Brinda web Series Review: బృంద వెబ్ సిరీస్ రివ్యూ.. త్రిషా పవర్ ఫుల్ ఆఫీసర్‌గా..
నటీనటులు: త్రిషా కృష్ణన్, ఇంద్రజిత్ సుకుమారన్, జయ ప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి తదితరులు
దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల
నిర్మాత: కోల్ల అశీష్
మ్యూజిక్: శక్తి కాంత్ కార్తీక్
సినిమాటోగ్రాఫర్: దినేష్ కే బాబు
ఎడిటర్: అన్వర్ అలీ
ఓటీటీ రిలీజ్: సోని లివ్
రిలీజ్ డేట్: 2024-08-02
బృంద (త్రిషా కృష్ణన్) హైదరాబాద్‌లో స్ట్రిక్ట్ పోలీస్ సూపరింటెండెంట్. నగరంలో సీరియల్ కిల్లింగ్స్ భాయబ్రాంతులకు గురి చేస్తాయి. అయితే వరుసగా జరిగిన మూడు దారుణ హత్యలపై ఆమె ఫోకస్ పెడుతుంది. పోలీస్ విభాగాన్ని అప్రమత్తం చేస్తుంది.

బృంద జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు ఏంటి? అడవిలో ఓ చిన్నారిని ఎందుకు బలి ఇవ్వాలని ప్రయత్నించారు? ఆ బలి జరిగిందా? ఇక ఎస్పీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నగరంలో జరుగుతున్న హత్యలకు కారణం ఏమిటి? ఆ హత్యల వెనుక హస్తం ఎవరిది? వరుస హత్యలు చేయడానికి కారణాలు ఏమిటి? బృంద దర్యాప్తు ఎలా సాగింది? ఈ హత్య కేసు విచారణను ఎలా ముగించింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ కథ.
ఓ గ్రామంలో అడవి తల్లి బలి కోరుకొంటుంది. కాబట్టి ఓ చిన్నారిని బలి ఇవ్వాలనే ఓ ఎమోషనల్ పాయింట్‌తో వెబ్ సిరీస్‌ను ప్రారంభించడం ద్వారా ఆడియెన్స్‌ను కథకు కనెక్ట్ అయ్యేలా చేసింది. కథలో మలుపులు, ఎమోషన్స్ విశేషంగా ఆకట్టుకొంటాయి. క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన మసాలాను గట్టిగా దట్టించి ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు.
క్యారెక్టర్లు, కథను ఎస్టాబ్లిష్ చేయడానికి ఆరంభ ఎపిసోడ్స్‌లో కొంత సమయం తీసుకొన్నప్పటికీ.. ఆ తర్వాత కథను వేగంగా నడిపించిన తీరు బాగుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కథను నడిపించిన తీరు బాగుంది. దర్శకుడు గ్రిప్పింగ్‌గా రాసుకొన్న సన్నివేశాలు వెబ్ సిరీస్‌ను బాగా కనెక్ట్ చేస్తాయి.

ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో గ్లామర్, హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో ఆకట్టుకొన్న త్రిషా కృష్ణన్ తొలిసారి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ప్రవేశించారు. పోలీస్ ఆఫిసర్‌గా, ఇన్వెస్టిగేషన్ చేసిన తీరు బాగుంది. పోలీస్ ఆఫీసర్‌గా బాడీ లాంగ్వేజ్, హావభావాలతో ఇరుగదీసింది. ఆనంద్ సామి ఆనంద్‌గా, ఇంద్రజిత్ సుకుమారన్, సారథిగా రవింద్ర విజయ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రత్యేక పాత్రలో రాకేందు మౌళి ఆకట్టుకొన్నాడు.
క్రైమ్, థ్రిల్లింగ్ , సస్పెన్స్ ఎలిమెంట్స్‌కు ఎమోషన్స్ కలిపి రూపొందించిన వెబ్ సిరీస్ బృంద. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. ప్రతీ ఎపిసోడ్ చివర్లో ఇచ్చిన ట్విస్టులు సిరీస్ మొత్తం చూసేలా చేస్తాయి. త్రిష, ఇంద్రజిత్, రాకేందు, రవింద్ర విజయ్ ఫెర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. క్రైమ్ కాన్సెప్ట్‌తో వచ్చే కథలను ఆదరించే వారికి బృంద తప్పకుండా నచ్చుతుంది. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. తప్పకుండా చూడండి..


Click it and Unblock the Notifications











