Bubblegum Review ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌తో మానస చౌదరీ.. రోషన్ కనకాల ఎలా చేశాడు? బబుల్‌గమ్ సమీక్ష

Rating:
2.5/5

నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్షవర్ధన్, హర్ష చెముడు, కిరణ్ మచా, అనుహాసన్, చైతూ జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి, అనన్య ఆకుల తదితరులు
దర్శకత్వం: రవికాంత్ పేరేపు
స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరుపు, వంశీకృష్ణ
నిర్మాతలు: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫి: సురేష్ రగుతు
బ్యానర్స్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్
రిలీజ్ డేట్: 2023-12-29

Recommended Video

Debut తోనే Anchor Suma కొడుకు ప్రభంజనం | Bubblegum Public Talk | Telugu Filmibeat

బస్తీ కుర్రాడైన ఆదిత్య (రోషన్ కనకాల) డీజేగా మంచి పాపులారిటీని సాధించాలనే డ్రీమ్‌తో లైఫ్‌ను తన స్నేహితులతో జాలీగా గడుపుతుంటాడు. ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకొనే సంపన్న కుటుంబానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ జాన్వీ (మానస చౌదరి)ని చూసి ప్రేమలో పడుతాడు. అప్పటికే బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీకి బ్రేకప్ అయి ఉంటుంది. ఆ సమయంలో జాన్వీపై పీకల్లోతు ప్రేమలో ఉన్న ఆదిత్యకు ఊహించని అవమానం జరుగుతుంది. దాంతో జాన్వీని మరిచిపోయి కెరీర్‌పై దృష్టిపెట్టాలని అనుకొంటాడు. కానీ మళ్లీ ఆదిత్య జీవితంలోకి జాన్వీ వస్తుంది.

Bubblegum-Review

పాతబస్తీలో అల్లరి చిల్లరిగా తిరిగే ఆదిత్య జీవితంలోకి జాన్వీ ఎలా వచ్చింది? బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ ఎందుకు బ్రేకప్ చేసుకొన్నది. ఆదిత్య లవ్‌ను జాన్వీ అంగీకరించిందా? ఆధిత్యకు జరిగిన అవమానం ఏమిటి? ఆ అవమానం ఎందుకు జరిగింది? ఆదిత్యకు అవమానం జరిగిన తర్వాత మళ్లీ జాన్వీ అతడి వద్దకు ఎందుకు వచ్చింది? తన ఇంటిలో మకాం పెట్టిన జాన్వీ ప్రేమను అంగీకరించాడా? జాన్వీ, ఆదిత్య ప్రేమ మళ్లీ చిగురించిందా? వారి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారా? అనేది బబుల్‌గమ్ సినిమా కథలో ప్రధాన అంశాలు.

బబుల్‌గమ్ సినిమా ప్రారంభమైన తీరు చూస్తే.. ఈ మూవీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ అనే ఫీలింగ్ వెంటనే కలిగిపోతుంది. ఆదిత్యగా రోషన్‌ను ఆరంభంలో ఎలివేట్ చేసిన విధానంతో సినిమాపై కొంత ఆసక్తి కలుగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో ఫన్‌, రొమాన్స్‌ అంశాలను నమ్ముకొన్నట్టు కనిపిస్తుంది. అయితే ఫన్ పెద్దగా వర్కవుట్ అయిందనిపించదు. కానీ రొమాన్స్ మాత్రం యూత్‌కు కిక్కించేలా అనిపిస్తుంది. ముద్దులు, కౌగిలింతలతో స్క్రీన్‌పై రోషన్, మానస చెలరేగిపోయారు. అప్పటి వరకు సాదాసీదాగా సాగిపోతుందనే ఫీల్‌లో ఉన్న వారికి మంచి ఎమోషనల్ ట్విస్టుతో దర్శకుడు రమాకాంత్ ప్రేరేపు ఫస్టాఫ్‌ను ముగించిన తీరు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

అయితే సెకండాఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో కథ సాగుతుందని భావించిన వారికి మళ్లీ రొమాన్స్ మూమెంట్స్‌తో సాగదీసినట్టు అనిపించారు. కానీ సెకండాఫ్‌లో హీరోకు సంబంధఇంచి తండ్రి కోడుకుల మధ్య సీన్లు, హీరోయిన్‌కు సంబంధించిన ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు కనెక్ట్ చేసేలా చేస్తాయి. అయితే రొటీన్ లవ్ స్టోరి మాదిరిగా హ్యాపీ ఎండింగ్ ఇవ్వకుండా డిఫరెంట్‌‌గా దర్శకుడు ఓపెన్ ఎండ్ క్లైమాక్స్‌తో ముగించాడనే ఫీలింగ్‌ కలుగుతుంది. దర్శకుడు రమాకాంత్ టేకింగ్ బాగుంది. కానీ బలమైన సన్నివేశాలు, కామెడీ సీన్లు, ఎమోషన్స్ మరింత స్ట్రాంగ్‌గా రాసుకొంటే బాగుండేదనిపిస్తుంది.

ఇక తొలి చిత్ర నటుడిగా రోషన్ కనకాల ఆదిత్య పాత్రలో ఒదిగిపోయాడు. కొత్తవాడేనే ఫీలింగ్ ఏ సన్నివేశంలోను కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. తన క్యారెక్టర్‌కు తగినట్టుగా ఈజ్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం బాగుంది. లుక్‌ పరంగా ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రొమాంటిక్ సీన్లలోను, భావోద్వేగమైన సన్నివేశాలకు పూర్తిగా న్యాయం చేశాడు. చిన్న చిన్న లోపాలను సవరించుకొంటే.. తప్పకుండా రాణించగలడనే భరోసాను కల్పించాడు.

ఇక మానస చౌదరీ కూడా మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. గ్లామర్‌తో అదరగొట్టడమే కాకుండా యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. రోషన్‌తో కెమిస్ట్రీని బాగా పడించింది. అందం, అభినయంతో టాలీవుడ్‌లో రాణించగలిగే తెలుగు అమ్మాయి అనే ఫీల్‌ను కల్పించింది. ఇక రోషన్ తల్లిదండ్రులగా నటించిన వారు సినిమాకు అదనపు ఆకర్షణ. ముఖ్యంగా తండ్రి పాత్రలో నటించిన చైతూ జొన్నలగడ్డ ఫుల్ ఈజ్‌తో, తనదైన శైలిలో డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకోవడమే కాదు అతడి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. మిగితా పాత్రల్లో కనిపించిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

బబుల్‌గమ్‌ను సాంకేతిక పరంగా చూస్తే.. ప్రధానంగా మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను యూత్‌ఫుల్‌గా మార్చింది. గోవా, ఇతర ప్రాంతాల్లో సురేష్ రగుతు చిత్రీకరించిన సన్నివేశాలు కలర్‌ఫుల్‌గా, ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనిపించింది. ఇతర విభాగాల పనితీరును వంక పెట్టాల్సిన అవసరం లేదు. పీపుల్స్ మీడియా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ విలువలు ఉన్నాయి.

నేటితరం యువత ఆలోచనలకు దగ్గరగా, లవ్, ప్రీ మ్యారేజ్ రొమాన్స్ లాంటి అంశాలతో రూపొందిన చిత్రం బబుల్‌గమ్. సాధారణంగా యూత్‌ఫుల్, రొమాంటిక్ చిత్రాలకు బలమైన ఎమోషన్స్ ఉంటే కథ, కథనాలు మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. అయితే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ స్ట్రాంగ్‌గా ఎలివేట్ కాకపోవడం మైనస్‌గా మారింది. అయితే అర్జున్ రెడ్డి, బేబీ తరహా స్థాయి కాకపోయినా.. అలాంటి చిత్రాలను ఇష్టపడేవారికి బబుల్‌గమ్ నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల కనెక్ట్ అయ్యే పరిస్థితిని బట్టి సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X