Buddy Review: బడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

మూవీ: బడ్డీ
నటీనటులు: అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ఆలీ, ముఖేష్ రుషి తదితరులు
దర్శకత్వం: సామ్ ఆంటన్
నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా
కో ప్రొడ్యూసర్: నేహ జ్ఞానవేల్ రాజా
మ్యూజిక్: హిప్ హప్ తమీజా
సినిమాటోగ్రాఫర్: కృష్ణన్ వసంత్
ఎడిటర్: రుబెన్
బ్యానర్: స్టూడియో గ్రీన్ ఫిలింస్
రిలీజ్ డేట్: 2024-08-02.

వైజాగ్ విమానాశ్రయంలో పైలెట్‌గా ఆదిత్య రామ్ పనిచేస్తుంటాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పల్లవి (గాయత్రి భరద్వాజ్) ఉద్యోగంలో చేరుతుంది. ఉద్యోగంలో తొలి రోజు కావడంతో ఫ్లయిట్ ల్యాండింగ్ విషయంలో తడబాటుకు గురి కావడంతో పల్లవికి ఆదిత్య సహకరించడంతో వారిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఆదిత్య, పల్లవి చూడకుండానే ఇద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ ఏర్పడుతుంది. ఓ రోజు ఆదిత్యను కలువడానికి వెళ్తుంటే కబీర్ (అజ్మల్ అమీర్) గ్యాంగ్ పల్లవిని కిడ్నాప్‌ చేసి హాంకాంగ్‌కు తరలిస్తారు.

Buddy Movie Review in Telugu  Allu Sirish stylish fun drama

కబీర్ గ్యాంగ్ ఎందుకు పల్లవిని కిడ్నాప్ చేసింది. ఆమెను ఎందుకు హాంకాంగ్‌కు తరలించారు? అసలు కబీర్ ఎవరు? పల్లవికి టెడ్డీ బేర్‌కు రిలేషన్ ఏంటి? పల్లవిని టెడ్డీ బేర్ ఎందుకు రక్షించాలని అనుకొన్నది? కబీర్ చెరలో ఉన్న పల్లవిని ఆదిత్య రక్షించడానికి హంకాంగ్‌ వెళ్లాడా? హంకాంగ్‌కు వెళ్లడానికి ఆదిత్య ఎలాంటి ప్లాన్స్ వేశాడు? కబీర్ మాఫియా వ్యవహరాలకు ఆదిత్య చెక్ పెట్టాడా? అనే ప్రశ్నలకు సమాధానమే బడ్డీ సినిమా కథ.

బడ్డీ కథ విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో అజ్మల్ అమీర్ ప్లాన్స్ చెప్పడం ద్వారా కథ ఎలా సాగనుందో అనే విషయంలో దర్శకుడు సామ్ హింట్ ఇచ్చాడు. దాంతో ప్రేక్షకుడు ఏం చూడబోతున్నామనే పాయింట్‌ను మైండ్‌లో సెట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక విమానాల సర్వీసులు ఎలా పనిచేస్తాయనే కాన్సెప్ట్‌ సాధారణ ప్రేక్షకులకు క్యూరియాసిటీగా కలిగించే అంశంగా కనిపించింది. అయితే కథను సాగదీయకుండా వెంటనే పల్లవిని కబీర్ కిడ్నాప్ చేసి నేరుగా స్టోరీలోకి వెళ్లిపోవడం పాజిటివ్ అంశం. ఇక టెడ్డీ బేర్ ద్వారా కామెడీని పండిస్తూ సినిమాను ఇంట్రెస్టింగ్‌గా నేరేట్ చేయడంతో వినోదాత్మకంగా సాగుతుంది.

సెకండాఫ్ మొత్తం యాక్షన్, కామెడీని నింపేసి చకచకా పని కానిచ్చేశాడు. కొన్ని సన్నివేశాల్లో లాజిక్కులను పట్టించుకోకుండా ఉంటే ఎంజాయ్ చేయొచ్చు అనేలా ఉన్నాయి. టెడ్డీ బేర్ ద్వారా ప్రభాస్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల డైలాగ్స్ చెప్పించి కొంత కథనంలో ఎనర్జీని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమా మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో సాగే రివేంజ్ డ్రామాగా ముగుస్తుంది.

Buddy Movie Review in Telugu  Allu Sirish stylish fun drama

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అల్లు శిరీష్ డిగ్నిఫైడ్ పైలెట్ మాత్రమే కాకుండా కమర్షియల్ హంగులు ఉన్న ఆదిత్య పాత్రలో ఒదిగిపోయాడు. క్లాస్,మాస్ వేరియేషన్స్‌తో తన యాక్టింగ్‌ చూపించాడు. గత సినిమాల్లో కంటే ఈ మూవీలో పెర్ఫార్మెన్స్ పరంగా మెచ్యురిటీ కనిపించింది. గాయత్రి భరద్వాజ్ రోల్ గెస్ట్‌గా ఉండటంతో పెద్దగా యాక్టింగ్‌‌కు స్కోప్ లేకపోయింది. టెడ్డీ బేర్ ఈ కథలో కీలకంగా మారడమే కాకుండా మంచి వినోదాన్ని, ఎమోషన్స్ పండించింది. అజ్మల్ విలనిజం, ముఖేష్ రిషి, ఆలీ కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది.

టెక్నికల్ విషయాలకు వస్తే.. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫి, హిప్ హప్ తమీజా మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోయింది. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రతిష్టాత్మక బ్యానర్ పాటించే ఉన్నత నిర్మాణ విలువలు ఈ సినిమాలో కనిపించాయి.

మెడికల్ మాఫియా, లవ్, ఎమోషన్స్ ఆధారంగా ఏవియేషన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన చిత్రం బడ్డీ. ఫ్యామిలీ ఆడియెన్స్, కిడ్స్‌‌ను ఆకట్టుకొనే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఫన్, కామెడీ అంశాలకు పెద్ద పీట వేశారు. యాక్షన్ లవర్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని మాస్ ఫైట్స్ కంపోజ్ చేశారు. వారాంతంలో చూడదగిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X