చాలా కరకుగా ఉన్నా మనసు వెన్న అని తక్కువ సమయంలోనే గ్రహిస్తుంది అనూరాధ. అనాథ శరణాలయంలో పెరిగిన అనూరాధకు బాస్‌ చూపించే ఆపేక్షకు ముగ్ధురాలై అతనితో ప్రేమలో పడుతుంది. అతడికి తన ప్రేమ గురించి చెప్పే సందర్భంలోనే ఒక చిన్న సంఘటన వారిద్దరి మధ్య స్పర్థలు రేపుతుంది. ఆత్మాభిమానం ఎక్కువైన సెక్రటరీ ఉద్యోగానికి రాజీనామా ఇస్తుంది. అనూరాధని వదులుకోవడం ఇష్టంలేని హీరో - ఇది ఒక నెల నోటీస్‌గా పరిగణిస్తున్నానని, ఈ నెల రోజులలో నిర్ణయం మార్చుకుంటావని చెబుతాడు. నెల రోజుల్లో మీరే నాకు సారీ చెప్పి నన్ను ఉండమని బతిమిలాడతారని నయనతార గంభీరంగా అంటుంది. సరే అంటూనే.. తన మేనేజర్‌కి మరో సెక్రటరీ కావాలంటూ ప్రకటన ఇవ్వమంటూ హీరో ఆదేశిస్తాడు.

బాస్‌కీ, తనకూ మధ్య ఉన్న బంధం కేవలం బాస్‌ - ఉద్యోగి మధ్య ఉండే సంబంధమే అని, అతని కోసం ఎంత కష్టపడినా తనను బాస్‌ ఇష్టపడటం లేదని అనూరాధ బాధ. చిన్నప్పుడే ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో తండ్రి ఆమెను అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్లిపోతాడు. అనాథ శరణాలయంలో కూడా ఆమెని పెంచుకోడానికి వచ్చిన ఓ దంపతులు ఇంకో పాప నచ్చడంతో ఆ అమ్మాయిని దత్తత తీసుకుంటారు. ఒక ఆత్మీయ స్పర్శ కోసం తపించిపోయే అనూరాధకు బాస్‌ ద్వారా ఆ ఓదార్పు దక్కిందనుకున్న తరుణంలో అతడు కూడా ఆమె ప్రేమను పట్టించుకోడు. పైగా ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి. ఆ సమయంలో అనూరాధ పడే క్షోభకి తోడు - కొత్తగా వచ్చిన సెక్రటరీ శ్రుతి (పూనమ్‌ బజ్వా) బాస్‌ని మచ్చిక చేసుకోడానికి చాలా అడ్వాన్స్‌ అయిపోతుంటుంది. ఆమె అలా ప్రవర్తించడానికి ఒక కారణం ఉంది. బాస్‌ బద్ధశత్రువైన ఎస్‌.ఆర్‌.కె. తన ప్రత్యర్థి టెండర్‌ కొటేషన్లు కొట్టేయడానికి చేసిన ప్లాన్‌లో కొత్త సెక్రటరీ శ్రుతి ఒక భాగం.

అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరిగి చివరికి అనూరాధ తన ఉద్యోగం వదిలేసే రోజు రానే వస్తుంది. ఆమె హీరోని వదిలి వెళ్లలేక.. తను ప్రేమిస్తున్న విషయం చెప్పేసి.. జీవితాంతం అతడి నీడలో బతకాలన్న ఆకాంక్షని వెల్లడిస్తుంది. దానికి ఒప్పుకోని జికె.. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సంజన (ప్రత్యేక పాత్రలో శ్రియ)ను దేవుడు తన నుంచి దూరం చేశాడని, ఆమె తన మనసులోనే ఉందని చెప్పి అనూరాధ ప్రేమని తిరస్కరిస్తాడు. ఇక జీవితంలో జికెతో కలిసి ఉండే అవకాశం లేదని గ్రహించిన అనూరాధకు - బాస్‌ తన పెళ్లికి పరోక్షంగా ఏర్పాట్లు చేశాడని తెలుసుకుని మరింత కుంగిపోతుంది. చివరికి బాస్‌, అనూరాధ ప్రేమను అంగీకరిస్తాడా? తన ప్రత్యర్థి తన వ్యాపారం దెబ్బతీసేందుకు చేసే పన్నాగాలు ఎలా తిప్పికొట్టాడు.. ఇత్యాది అంశాలకు సమాధానం ఇస్తూ కథ ముగుస్తుంది.

బాస్‌ - తొలి భాగం పూర్తిగా ఎంటర్‌టైనింగ్‌గా, ఆహ్లాదకరమైన కామెడీ సన్నివేశాలతో సాగుతుంది. బాస్‌గా హీరో నాగార్జున విభిన్నమైన షేడ్స్‌ని చాలా చక్కగా ప్రదర్శించి మరోమారు తన అభిమాన ప్రేక్షకులను అలరిస్తారు. సెక్రటరీగా నయనతార పరిణితితో నటించింది. నయనతార ఈ సినిమాలో అందంతో పాటు అభినయాన్ని అద్భుతంగా ప్రదర్శించి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. హీరో నాగార్జునతో పోటీ పడి నటించిన నయనతార నటనాతీరును మెచ్చుకోవాల్సిందే. ఇక కామియో పాత్రలో పూనమ్‌ బజ్వా కాసేపు మెరుపులు చిందిస్తుంది. నయనతార తండ్రిగా తనికెళ్ల భరణి, అనాథ శరణాలయం నిర్వాహకునిగా చంద్రమోహన్‌, తన భార్య శ్రియ తల్లిదండ్రులుగా నాజర్‌, సుమలత, బాస్‌ చిన్ననాటి ఫ్రెండు కమ్‌ కార్‌ డ్రైవర్‌గా సునీల్‌, ఆయన మేనేజర్‌గా ధర్మవరపు, ప్రత్యేకమైన పాత్రలలో అలీ, బ్రహ్మానందం తమ పాత్రలను చక్కగా పోషించారు.

ఇంతమంచి స్టార్‌ కాస్టింగ్‌ ఉండగా వారందరికీ మంచి సన్నివేశాలు సృష్టించి, మంచి అవుట్‌పుట్‌ రాబట్టడంలో దర్శకుడు ఆదిత్య కృతకృత్యులయ్యారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించిన ఆదిత్య హీరో నాగార్జున, సెక్రటరీగా నయనతారల క్యారెక్టర్లను మలచిన తీరు చాలా చక్కగా ఉంది. కామెడీ సన్నివేశాలతో పాటు మధ్యమధ్యలో హృద్యమైన సన్నివేశాలతో మనసును హత్తుకునే కథను రూపొందించారు దర్శకుడు. ప్రథమార్థం ఆహ్లాదంగా, బాస్‌ విలక్షణ వ్యక్తిత్వంతో సరదాగా సాగుతుంది. ద్వితీయార్థం బలమైన సెంటిమెంట్‌తో చాలా హృద్యంగా ఉంటుంది. హీరో నాగార్జున అభిమానులైన మహిళా ప్రేక్షకుల కోసం ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు రూపొందించినట్టు కనిపిస్తుంది.

ఈ చిత్రం ప్రథమార్థంలో రెండు పాటలు, ద్వితీయార్థంలో చివరి రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే - ఎక్కువ మార్కులు కెమెరామెన్‌ శివకుమార్‌కే చెందుతాయి. ఈ సినిమా మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకూ ఒక దృశ్యకావ్యంగా మలిచారు కెమెరామెన్‌ శివకుమార్‌. అయిదుగురు గ్లామర్‌ తారలు, మధ్యలో హీరో నాగార్జున, చుట్టూ అందమైన లొకేషన్లు.. సినిమా ఆద్యంతం కనువిందు చేస్తుంది.

సినిమా మొత్తం ఒక్క జర్క్‌ కూడా లేకుండా ఎడిటింగ్‌ చేసిన నిపుణుడు మార్తాండ్‌ కె వెంకటేశ్‌. అనూప్‌ రూబెన్స్‌ అందించిన నేపథ్య సంగీతం (బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌) ప్రతి సన్నివేశాన్ని హైలెట్‌ చేసే విధంగా సాగుతుంది. బాస్‌ ఒకరకంగా టీమ్‌ వర్క్‌. తన టెక్నీషియన్స్‌ అందరి నుంచి చక్కని అవుట్‌పుట్‌ సాధించడంలో దర్శకుడు ఆదిత్య సక్సెస్‌ అయ్యారు. ఫలితంగా బాస్‌ని చూశాక ప్రేక్షకులే - ఐ లవ్‌ యూ చెబుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X