twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూత్‌ కి నచ్చే బాయ్స్‌

    By Staff
    |

    Boys
    -జలపతి గూడెల్లి
    చిత్రం: బాయ్స్‌
    నటీనటులు: సిద్దార్థ్‌, నకుల్‌, శ్రీనివాస్‌,
    జెనిలినా డిసౌజా, భరత్‌, మణికందన్‌, సాయిశ్రీనివాస్‌
    సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
    నిర్మాత: ఏ.ఎం.రత్నం
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: శంకర్‌

    ప్రముఖ దర్శకుడు శంకర్‌ మరోసారి తన పనితనాన్ని నిరూపించుకున్నాడు. స్క్రీన్‌ ప్లేలో 'మాయ'తో అలరించే, యువతకు నచ్చే, యూత్‌ ఫుల్‌ మ్యూజికల్‌ ఎంటర్‌ టెయినర్‌ ను అందించాడు. 'బాయ్స్‌' ప్రథమార్థం బ్యాచిలర్స్‌, చిత్రం తదితర చిత్రాల మాదిరిగా అనిపించినా, ద్వితీయార్థంలోని వైవిధ్యం, టేకింగ్‌ స్టైల్‌ తో సినిమా అలరిస్తుంది. ముఖ్యంగా అర్బన్‌ యూత్‌ (నగరంలోని యువత)ను దృష్టిలో పెట్టుకొన్న ఈ చిత్రంలో రెహమాన్‌ అందించిన చక్కటి సంగీతం, రవి.కె.చంద్రన్‌ అద్భుత ఫోటోగ్రఫీ అలరిస్తాయి. పాప్‌ కార్న్‌ చిత్రం అనే చెప్పాలి.

    అయిదుగురు అబ్బాయిలు - మున్నా (సిద్దార్థ్‌), బాబ్‌, జుజు, కృష్ణ, కుమార్‌, క్లోజ్‌ ఫ్రెండ్స్‌. వారి కుటంబ నేపథ్యాలు వేర్వేరు. ఈ మిత్రులందరికీ కామన్‌ అభిరుచి: అమ్మాయిలతో స్నేహం, ముట్టుకోవడం. ఈ అభిరుచే హారిణి (జెనాలినా) ప్రేమలో పడేలా చేస్తుంది. కానీ ఇందులో మున్నా సీరియస్‌ గా ప్రేమిస్తాడు. మిగతా వారంతా డ్రాప్‌ అయిపోతారు. హారిణి మాత్రం 'ప్రేమ'ను నమ్మదు.

    కానీ కొన్ని కారణాల వల్ల హారిణి మున్నా ప్రేమలో పడుతుంది. ఈ లోపు, వీరి తల్లితండ్రులు అంతా ఒక వద్ద సమావేశమై, ఎవరు ఎవర్నీ కలుసుకోవద్దని కట్టడి చేస్తారు- ప్రేమ, దోమ పేరుతో చెడిపోతున్నారని. దీంతో వీరంతా ఎదురు తిరిగి ఇంటి నుంచి బయటికి వస్తారు. మున్నా, హారిణి పెళ్ళి చేసుకుంటారు. చదువుకుంటూ..పనిచేస్తుంటారు. చివరికి డబ్బులు సంపాదించేందుకు 'బాయ్స్‌' పేరిట మ్యూజికల్‌ బ్యాండ్‌ (బృందం) ఏర్పాటు చేస్తారు. చివరికి వీరు ఎలా పాపులర్‌ అవుతారో..తమ లక్ష్యాలను సాధిస్తారో..క్లైమాక్స్‌.

    రెహమాన్‌ సంగీతం, ద్వితీయార్థంలోని స్క్రీన్‌ ప్లేనే ఈ సినిమాకు ప్రాణం. ఇందులో నటించిన కుర్రాళ్ళు అంతా చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా హీరో సిద్దార్థ్‌, హీరోయిన్‌ జెనాలినాకు మంచి భవిష్యత్‌ ఉంది. ప్రథమార్థంలో కొద్దిగా ఇబ్బందికరమైన కామెడీ ఉన్నా, చాలా సహజంగా తీసిన చిత్రీకరణ, రవి.కె.చంద్రన్‌ ఎంటీవీ స్టైల్‌ ఫోటోగ్రఫీతో సినిమా కొత్తగా అన్పిస్తుంది.

    'గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలి..' అనే పాటలో గ్రాఫికల్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అసహజంగా ఉంది. అలాగే, 'మ్యాట్రిక్స్‌' చిత్రంలో ఉపయోగించిన టైం ఫ్రీజ్‌ టెక్నిక్‌ ను ఇందులో ఒక పాటలో ఉపయోగించినా అదీ కూడా పెద్దగా అలరించదు. కెమెరా గిమ్మిక్‌ లు, టెక్నికల్‌ ప్రతిభ, బడ్జెట్‌ భారీతనం కన్నా, సింపుల్‌ ప్రేమ, సెంటిమెంట్‌, గెలుపు, ఓటముల భావాలు..ఇవే సినిమాలో వర్క్‌ అవుటయ్యాయి. అర్బన్‌ యూత్‌ కు బాగా నచ్చుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X