Bro Movie Review ఫర్‌ఫెక్ట్ ఫ్యాన్స్ మూవీ బ్రో.. పవన్ కల్యాణ్, తేజ్ కెమిస్ట్రీ మ్యాజిక్ చేసిందా అంటే?

Rating:
3.0/5

నటీనటులు: పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, ఊర్వశి రౌటేలా, బ్రహ్మానందం, సుబ్బరాజు, అలి రెజా, రోహిణి తదితరులు
దర్శకత్వం: సముద్రఖని
స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల
సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్: నవీన్ నూలీ
మ్యూజిక్: ఎస్ఎస్ థమన్
బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2023-07-28

పీపుల్స్ టైక్స్‌టైల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధరమ్ తేజ్)కి చిన్నతనంలో తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు మీద పడుతాయి. దాంతో యవ్వనంలో చాదస్తం ఎక్కువైపోతుంది. ఇద్దరు చెల్లెల్లు (ప్రియా వారియర్, యువ లక్ష్మీ), తమ్ముడు , తల్లి (రోహిణి) బాధ్యతలను తానే మోస్తున్నాననే భ్రమలో ఉంటాడు. ప్రేయసి రమ్య (కేతిక శర్మ)కు టైమ్ ఇవ్వకుండా బిజీగా ఉంటాడు. ఈ క్రమంలో ఉద్యోగం పనిమీద వైజాగ్‌కు వెళ్లి వస్తూ కారు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. తన మరణం తర్వాత టైటాన్ అలియాస్ టైమ్ (పవన్ కల్యాణ్)ను కలుస్తాడు. తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉందని బాధపడుతుంటే.. 90 రోజులు బతికే అవకాశం ఇస్తాడు.

 Pawan Kalyan, Sai Dharam Tejs Bro The Avatar movie is set to release on July 28th. Here is the Telugu Filmibeat exclusive Review.

90 రోజుల మళ్లీ బతికే అవకాశం లభించడంతో మార్క్ ఏం చేశాడు? కుటుంబంలో తనపై తిరుగుబాటు రావడంతో ఎలా ఫీలయ్యాడు? ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన చెల్లెలు పరిస్థితి ఏమైంది. విదేశాల్లో చదువుకోవాలనుకొనే చెల్లెలికి పెళ్లి చేయాలనుకొన్న మార్క్‌కు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? తనకు తెలియకుండా రెండేళ్లుగా లవర్‌తో డేటింగ్ చేస్తున్న తమ్ముడి పరిస్థితిని చూసి మార్క్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అస్వస్థతకు గురైన తల్లి విషయంలో కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ప్రేయసి రమ్యను మార్క్ ఎందుకు? ఎలా దూరం చేసుకొన్నాడు? సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న మార్క్‌కు టైటాన్ ఎలాంటి గీతోపదేశం చేశాడు? 90 రోజులు పూర్తి కాకుండానే మార్క్ తన మరణాన్ని ఎందుకు కోరుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే బ్రో ది అవతార్ సినిమా కథ.

మార్క్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో సినిమాను ప్రారంభించి ఎక్కువ సమయం తీసుకోకుండానే కథలోకి వెళ్లిపోవడంతో ఆసక్తి పెరుగుతుంది. మార్క్ యాక్సిడెంట్ తర్వాత టైమ్ రూపంలో పవన్ కల్యాణ్ రావడంతో సినిమా ఎమోషనల్ సర్కిల్ నుంచి మాస్ జోన్‌లోకి వెళ్తుంది. ఫస్టాఫ్ అంతా ఫ్యాన్స్ కోసమే సీన్లను రాసుకొన్నారనేది తొందరగానే అర్దం అవుతుంది. అయితే కథలో వేరియేషన్స్, ఎమోషన్స్ మిస్ కావడంతో సినిమా తొలి భాగంలో చప్పగా సాగినట్టు అనిపిస్తుంది.

 Pawan Kalyan, Sai Dharam Tejs Bro The Avatar movie is set to release on July 28th. Here is the Telugu Filmibeat exclusive Review.

బ్రో సెకండాఫ్ విషయానికి వస్తే.. కథలో అసలు ఎమోషన్స్ బిల్డ్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. పవన్ కల్యాణ్ స్టైల్స్, స్వాగ్ వర్కవుట్ కావడం, సాయిధరమ్ తేజ్ క్యారెక్టర్‌తో కెమిస్ట్రీ పండటంతో సినిమా జోష్ పెరుగుతుంది. సెకండాఫ్‌లో తల్లి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతీ సీన్ భావోద్వేగంతో నిండిపోతుంది. చివర్లో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ మధ్య సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉండటంతో ఫీల్‌గుడ్ నోట్‌తో సినిమా ముగుస్తుంది.

దర్శకుడు సముద్రఖని వినోదయ సీతమ్ చిత్రంలోని కథకు సంబంధించిన ఆత్మను, క్యారెక్టర్లలో ఎలాంటి మార్పు లేకుండా ముందుకెళ్లాడు. అయితే పవన్ కల్యాణ్ ఇమేజ్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వింటేజ్ క్యారెక్టర్లను, తమ్ముడు, జల్సా, భీమ్లా నాయక్ సినిమాల్లోని పాటలతో ఫ్యాన్స్ హుషారెత్తించే పనిచేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే పవన్‌ను కథలో ఎంత వాడాలో అంతే వాడటం ద్వారా సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది. తమిళంలో సాదాసీదాగా ఉండే కథను మాస్, మసాలాలు నింపి ఫ్యాన్స్‌కు ఫుల్ భోజనంలా మార్చాడని చెప్పవచ్చు.

 Pawan Kalyan, Sai Dharam Tejs Bro The Avatar movie is set to release on July 28th. Here is the Telugu Filmibeat exclusive Review.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ క్యారెక్టర్ల మీదే కథ సాగడం వల్ల ఇతర పాత్రలు పెద్దగా కనిపించవు. రిజిస్టర్ కూడా కావు. పవన్ కల్యాణ్ స్టైయిల్, స్వాగ్ సినిమాకు బలంగా మారాయి. సాయిధరమ్ తేజ్ తన క్యారెక్టర్‌కు తగినట్టుగా పలు రకాల వేరియేషన్స్ చూపించాడు. పవన్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో ఉండే కెమిస్ట్రీ స్పెషల్ ఎట్రాక్షన్. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ క్యారెక్టర్లకు పెద్దగా స్కోప్ లేకపోయింది. రాజా, అలి రెజా, తనికెళ్ల భరణి తదితర పాత్రలు కథకు తగినట్టుగా ఉన్నాయి.

 Pawan Kalyan, Sai Dharam Tejs Bro The Avatar movie is set to release on July 28th. Here is the Telugu Filmibeat exclusive Review.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫి బాగుంది. పవన్, తేజ్ కాంబినేషన్ సీన్లను, ఆ సీన్లలో ఉండే భావోద్వేగాలను చక్కగా క్యాప్చర్ చేశారు. తమన్ మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మార్కండేయులు, జానవులే పాటలు బాగున్నాయి. బ్రో టైటిల్ సాంగ్ జోష్‌ను కలిగించేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్, తేజ్ స్టైలింగ్‌ను నీతా లుల్లా బాగా డిజైన్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్, సగటు సినిమా ప్రేక్షకులు డైలాగ్స్‌ను బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఈ విషయంలో త్రివిక్రమ్ బాగానే నిరాశపరిచాడనిపిస్తుంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఎక్కడా టచ్ కావు. పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

 Pawan Kalyan, Sai Dharam Tejs Bro The Avatar movie is set to release on July 28th. Here is the Telugu Filmibeat exclusive Review.

వినోదయ సీతమ్ సినిమా కథలోని ఆత్మను తీసుకొని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసుకొని రూపొందించిన చిత్రం బ్రో ది అవతార్. సెకండాఫ్‌‌‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు బలంగా మారాయి. ఫస్టాఫ్‌లో స్లోగా రన్ కావడం, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ లేకపోవడం కొంత నిరాశ అని చెప్పవచ్చు. కానీ పవన్ వింటేజ్ గెటప్స్, పాటలు ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌. పవన్ కల్యాణ్ మార్కు తరహా సినిమా కాదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెళితే.. మంచి అనుభూతి, జోష్ కలుగుతుంది. కేవలం ఫ్యాన్స్ కాకుండా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. ఓవరాల్‌గా మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ మూవీ. వన్ టైం వాచ్ మస్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X