twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేక్షకుల బడ్జెట్‌ ఖాళీ

    By Staff
    |

    Budget Padmanabham
    -జలపతి గూడెల్లి
    చిత్రం: బడ్జెట్‌ పద్మనాభం
    నటీనటులు: జగపతిబాబు, రమ్యకృష్ణ, విద్య, రవితేజ, ఎల్బీశ్రీరాం
    నిర్మాత: బాబ్జీ
    స్క్రీన్‌ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.

    సెంటిమెంట్‌ సీన్స్‌ కు, కామెడీ కలిపి తీయడం ఎస్వీకృష్ణారెడ్డి స్టైల్‌. దాన్నించి ఆయన బయటపడడమనేది రేర్‌. తాజా చిత్రం బడ్జెట్‌ పద్మనాభం కూడా అదే రీతిన సాగింది. కాకపోతే ఇందులో సెంటిమెంటల్‌ సీన్స్‌ అధికం, కామెడీ తక్కువ. కథలో కొత్తదనం ఉన్నా కథనం మాత్రం పాతదే. ఓవరాల్‌ గా ఫర్వాలేదనిపించే చిత్రం.

    బడ్జెట్‌ పద్మనాభం(జగపతి బాబు) ఒక ఉద్యోగి. పెళ్ళి అంటే ఖర్చు కాబట్టి పెళ్ళి చేసుకోడు. ఏదీ చేయాలన్నా రెండు, మూడు సార్లు ఆలోచిస్తాడు. రమ్యకృష్ణకు పద్మనాభం అంటే ఇష్టం. ఇద్దరం కలిస్తే ఇద్దరి సంపాదన తోడు అవుతుంది కదాని రమ్య సలహా పాటించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. కానీ పెళ్ళి అయిన నెలకే రమ్యకృష్ణ గర్భవతి అవుతుంది. ముగ్గురు పిల్లలు(ట్రిపులెట్స్‌) పుడుతారు. ఇంకా ఖర్చు పెరుగుతుంది. బడ్జెట్‌ పద్మనాభం బడ్జెట్‌ ఖర్చుకు కూడా ఓ రీజన్‌ ఉంటుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ లో .....

    జగపతి బాబు చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అప్పు చేసి ఇల్లు కడుతాడు. కానీ ఇల్లు కట్టాక హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోతాడు. దాంతో అప్పు ఇచ్చిన తనికెళ్ళ భరణి వీళ్ళను ఇంట్లో నుంచి తరిమికొడతాడు. 20 ఏళ్ళలో అప్పు తీర్చితే ఇల్లు మళ్ళీ జగపతిబాబుకు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇస్తుంది. ఎలాగైనా ఆ ఇల్లు సొంతం చేసుకునేందుకే డబ్బు పొదుపు చేస్తుంటాడు. చివరికి ఇల్లు వశం చేసుకుంటాడా లేదా అన్నదే క్లైమాక్స్‌. మధ్యలో రవితేజ, ఎల్బీశ్రీరాంల కామెడీ ట్రాక్‌ తో పాటు విద్య లవ్‌ స్టోరీ ఉన్న కథకు పెద్దగా సంబంధం లేని అంశాలు.

    కథ, కథనం అతిసాధారణం. రవితేజ, ఎల్బీశ్రీరాంల కామెడీట్రాక్‌ ఒక్కటే బాగున్న అంశం. సెంటిమెంట్‌ తో ప్రేక్షకులను చావగొట్టడం షరామామూలే. ప్యూర్‌ డైరక్షన్‌. నటీనటుల నటన గురించి చెప్పేంత సీన్‌ లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X