twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brandy Diaries Review and Rating : మరో అర్జున్ రెడ్డి అనిపించుకున్న సినిమా, ఎలా ఉందంటే?

    |

    Rating: 2.5/5

    నటీనటులు : గరుడ శేఖర్, సునీతా సద్గురు, నవీన్ వర్మ, కె వి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మద్నే, ఇతరులు.
    సినిమా పేరు: బ్రాందీ డైరీస్,
    బ్యానర్: కలెక్టివ్ డ్రీమర్స్,
    నిర్మాత : లేళ్ల శ్రీకాంత్,
    రచన - దర్శకత్వం: శివుడు,
    సంగీతం: ప్రకాష్ రెక్స్,
    సినిమాటోగ్రఫీ: ఈశ్వరన్ తంగవేలు,
    ఎడిటర్: యోగ శ్రీనివాసన్,
    రిలీజ్: 2021-08-13

    కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కట్టాయి. మరీ ముఖ్యంగా ఒకే రోజు 7,8 సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇక గత వారం 7 సినిమాలు రిలీజ్ కాగా వాటిలో ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. ఇక ఈ రోజు కూడా దాదాపు ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో బ్రాందీ డైరీస్ అనే సినిమా టైటిల్ తో పాటు ముందు నుంచే ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ట్రైలర్ ని చూసి అందరూ మరో అర్జున్ రెడ్డి సినిమాలా ఉందని అనడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది. మరి ఆ సినిమా ఎలా ఉంది అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం.

    Bigg Boss Telugu 5లోకి ఎంట్రీ ఇస్తున్న ఇషా చావ్లా: మతి పోగొట్టే ఫోజులతో ఘాటు ఫొటోలుBigg Boss Telugu 5లోకి ఎంట్రీ ఇస్తున్న ఇషా చావ్లా: మతి పోగొట్టే ఫోజులతో ఘాటు ఫొటోలు

    కథ

    కథ

    శ్రీను (గరుడ శేఖర్) అనే ఒక తెలివైన కుర్రవాడి జీవిత కథే ఈ సినిమా. గుంటూరు జిల్లాలోని ఒక పల్లెటూరి నుంచి హైదరాబాద్ వచ్చిన శ్రీను చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు.. కలలు కనడమే కాక అందుకు తగ్గ కృషి కూడా చేస్తూ హైదరాబాద్ లో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటాడు.. అక్కడ ఆల్కహాల్ కు బానిస కావడంతో స్నేహితుల సలహా మేరకు మళ్లీ గుంటూరు షిఫ్ట్ అవుతాడు. గుంటూరు వెళ్లిన శ్రీనుకు బార్ లో నాలుగు విభిన్నమైన వ్యక్తిత్వం గల వాళ్లు పరిచయం అవుతారు. వారి పరిచయంతో శ్రీను జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ? శ్రీను ప్రేమించిన భవ్య చివరికి శ్రీను దక్కిందా? అసలు ఈ సినిమాకు బ్రాందీ డైరీస్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఆ పేరును సినిమా సార్థకం చేసిందా ? లేదా అనే విషయాలు తెలియాలంటే సమీక్షలో కి వెళ్లాల్సిందే.

    దర్శకుడి పని తీరు ఎలా ఉందంటే?

    దర్శకుడి పని తీరు ఎలా ఉందంటే?

    ఈ సినిమా దర్శకుడు శివుడికి ఇది మొదటి సినిమా. మొదటి నుంచి కూడా ఈ దర్శకుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తూ తన సినిమాలో హీరో ఆల్కహాల్ అంటూ ప్రకటనలు ఇవ్వడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది. అలా ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించగలిడిగాడు దర్శకుడు.

    అలాగే బ్రాందీ డైరీస్ కథ ఎంచుకున్న తీరు, ఆ కధను స్క్రీన్ ప్లే తో మెప్పించగల విషయంలో కాస్త తడబడినట్టు అనిపించింది. బహుశా మొదటి సినిమా కావడంతో అలా జరిగినట్లు అనిపిస్తూ ఉండవచ్చు. కానీ జరగబోయే సీన్లు ఏమిటి అనే విషయం మీద కూడా ప్రేక్షకులకు కొంత ముందుగానే అవగాహన చేస్తూ ఉండడంతో సినిమా రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుంది.

    అయితే మొదటి ప్రయత్నంలో ఈ మేరకు ప్రయత్నం చేయడం అనేది మంచి విషయమే. కాబట్టి ఈ చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపాల్సిన పని లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ ను ఒక వ్యసనంగా భావించే అందరికీ ఇది కూడా ఒక అలవాటు లాంటిదే అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

    నటీనటుల పెర్ఫామెన్స్ ఎలా ఉందంటే?

    నటీనటుల పెర్ఫామెన్స్ ఎలా ఉందంటే?

    నటీనటుల విషయానికి వస్తే శ్రీనుగా గరుడ శేఖర్, భావ్యగా సునీత సద్గురు తమదైన పాత్రలలో నటించి మెప్పించారు.. ఈ సినిమా చేసిన ఇద్దరూ కొత్తవారే అయినప్పటికీ ఎక్కడ కొత్తవారు అనిపించేలా సీన్లు లేవు. అనుభవం ఉన్న నటీనటుల లానే హీరో హీరోయిన్ గా నటించారు అని చెప్పవచ్చు. అయితే హీరో వాయిస్ మాత్రం కాస్త సినిమాకి ఇబ్బందికరమైన ఫీలింగ్ తీసుకు వచ్చింది.

    బహుశా వేరే వారి వాయిస్ వద్దు అనుకుని హీరో వాయిస్ తో డబ్బింగ్ చెప్పించి ఉండొచ్చు. అందువల్ల కాస్త డిస్టబెన్స్ కలిగిన ఫీలింగ్ అయితే కలుగక మానదు. ఇక మిగతా నటీనటులు ఎవరో కూడా తెలుగు వారికి పరిచయం లేదు. అయితే ముందు నుంచి ఈ సినిమా యూనిట్ నటీనటులందరూ కొత్తవాళ్ళు అని ప్రచారం చేయడంతో పాటు నటించిన అందరూ రంగస్థల నటులు అని చెప్పడంతో వారి నటన కూడా ఆసక్తికరంగా సాగిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రొఫెసర్ పాత్రలో నటించిన నటుడి నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని తీరుతుంది. అలాగే ఇతర పాత్రధారులు కూడా తెరమీద కనిపించినంత సేపు తమదైన ముద్ర వేసుకొని కి ప్రయత్నించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    ఇక సాంకేతిక విభాగాల పనితీరును విషయానికి వస్తే సినిమాకి సంగీతం అందించిన ప్రకాష్ రెక్స్ అందించిన పాటలు తక్కువే అయినా బాగున్నాయి అలాగే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. వంశీ అట్లూరి ఎడిటింగ్, ఈశ్వరన్ తంగవేలు సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. ఈ సినిమాను =తన స్నేహితుల సహకారంతో క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలో ఇండిపెండెంట్ ఫిలిమ్ గా కలెక్టివ్ డ్రీమర్స్ బ్యానర్ మీద నిర్మాత లేళ్ల శ్రీకాంత్ రూపొందించగా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

    విషయం ఏమిటంటే

    విషయం ఏమిటంటే

    ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఆల్కహాల్ దాని పర్యవసానాలు అనే విషయాలను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపించే విధంగా రూపొందించాలని దర్శకుడు భావించినట్లుగా అనిపించింది. అయితే దర్శకుడు తన జీవితంలో ఏవైతే జరిగాయి అని చెప్పాడో ఈ సినిమాలో కూడా దాదాపు అవే చూపించాడు.

    సివిల్స్ కి ప్రిపేర్ కావడం కోసం వెళ్ళడం, మద్యానికి బానిస కావడం, అలాగే మద్యం వల్ల ఎందరో పడుతున్న ఇబ్బందులను చూపించడం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు మతాలను దేవుళ్లను తిడితే తప్పేంటి అన్నట్లుగానే ఒక మతాన్ని కాస్త కించపరిచేలా చూపించినా, ఆ వెంటనే రక్తం కక్కుకుని పడిపోయినట్లు చూపించడంతో కాస్త లెవల్ చేసినట్లు అనిపించింది.

    Recommended Video

    Brandy Diaries ఫ్రెండ్షిప్ కి నిదర్శనం.. క్రౌడ్ ఫండెడ్ మూవీ - Director Sividu
    ఫైనల్ గా

    ఫైనల్ గా

    ఇక ఫైనల్ గా చెప్పాలంటే నేటి యువత మద్యానికి ఎలా బానిస అవుతోంది ? వారు మద్యానికి బానిస కావడం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయి ? ఎలా ఇబ్బందులు పడుతున్నాయి? అంశాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఎక్కడా మందు తాగడం తప్పు అని సందేశాలు ఇవ్వకుండానే యువతలో పరివర్తన చెందేలా సినిమాలో కొన్ని సన్నివేశాలు చూపించడంలో సఫలమయ్యాడనే చెప్పాలి. ఈ వీకెండ్ లో ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వారు ఖచ్చితంగా ఈ సినిమాను ప్రిఫర్ చేయొచ్చు.

    English summary
    Brandy Diaries is a Telugu movie released on 13 Aug, 2021. The movie is directed by Sivudu and featured Garuda Sekhar and Sunita Sadguruu as leads.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X