Buddy X Review: బడ్డీ ట్విట్టర్ రివ్యూ.. అల్లు శిరీష్ కామెడీ, యాక్షన్ అదుర్స్!

తెలుగు సినిమా రంగంలో యువ హీరో అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం బడ్డీ. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న బడ్డీ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఇప్పటికే పలు పట్టణాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించిన ఈ సినిమాపై నెటిజన్ల అభిప్రాయం ఏమిటంటే?

బడ్డీ సినిమాకు థియేటర్‌లో ఆగస్టు 2వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా టికెట్ రేట్లు గణనీయంగా తగ్గించి సాదారణ ప్రేక్షకుడికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. సింగిల్ స్క్రీన్ 99 రూపాయలు, మల్టీప్లెక్స్ 125 రూపాయల టికెట్ రేట్స్ పెట్టారు. దాదాపు 200 మంది ఎగ్జిబిటర్స్ తో మాట్లాడి మా ప్రొడ్యూసర్ టికెట్ రేట్లు తగ్గించడంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా చొరవ చూపారు.

Buddy X Review  Netizens review on Allu Sirish Movie in Twitter

ఇటీవల వైజాగ్‌లో ప్రదర్శించిన ప్రీమియర్లకు భారీ స్పందన లభించింది. ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. జై బాలయ్య అంటూ వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

హీరో ఆర్య నటించిన టెడ్డీ సినిమా చూడని వాళ్లకు ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. నేను ఆ సినిమా చూడలేదు. కానీ తెలుగు టెడ్డీ చూశాను. చాలా బాగుంది. సెకండాఫ్‌లో తెలుగు నేటివిటికి తగినట్టు కమర్షియల్ బ్లాక్స్ రాసుకొన్నారు. అవి చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. కిడ్స్ పక్కా ఎంజాయ్ చేస్తారు. హిప్ హాప్ మ్యూజిక్ బాగుంది. శిరీష్‌కు మరో డిఫరెంట్ మూవీ అని నెటిజన్ కామెంట్ చేశారు.

Buddy X Review  Netizens review on Allu Sirish Movie in Twitter

బడ్డీ విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా టికెట్స్ వెంటనే బుక్ చేసుకొని మీ దగ్గర్లో ఉన్న థియేటర్‌లో చూడండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సినిమా రిలీజ్‌కు ముందు ఏఎంబీలో బడ్డీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. టెడ్డీ చిత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కామెడీ సినిమా. డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమాను థియేటర్లో ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా రీమేక్ సినిమా కాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X