For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రేక్షకులు జంప్ ('బ్రహ్మానందం డ్రామా కంపెనీ' రివ్యూ)

  By Staff
  |

  Bramhanandam Drama Company
  -జోశ్యుల సూర్య ప్రకాష్
  బ్యానర్ : శ్రీ రామ చంద్రులు ఫిలింస్
  నటీనటులు:బ్రహ్మానందం,శివాజీ,కమిలినీ ముఖర్జీ,
  రఘు,రవికృష్ణ,రఘు బాబు,ధర్మవరుప,అలీ,జీవా,
  రవిబాబు,అపూర్వ తదితరులు
  సంగీతం: సాయి కార్తీక్, ఘంటాడి కృష్ణ
  ఎడిటింగ్: నాగిరెడ్డి
  మాటలు : రమేష్,గోపి
  స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: ఐ.శ్రీకాంత్
  నిర్మాత :పల్లికేశవరావు,కె.కిషోర్
  రిలీజు డేట్:11 జూలై 2008

  ఈ సినిమాలో ఓ జోకు ఉంటుంది. ధర్మవరపు సబ్రమణ్యం తన అసిస్టెంట్స్ తో "ఎదురుగా ఉన్న కారుని ఎత్తుకురండి" అని చెప్తాడు. వాళ్ళు వెంటనే కారు దగ్గరకెళ్ళి దానిని భుజాలపై మోసుకు రావటానికి ప్రయత్నిస్తూంటారు. అది చూసిన ధర్మవరపు కోపంగా "ఒరే ఎత్తుకు రమ్మంటే చక్కగా డ్రైవింగ్ చేస్తూ తీసుకురమ్మని " అని మందలిస్తాడు. సేమ్ సిట్యువేషన్ ఈ సినిమాకు ఎదురైంది. ప్రియదర్శన్ సూపర్ హిట్ 'భాగమ్ భాగ్' రీమేక్ చెయ్యాలని రైట్స్ తీసుకుని మొత్తం ఉన్నదున్నదున్నట్లుగా తెలుగు అనువాదం చేసారు. అంతే గాని ఆ కథలో కూర్చుని దాన్ని ఫీలై మన నేటివిటీకి మార్చుకునే ప్రయత్నం చేయలేదు. దాంతో 'హీరోయిన్ జంప్' అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా నుండి ప్రేక్షకులు జంప్ అవుతున్నారు.

  పోగ్రాం కోసం ఆనందం (బ్రహ్మానందం) నడిపే డ్రామా కంపెనీ బ్యాంకాక్ బయిలుదేరుతుంది. ఆ సమయంలో ఆ కంపెనీ హీరోలు శివాజీ, రవికృష్ణలు వెకిలి చేష్టలకు విసిగిన హీరోయిన్(సమీక్ష) జంప్ అవుతుంది. అప్పుడు ఆనందం వారిద్దరికి హీరోయిన్ ని తెచ్చుకున్న వారే స్టేజీ ఎక్కే ఛాన్సుంటుందని ప్రకటిస్తాడు. ఆ వేటలో ఉన్న వాళ్ళకి ఓ సూసైడ్ మానియో ఉన్న అమ్మాయి అర్పిత (కమిలినీ ముఖర్జి) పరిచయమవుతుంది. అప్పుడు వాళ్ళేం నిర్ణయాలు తీసుకున్నారు? ఆమె ఆ ట్రూపులో చేరిందా? ఆమెకు సూసైడ్ మానియో తగ్గిందా? అన్నది తెరపై చూడాల్సిన కథ.

  వాస్తవానికి 'బ్రహ్మానందం డ్రామా కంపెనీ' కథ ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం వచ్చిన 'మన్నార్ మత్తయ్య స్పీకింగ్' అనే మళయాళ కామిక్ థ్రిల్లర్ లోది. దానిని అప్ డేట్ చేసి, మసాలా అద్ది ప్రియదర్శన్ భారీ ఖర్చుతో, బ్రహ్మాండమైన కాస్టింగ్ తో 'భాగమ్ భాగ్' గా తెరకెక్కించాడు. దాన్ని మన తెలుగుకి తెచ్చి వర్కవుట్ చేసే క్రమంలో ఒరిజనల్ 'మన్నార్ మత్తయ్య స్పీకింగ్' ని ఫాలో అయ్యినా నేటివిటి టచ్ వచ్చేది. ఎందుకంటే హిందీలో ఉన్న వనరులు మన నిర్మాత,దర్శకుల దగ్గర లేవు కాబట్టి.

  అలాగే కామిడీకి టైమింగ్ ముఖ్యం .ఈ సినిమాకి అదే తక్కువయింది. ఎంతసేపూ బ్రహ్మానందాన్ని క్యాష్ చేసుకుందామనే ప్రయత్నమే ప్రతీ ఫ్రేమ్ లో కనపడుతుంది. అలాగే తెలుగు సినిమా అనేటప్పటికి కాస్త ఆ పాత్రల పరిచయం,సెటప్ చేస్తే కన్ఫూజన్ లేకుండా అర్ధమయ్యేది. ఇక 'బ్రహ్మానందం డ్రామా కంపెనీ' అనే పేరు పెట్టినందుకైనా సినిమాలో మినిమం ఒక్క సీనైనా నాటకం రిహార్సులో ,స్టేజీ ప్లేనో చూపితే రక్తి కట్టేది. అలా చేయక పోవటంతో టైటిల్ న్యాయం జరగక,రికార్డింగ్ డాన్స్ ట్రూపు చూస్తున్న ఫీలింగ్ వచ్చింది.

  అయితే దర్శక,నిర్మాతలని ఒక విషయంలో మెచ్చుకోవాలి...టైటిల్ జస్టిఫికేషన్ ని సినిమా ని డ్రామాగా కృతకంగా మార్చటంలో చూపెట్టారు. అలాగే ఈ కామిడీ సినిమాకు మరో స్పెషల్ ఎక్కడా నవ్వురాకపోవటమే.

  ఎన్ని వీక్స్ సినిమా అనడిగే టెన్ వీక్స్...అన్నాడట వెనకటికొకడు. అంటే ఆ సినిమాలో ప్రధాన పది శాఖలు వీక్ అని చెప్పినాయనన ఇన్నర్ మీనింగ్ . సేమ్ టు సేమ్ సిట్యువేషన్ ఈ సినిమాకి వర్తిస్తుంది. ఎందుకంటే చివరకు రచయితలు కూడా బూతు డైలాగులు బాగా వేసి సినిమాని ఫ్యామిలీస్ కి దూరం చేసి పుణ్యం కట్టుకున్నారు. టాక్ తెలుసుకోకుండా ....టైటిల్ చూసి టెమ్ట్ అయిన వారు మాత్రమే ఈ డ్రామా చూడ్డానికి వెళ్తారు. అదృష్టం బాగుండి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే సినిమా హిట్టవుతుంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X