కామెడీ బ్రహ్మచారి!

By Staff

Brahamachari
- జలపతి
చిత్రం: బ్రహ్మచారి
నటీనటులు: కమల్‌ హాసన్‌, సిమ్రాన్‌, అబ్బాస్‌, స్నేహ
సంగీతం: దేవా
నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: మౌళి

కమల్‌ హాసన్‌ నటించిన మరో కామెడీ చిత్రం. ఇది పూర్తిస్థాయి కామెడీ సినిమా. గతంలో కమల్‌ హాసన్‌ నటించిన లవ్వండి, లవ్వండి చిత్రంలో మాదిరిగా ఈ చిత్రంలో కూడా పూర్తిగా ఒన్‌ లైనర్సే. ఇన్‌ స్టాంట్‌ గా పదాలతో గారడీ చేయడం వల్ల కలిగే కామెడీ పాలు ఎక్కువ. చాలా తికమక పదాలు, వ్యాఖ్యలతో ఈ చిత్రం సాగుతుంది. అయితే తమిళంలో మాదిరిగా తెలుగులో ఇలాంటి కామెడీ విజయం సాధించడం కష్టం. తమిళంలో ఇలాంటి 'స్పీడు కామెడీ'కి దర్శకుడు మౌళి( మౌళి తెలుగు చిత్రాలు అధికంగా తీసినా, తమిళం వాడు. అందునా తమిళనాట పేరున్న హాస్యనాటకరచయిత), రచయిత క్రేజీ మోహన్‌ పెట్టింది పేరు.

ఇలాంటి స్పీడు కామెడీ తెలుగువారికి అంతగా రుచించదు. పమ్మల్‌ .కె.సంబంధం అనే తమిళ చిత్రాన్ని తెలుగులో బ్రహ్మచారిగా డబ్‌ చేశారు. సహజంగానే తమిళ పోకడలు అధికంగానే ఉన్నాయి. ఐనప్పటికీ కాస్తా చదువుకున్నవాళ్ళకు, కమల్‌ అభిమానులకు, కామెడీ ప్రియులకు కడుపుబ్బ నవ్వించే చిత్రం ఇది.

కమల్‌ సినిమాల్లో పనిచేసే స్టంట్‌ మాస్టర్‌. పెళ్ళి అంటే పడదు. అందుకే వయసు పెరిగిపోతోన్న పెళ్ళిచేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉంటాడు. సిమ్రాన్‌ డాక్టర్‌. వీర ఫెమినిస్ట్‌ కమ్‌ పెళ్ళి వ్యతిరేకి. అబ్బాస్‌, స్నేహలు ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు. సిమ్రానే దగ్గరుండి పెళ్ళి చేస్తుంది. కానీ ఆమె వీరికి విడాకులు ఇప్పించేలా చేస్తుంది. మరోవైపు కమల్‌ అబ్బాస్‌ కు సపోర్ట్‌.

ఇలా అబ్బాస్‌, స్నేహల వల్ల సిమ్రాన్‌, కమల్‌ లు శత్రువులుగా మారుతారు. ఒకసారి యాక్సిడెంట్‌ ఆస్పత్రిలో చేరిన కమల్‌ కు సిమ్రాన్‌ ఆపరేషన్‌ చేస్తుంది. కానీ పొరపాటున తన చేతి వాచీని అతని కడుపులోనే మరిచిపోతుంది. ఇక వాచీ కోసం సిమ్రాన్‌ పడే తిప్పలే ఈ చిత్రం మిగతా కథ.

స్టంట్‌ మాస్టర్‌ గా కమల్‌ హాసన్‌ గెటప్‌ బాగుంది. కొన్ని సీన్లలో అతిగా చేయడం మినహా మొత్తమ్మీద కమల్‌ కామెడీ బాగా పండించాడు. ఫెమినిస్ట్‌ గా సిమ్రాన్‌ నటన బాగుంది. స్నేహ, అబ్బాస్‌ ల పాత్రలు చిన్నవి. ఐనా వారి తమ పాత్రలకు న్యాయం చేశారు. కొన్ని అనవసరమైన పాత్రలను తొలిగించి ఉంటే బాగుండేది. దేవా సంగీతం బయటికన్నా సినిమాలో బాగుంది. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుపొందిన మౌళికి ఇది విభిన్న చిత్రం. కామెడీ కూడా చక్కగా డీల్‌ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X