twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brahmastra Movie Review గ్రాఫిక్ వర్క్ అదుర్స్.. నాగార్జునకు అలా అన్యాయం!

    |

    Rating:
    3.0/5
    Star Cast: Alia Bhatt, Ranbir Kapoor, Amitabh Bachchan
    Director: Ayan Mukerji

    బాలీవుడ్‌లో అత్యంత భారీ ప్రాజెక్టుగా బ్రహ్మస్త్ర ప్రాజెక్ట్ ప్రకటించగానే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక భారీ తారాగణం, ప్రతిష్టాత్మకమైన సంస్థలు సినిమాను నిర్మించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పలుమార్లు వాయిదాలు.. వివాదాలతో ట్రావెల్ చేస్తూ సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా దర్శక ధీరుడు రాజమౌళి సమర్పించడం సినిమాపై అంచనాలు పెంచాయి. ఇలాంటి ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయంలోకి వెళితే..

     బ్రహ్మస్త్ర కథ ఏమిటంటే?

    బ్రహ్మస్త్ర కథ ఏమిటంటే?


    అనాథ యువకుడైన శివ డీజేగా పనిచేస్తుంటాడు. అయితే తనను అగ్ని నుంచి కాపాడుకొనే అగ్యస్త్ర అనే అద్బుతమైన శక్తితో పుట్టానని గ్రహిస్తాడు. ఓ కార్యక్రమంలో డీజేగా వ్యవహరిస్తున్న సమయంలో ఇషా (ఆలియాభట్), శివ తొలి చూపులోనే ప్రేమించుకొంటారు. ఇదిలా ఉండగా, మోహన్ భార్గవ (షారుక్ ఖాన్) అనే సైంటిస్ట్ కనిపెట్టిన బ్రహ్మస్త్రను చేజిక్కించుకొనేందుకు దుష్టశక్తి జునూన్ (మౌనీరాయ్) కుట్రలు పన్నుతుంటుంది. అయితే మూడు ముక్కలుగా బ్రహ్మస్త్ర కావడంతో అవి ఎక్కడ ఉన్నాయని శోధిస్తూ శివను జునూన్ వెంటాడుతుంటుంది. జూనూన్ దుష్ట చేష్టలను ఎదురిస్తూ శివ, ఇషా పోరాటం చేస్తుంటారు. ఈ క్రమంలో శివ అనాథ కాదని ఆయన పుట్టుక వెనుక రహస్యాన్ని బ్రహ్మన్ష్ గురు చెబుతాడు.

    బ్రహ్మస్త్ర స్క్రీన్ ప్లేలో ట్విస్టులు

    బ్రహ్మస్త్ర స్క్రీన్ ప్లేలో ట్విస్టులు


    బ్రహ్మస్త్ర మూడు ముక్కలు ఎందుకైంది? సైంటిస్ట్ మోహన్ భార్గవను జునూన్ ఎలా టార్గెట్ చేసింది? బ్రహ్మస్త్రాన్ని కాపాడేందుకు బ్రహ్మాన్ష్ సమాజానికి చెందిన గురు (అమితాబ్ బచ్చన్) ఏం చేశాడు? బ్రహ్మస్త్రకు నంది అస్త్రాన్ని కలిగి ఉన్న అనిష్ శెట్టి (నాగార్జున) ఏం సంబంధం? చివరకు జూనూన్ దుష్ట చేష్టలకు ఎలా ముగింపు పలికారు అనే ప్రశ్నలకు సమాధానమే బ్రహ్మస్త్ర సినిమా కథ.

    బ్రహ్మస్త్ర ఎలా ఉందంటే?

    బ్రహ్మస్త్ర ఎలా ఉందంటే?


    సైంటిస్ట్ మోహన్ భార్గవ్‌పై దుష్టశక్తి జునూన్ దాడి చేసే ఎపిసోడ్‌తో బ్రహ్మస్త్ర ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. మోహన్‌గా షారుక్ ఖాన్ చెప్పే డైలాగ్స్‌ రణ్‌బీర్ ఎంట్రీ ఇవ్వడం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొనే ఫార్ములాకు అద్దం పట్టింది. ఇక మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో అనీష్‌గా నాగార్జున పాత్ర పరిచయం కావడం.. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ పాత్ర ముగింపు పలకడం దక్షిణాది ప్రేక్షకులకు నిరాశను కలిగించే విషయంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో బ్రహ్మన్స్ ఆశ్రమంలో అమితాబ్ బచ్చన్ ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. గురు పాత్ర అండతో జునూన్‌ను ఎదురించడానికి శివ, ఇషా చేసే పోరాటం ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా కొనసాగుతుంది.

    ఆయాన్ ముఖర్జీ టేకింగ్

    ఆయాన్ ముఖర్జీ టేకింగ్


    ఇప్పటి వరకు ప్రేమ కథా చిత్రాలను అందించిన ఆయాన్ ముఖర్జీ హిందూ పురాణాలను ఆధారంగా చేసుకొని రాసుకొన్న పాయింట్ బాగుంది. అయితే బలమైన సన్నివేశాలు, ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే రాసుకోవడం సినిమాకు బలంగా మారింది. అయితే పాత్రలను ప్రభావవంతంగా రాసుకోవడంలో తడబాటు కనిపిస్తుంది. కంటెంట్ కంటే గ్రాఫిక్ వర్క్ డామినేట్ చేయడం వల్ల ఓ దశలో పిల్లల గేమ్స్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే పూర్తిస్థాయి వీఎఫ్ఎక్స్‌తో హిందీలో మంచి ఫీల్‌గుడ్‌తో సినిమాను ఆయాన్ ముఖర్జీ అందించారనే చెప్పవచ్చు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. కథను, బిగ్ స్టార్స్‌ను డీల్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది.

     నటీనటులు ఫెర్ఫార్మెన్స్ గురించి

    నటీనటులు ఫెర్ఫార్మెన్స్ గురించి


    డీజేగా శివ పక్కింటి కుర్రాడిలా రణ్‌బీర్ కనిపిస్తూనే.. అగ్ని అస్త్రం అనే అద్బుతమైన శక్తి కలిగి ఉన్న ఫైర్ బ్రాండ్‌గా ఆకట్టుకొంటాడు. సెకండాఫ్‌లో రణ్‌బీర్ ఎమోషనల్‌గా మెప్పిస్తాడు. రణ్‌బీర్‌కు తోడుగా ఆలియా కూడా తనదైన రీతిలో ఎప్పటిలానే చెలరేగిపోయింది. ప్రేమికులుగా ఆలియా, రణ్‌బీర్ కెమిస్ట్రీ ఆక్టట్టుకొంటుంది. ఇక మోహన్‌గా షారుక్ ఖాన్ పాత్ర సినిమాకు ప్రాణంగా కనిపిస్తుంది. పాత్ర నిడివి తక్కువైనా గుర్తుండి పోతుంది. ఇక అమితాబ్ పాత్ర సినిమాకు వెన్నుముకగానే కాకుండా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నాగార్జున, డింపుల్ కపాడియా అతిథి పాత్రలో మెరిసారు. చివరగా విలన్ పాత్రతో మౌనీ రాయ్ ప్రేక్షకులను తనవైపుకు తిప్పేసుకొన్నది. నాగినిగా పరిచయమైన ఈమె మరోసారి అద్బుతంగా హావభావాలను పలికించింది.

    గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హైలెట్‌గా

    గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హైలెట్‌గా


    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అమెరికాకు చెందిన ప్రైమ్ ఫోకస్ అందించిన వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అద్బుతంగా ఉన్నాయి. కొన్ని సందర్బాల్లో కంటెంట్ కంటే గ్రాఫిక్‌తో కూడిన పిల్లల గేమ్ చూస్తున్నామనే ఫీలింగ్‌కు గురవుతాం. కొన్ని సార్లు అతిగా గ్రాఫిక్స్ ఉపయోగించడం కథావేగాన్ని అడ్డుకొన్నట్టు అనిపిస్తుంది. ప్రీతమ్ అందించిన సాంగ్స్ తెరపైన పెద్దగా ఆకట్టుకోవు. సైమన్ ఫ్రాంగ్లేన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఎడిటింగ్‌‌ విషయంలో ప్రకాశ్ కురూప్‌కు ఇంకా పని ఉందనిపిస్తుంది. మణికందన్, పంకజ్ కుమార్, సందీప్ చటర్జీ, వికాష్ నౌల్లోకా అందించి సినిమాటోగ్రఫి కూడా బాగుంది.

     నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయంటే?

    నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయంటే?


    స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, స్ట్రయిట్ లైట్ పిక్చర్స్, ప్రైమ్ ఫోకస్ సంస్థలు సంయుక్తంగా అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. భారతీయ ప్రేక్షకులకు కొత్త కంటెంట్, ఉన్నత ప్రమాణాలతో గ్రాఫిక్స్ ఆధారిత చిత్రాన్ని అందించాలనే తపన కనిపిస్తుంది. దక్షిణాదిలో ఎస్ఎస్ రాజమౌళి సమర్పించడం, చేసిన ప్రమోషన్స్ సినిమాకు సానుకూలంగా మారాయి.

     ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే?

    భారతీయ పురాణాల్లోని అస్త్రాలను ఆధారంగా చేసుకొని దుష్టశక్తిపై శక్తిమంతమైన యువకుడి చేసిన పోరాటమే బ్రహ్మస్త్ర. కంటెంట్ కంటే గ్రాఫిక్స్ డామినేట్ చేయడం సినిమాకు మైనస్. బాలీవుడ్ సినిమా ప్రమాణాలకు, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పాత్రలను రూపుదిద్దుకొన్నారు. ఎమోషన్స్, యాక్షన్, అమితాబ్, షారుక్ లాంటి పాత్రలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. ఇక ఆలియా, రణ్‌బీర్ కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. నాగార్జున, డింపుల్‌ను అతిథి పాత్రల కంటే దారుణంగా ట్రీట్ చేయడం సినీ అభిమానులకు రుచించని అంశంగా ఉంటుంది. ఫ్యామిలీతోపాటు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. కొత్త జోనర్‌తో వచ్చిన ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది. కానీ సినిమా నిడివి, కథలో లాజిక్స్ లేకుండా ఉండటం కాస్త చిరాకుపెట్టే అంశం. వీకెండ్‌లో బ్రహ్మస్త్రను ఓసారి చూడొచ్చు. ఇది పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించే చిత్రం. సో లెట్స్ గో ఫర్ వాచ్ వన్స్.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    ప్లస్ పాయింట్స్
    అమితాబ్, రణ్‌బీర్, ఆలియా ఇతర నటీనటులు ఫెర్ఫార్మెన్స్
    సాంకేతిక విలువలు
    డైరెక్షన్

    మైనస్ పాయింట్స్
    బలమైన కథ లేకపోవడం
    సినిమా నిడివి
    మితిమీరిన గ్రాఫిక్స్

    బ్రహ్మస్త్రలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    బ్రహ్మస్త్రలో నటీనటులు, సాంకేతిక నిపుణులు


    నటీనటులు: అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, నాగార్జున, డింపుల్ కపాడియా, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మౌనీ రాయ్ తదితరులు
    రచన, దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
    డైలాగ్స్: హుస్సేన్ దలాల్
    నిర్మాతలు: కరణ్ జోహర్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణ్‌బీర్ కపూర్, ఆయన్ ముఖర్జీ
    సినిమాటోగ్రఫి: మణికందన్, పంకజ్ కుమార్, సందీప్ చటర్జీ, వికాష్ నౌల్లోకా
    మ్యూజిక్: సైమన్ ఫ్రాగ్లెన్, ప్రీతమ్
    ఎడిటింగ్: ప్రకాశ్ కురూప్
    బ్యానర్: స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, స్ట్రయిట్ లైట్ పిక్చర్స్, ప్రైమ్ ఫోకస్
    రిలీజ్ డేట్: 2022-09-09

    English summary
    Brahmastra Movie Review and Rating: Alia Bhatt and Ranbir Kapoor gives the best of their careerBrahmastra Movie Review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X