BRO Twitter Review పవన్ ఫ్యాన్స్ పండుగే పండుగ.. బ్రో ది అవతార్ హిట్టు బొమ్మ.. బ్రో ట్విట్టర్ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం BRO The Movie. తమిళంలో భారీ విజయం అందుకొన్న వినోదయ సీతమ్ సినిమా రీమేక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్, కృతిశెట్టి నటించారు. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. యూఎస్‌లో ప్రీమియర్ల తర్వాత ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందంటే?
బ్రో సినిమా బాగుంది. బ్రో సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. పాటలు బాగున్నాయి. ఫ్యాన్స్‌కు మంచి అనుభూతి కలిగించే సన్నివేశాలు ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సాయికి అద్దంలో చూపించే సీన్. జీవితంలో ప్రాక్టికాలిటీస్ గురించి చెప్పే విషయాలు అదిరిపోతాయి. మూవీ లవర్స్‌కు డైలాగ్స్ కనెక్ట్ అవుతాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

బ్రో సెకండాఫ్ ఎలా ఉందంటే? కొన్ని ల్యాగ్ సీన్లు, బోరింగ్ సీన్లు ఉన్నాయి. పవన్ కల్యాణ్ సింగిల్ హ్యాండెడ్ పెర్ఫార్మెన్స్.. ఆడియెన్స్ ఎమోషల్ అయ్యే సీన్లు ఉన్నాయి.
బ్రో ది అవతార్ హిట్టు బొమ్మ. నా మాట తప్పైతే ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేసుకొని యూజీ పోతా. థ్యాంక్యూ SDT. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్టు మీరు చాలా లక్కీ. మీకు అలాంటి మామ ఉండటం నిజంగా లక్కీనే అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

బ్రో సినిమా స్ట్రిక్టుగా పీకే ఫ్యాన్స్ కోసమే. పీకే వింటేజ్ మాషప్ సాంగ్స్‌కు విజిల్స్ పడాల్సిందే. సినిమా ఫ్లాట్‌గా ఉంది. త్రివిక్రమ్ మరోసారి రీమేక్‌ను హ్యాండిల్ చేయడంలో విఫలమయయాడు. ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉంది. బీజీఎం అదిరిపోయింది అని నెటిజన్లు ట్వీట్ చేశారు.
బ్రో సినిమా చూస్తుంటే పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు, తొలి ప్రేమ సినిమాలు గుర్తుకు వచ్చాయి. స్క్రీన్ మీద ఎనర్జటిక్‌గా ఉన్నారు. ఫ్యాన్స్ ఫీస్ట్. ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
బ్రో సినిమాను పవన్ కల్యాణ్ కోసం ఓ సారి చూడొచ్చు. పవన్ కల్యాణ్ స్వాగ్ ఫన్ చాలా బాగుంది. కొన్ని సీన్లు పిల్లలు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. స్టోరి కొంత బాగుంది అని ట్వీట్ చేశారు.
బ్రో ది మూవీ చూశాను. తమన్ మ్యూజిక్, బీజీఎం కేక. థ్యాంక్యూ వెరీ మచ్ బ్రో. మ్యూజిక్‌తో తమన్ రఫాడించావు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
బ్రో ది అవతార్ ఫస్టాఫ్ అయిపోయింది. పవన్ కల్యాణ్ స్టైల్, స్వాగ్ అదిరిపోయింది. పీకే మూవీస్ రెఫరెన్స్, సాంగ్స్ బాగున్నాయి. థియేటర్‌లో పవన్ ఫ్యాన్స్‌కు పండగే. ఓవరాల్‌గా జనరల్ ఆడియెన్స్ ఫస్టాఫ్ గుడ్. పీకే ఫ్యాన్స్‌కు మాత్రం పూనకాలు ఉంటుంది.
Bro టైమ్ స్టార్ట్ అయింది. పవన్ కల్యాణ్ లవ్ యూ అన్నా. పవర్ స్టార్ వన్ మ్యాన్ షో. అన్న యాటిట్యూడ్ సీక్స్. నాకు బాగా నచ్చింది బ్రో అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
బ్రో సినిమా చూశాను. జీరో ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్లండి. మంచి అనుభూతితో వస్తారు. సినిమా బ్లాక్ బస్టర్. బ్రోది అవతార్ చూడండి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు


Click it and Unblock the Notifications











