Bramayugam Review మమ్ముట్టి వన్ మ్యాన్ షో.. భ్రమయుగం సినిమా రివ్యూ!
Rating: 3/5
నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్
దర్వకత్వం: రాహుల్ సదాశివన్
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర, శశికాంత్
బ్యానర్: నైట్ షిప్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్
మ్యూజిక్: క్రిస్టో జేవీయర్
సినిమాటోగ్రఫి: షెహనాద్ జాలా
రిలీజ్ డేట్: 2024-02-23
తేవన్ (అర్జున్ అశోకన్) దట్టమైన అటవీ ప్రాంతంలో దారి తప్పి తన గ్రామానికి చేరుకొనే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ క్రమంలో పాడుబడిన భవనంలో యజమాని కోడోమన్ పొట్టి (మమ్ముట్టి), అతడి వంట మనిషి (సిద్దార్థ్ భరతన్)ను కలుసుకొంటాడు. ఆ ఇంటిలో తేవన్ బందీగా మారుతాడు. ఆ ఇంటి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు.
కోడోమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటాడు? కోడోమన్ పొట్టీకి వంటమనిషికి ఉన్న విభేదాలు ఏమిటి? తేవన్‌ను బందీగా ఎందుకు మార్చాడు? యజమాని చెర నుంచి బయటపడేందుకు వంటమనిషి, తేవన్ చేసిన ప్రయత్నాలు ఏమిటి? చివరకు కోడోమన్ పొట్టిని వారిద్దరు ఎదురించారా? ముగ్గురు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరాటానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే భ్రమయుగం.

భమయుగం మూవీ ఓపెనింగ్ చాలా ఇంటెన్స్, హై ఎనర్జీతో ప్రారంభమవుతుంది. ఓపెనింగ్ మిస్ అయితే కథకు కనెక్ట్ కావడానికి ఇబ్బంది పడేలా దర్శకుడు రాసుకొన్న స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఇక పాడుబడ్డ భవనంలోకి తేవన చేరిన తర్వాత అసలు డ్రామా మొదలవుతుంది. మూడు పాత్రలు ఒకరిని మరోకరు చీట్ చేసుకొనే విధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో అఖండ జ్యోతిని ఆరిపేయడం తర్వాత జరిగే సంఘటనలు చాలా ఎమోషనల్‌గా, గ్రిప్పింగ్‌గా ఉంటాయి. సినిమాను చివరి ఫ్రేమ్ వరకు నడిపించిన తీరు దర్శకుడు రాహుల్ సదాశివన్ ప్రతిభకు అద్దం పట్టింది.
ఇక కోడోమన్ పొట్టిగా మమ్ముట్టి ఓ మిస్టీరియస్ మ్యాన్‌గా అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. మంత్ర శక్తులను గుప్పిట్లోపెట్టుకొని తక్కువ కులం వాళ్లను కిరాతకంగా చంపే ఓ దుష్టుడి పాత్రలో జీవించాడు. మమ్ముట్టి బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో అదరగొట్టాడు. ఇక తేవన్‌గా అర్జున్ అశోకన్, వంట మనిషిగా సిద్దార్థ్ భరతన్ పోటీ పడి నటించారు. తెరపైన ముగ్గురు ఎవరికి వారే తమ ప్రతిభను అద్బుతంగా చాటుకొన్నారు.

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. భ్రమయుగం సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి అత్యంత బలమని చెప్పవచ్చు. యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌కు తోడుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఉండటంతో సన్నివేశాలు హై రేంజ్‌లో ఎలివేట్ అయ్యాయి. ఇక సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ చిత్రీకరించారు. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్బుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. సౌండ్ డిజైన్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను రిచ్‌గా మార్చాయి.

మమ్ముట్టి, సిద్దార్థ్ భరతన్, అర్జున్ అశోకన్ నట విశ్వరూపంగా, కొత్త అనుభూతిని కలిగించే సాంకేతిక నిపుణత, ఎమోషన్స్, డ్రామా కలబోసిన చిత్రం భ్రమయుగం. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొత్త జోనర్‌ను ఆస్వాదించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్, టేకింగ్ ప్రేక్షకులను అబ్బురపరుస్తుందని చెప్పవచ్చు. అయితే స్లోగా, ఒకే పాయింట్‌తో కథ సాగడం.. కమర్షియల్ వాల్యూస్‌కు దూరంగా ఉండటం ఓ మైనస్‌గా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











