twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bujji Ila Raa Review ఉత్కంఠను రేపే సైకలాజికల్ థ్రిల్లర్.. ధన్‌రాజ్, సునీల్ ఊహించని విధంగా!

    |

    Rating:
    2.5/5
    Star Cast: సునీల్, ధనరాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ
    Director: Garuda Vega Anji

    నటీనటులు: సునీల్, ధనరాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, పోసాని కృష్ణమురళీ, సత్యకృష్ణ, భూపాల్ తదితరులు
    సినిమాటోగ్రఫీ, దర్శకత్వం : గరుడవేగ అంజి
    నిర్మాతలు: అగ్రహారం నాగి రెడ్డి, ఎన్ సంజీవ రెడ్డి
    సమర్పణ: రూప జగదీష్
    రచన, స్క్రీన్ ప్లే: జీ నాగేశ్వర్ రెడ్డి
    మ్యూజిక్: సాయి కార్తీక్
    ఎడిటర్: చోటా కే ప్రసాద్
    ఫైట్స్: రియల్ సతీష్
    బ్యానర్: ఎస్ఎన్ఎస్ క్రియేషన్
    రిలీజ్: 2022-09-02

    Bujji Ila Raa movie reveiw
    వరంగల్‌లో పిల్లల వరుస కిడ్నాప్‌ల వ్యవహారం పోలీసులకు ఛాలెంజ్‌గా మారుతుంది. మట్వాడ పోలీస్ స్టేషన్‌లో సీఐ కేశవ నాయుడు (ధన్‌రాజ్)‌కు ఈ కిడ్నాప్‌ల వ్యవహారం సవాల్‌గా నిలుస్తుంది. కిడ్నాప్‌కు గురైన 12 మంది పిల్లల్లో ఇద్దరు చనిపోగా.. 9 మందిని కాపాడటంతోపాటు కిడ్నాపర్లకు సీఐ కేశవ్ చెక్ పెడుతాడు. అయితే మరో అమ్మాయి కోసం వెతికే క్రమంలో తన మామ (శ్రీకాంత్ అయ్యంగార్) ఈ కిడ్నాప్‌ వెనుక హస్తం ఉందని తెలుస్తుంది. తన మామను వెంటాడే సమయంలో ధన్‌రాజ్‌పై మహ్మద్ ఖయ్యూం (సునీల్) వ్యాన్‌తో గుద్ది దాడి చేస్తాడు.
    Bujji Ila Raa movie

    కిడ్నాప్‌కు గురై ఆచూకీ తెలియని అమ్మాయి ఏమైంది? కిడ్నాప్‌ వ్యవహారంలో సీఐ కేశవ్ మామకు ఏమైనా సంబంధం ఉందా? సీఐ కేశవ్‌పై మహ్మద్ ఖయ్యూం ఎందుకు దాడి చేశాడు? దాడి తర్వాత సీఐ కేశవ్‌కు తెలిసిన భయంకరమైన నిజాలు ఏమిటి? సీఐ కేశవ్ భార్య అను (చాందిని తమిళరాసన్) ఎమోషనల్ పాత్ర కథను ఎలా ముందుకు నడిపించింది? సీఐ కేశవ్‌ ఫ్యామిలీ గురించి మహ్మద్ ఖయ్యూంకు ఎలాంటి విషయాలు తెలిశాయి. చివరకు కిడ్నాప్‌కు గురైన అమ్మాయి పరిస్థితి ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే బుజ్జి ఇలా రా సినిమా కథ.

    బుజ్జి ఇలా రా సినిమా టైటిల్‌ చూస్తే పెద్దగా ఈ మూవీ చూడాలనే ఆసక్తి ఏ మాత్రం కలుగదు. కానీ బుజ్జి ఇలా రా సినిమా ఎమోషనల్ పాయింట్‌తోపాటు అద్బుతమైన స్క్రీన్ ప్లే.. కథలో ఊహించని మలుపులు ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేస్తాయి. తర్వాత సన్నివేశాల్లో ఏం జరుగుతుందనే విషయం అంతుపట్టకుండా ట్విస్టులతో కథ వేగంగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో ఊహించని విధంగా కథ ఉండటం, ధన్ రాజ్, భూపాల్ ఫెర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలు పెంచుతాయి. తన మామ శ్రీకాంత్ అయ్యంగార్‌పై సీఐ కేశవ్‌కు అనుమానం రావడం లాంటి మంచి ట్విస్టుతో సెకండాఫ్‌పై అంచనాలు పెంచడం జరుగుతుంది.

    Bujji Ila Raa movie

    ఇక సెకండాఫ్‌ అంచనాకు తగినట్టే కథలో అనేక ట్విస్టులు మరింత ఉత్కంఠకు గురిచేస్తాయి. ప్రీ క్లైమాక్స్ వరకు కథ అనుక్షణం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చివరి 15 నిమిషాల్లో హింస అతిగా చూపించడం కొంత సినిమాకు ప్రతికూలంగా మారినట్టు కనిపిస్తుంది. కానీ ఆ లోపాన్ని సినిమా ముగింపుతో జస్టిఫై చేసే ప్రయత్నం దర్శకుడు గురుడవేగ అంజి చేశారు.

    టాలీవుడ్‌లో చక్కటి అభురుచి ఉన్న దర్శకుడు జీ నాగేశ్వర్ రెడ్డి. ఆయన తన ఇమేజ్‌కు భిన్నంగా బుజ్జి ఇలా రా కథ రాయడమే కాకుండా, మంచి స్క్రీన్ ప్లేతో ఆకట్టుకొన్నాడు. జీ నాగేశ్వర్ రెడ్డి విజన్‌ను ఏమాత్రం తప్పుదారి పట్టించకుండా దర్శకుడు అంజి తన వంతు పనిని సానుకూలంగా పూర్తి చేశాడు. ప్రతీ సీన్‌లో టెంప్‌ను ఒక రేంజ్‌లో కొనసాగించడం సినిమాకు ప్లస్‌గా మారిందని చెప్పవచ్చు.

    ఇక నటీనటులు విషయానికి వస్తే.. ధన్ రాజ్‌కు కమెడియన్ అనే ముద్ర, ఇమేజ్ ఉంది. ఆ ముద్ర, ఇమేజ్‌ నుంచి బయటకు వచ్చి సీరియస్ పోలిస్ ఆఫీసర్‌గా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతనేంటిరా పోలీస్ ఆఫీసర్ అనే ఫీల్‌తో సినిమా చూసే ప్రేక్షకుడికి ధన్ రాజ్ చక్కటి పెర్ఫార్మెన్స్‌తో థ్రిల్ చేస్తాడు. ఊహించని పాత్రతో ధన్ రాజ్ తన పాత్ర పరంగా మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. ఇక సునీల్, చాందిని తమిళరాసన్, శ్రీకాంత్ అయ్యంగార్, భూపాల్ ఎవరికి వారు తమ పాత్రలతో పోటీ పడ్డారు. కథలో బలమైన పాత్రలను అల్లడంలో దర్శకులు అంజి, నాగేశ్వర్ రెడ్డి సఫలమయ్యారు. ముఖ్యంగా చాందిని తమిళరాసన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో కేక పెట్టిస్తుంది.

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. పలు సన్నివేశాలను మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మరో రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. అయితే నారప్ప, రామారావు ఆన్ డ్యూటీ లాంటి బీజీఎంను చక్కగా వాడుకొన్నాడు. అంజి దర్శకుడిగానే కాకుండా సినిమాటోగ్రఫితో సినిమాను చాలా ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సినిమాను చకచకా పరుగులు పెట్టించడంలో చోటా కే ప్రసాద్ తన ప్రతిభకు పదునుపెట్టాడని చెప్పవచ్చు. అగ్రహారం నాగి రెడ్డి, ఎన్ సంజీవ రెడ్డి, రూప జగదీష్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రలకు ఎంపిక చేసి నటీనటుల విధానం నిర్మాతల అభిరుచికి అద్దం పట్టింది.

    ఫైనల్‌గా.. ప్రేమ, యాక్షన్, క్రైమ్, ఎమోషనల్ అంశాలను మేలవించి రూపొందించిన సైకాలజికల్ థ్రిల్లర్ బుజ్జి ఇలా రా. ఎలాంటి అంచనాల లేకుండా వెళ్లిన ప్రేక్షకుడికి పైసా వసూల్ సినిమా. ఈ చిత్రంలో ఊహించని సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఉంటాయి. అయితే చివరి 15 నిమిషాలను హింసతో కాకుండా ఎమోషనల్‌గా డీల్ చేసి ఉంటే.. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ క్రైమ్, యాక్షన్ డ్రామా చిత్రంగా మారి ఉండేది. చివర్లో లాజిక్‌ లేకుండా మర్డర్లు జరగడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే.. క్రైమ్, యాక్షన్ చిత్రాలను ఆదరించే వారికి బుజ్జి ఇలా రా ఈ వారం కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

    English summary
    Bujji Ila Raa movie is released on September 02nd. Here is the movie exclusive review by Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X