twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బురిడీ కొట్టాడు : బుజ్జిగాడు రివ్యూ

    By Staff
    |

    Bujjigadu
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    నటీనటులు: ప్రభాస్,మోహన్ బాబు,త్రిష,సంజన,సుబ్బరాజు,అజయ్,
    కోట శ్రీనువాసరావు,ఆలీ,సునీల్,యమ్.యస్.నారాయణ,
    ఆహుతి ప్రసాద్,బ్రహ్మాజి,హేమ,సుధ తదితరులు
    యాక్షన్: విజయన్
    ఆర్ట్ :చిన్నా
    సినిమాటోగ్రఫి :శ్యామ్. కె.నాయుడు
    ఎడిటింగ్ :వర్మ
    సంగీతం: సందీప్ చౌతా
    నిర్మాత :కె.యస్.రామారావు
    కథ,స్ర్కీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: పూరీ జగన్నాథ్
    రిలీజ్ డేట్ :22-05-2008

    వరస హిట్స్ తో దూసుకుపోతున్న పూరీ 'వర్షం' పెయిర్ త్రిష, ప్రభాస్ కాంబినేషన్ లో రొటీన్ గా వండిన మరో మసాలా బుజ్జిగాడు. కాని ఈసారి దినుసులు (పాటలు, పైట్స్, డైలాగులు) ఫార్ములా ప్రకారం వేసినా వాటన్నిటిని కలిపే థ్రెడ్ అయిన కథ ని మరిచాడు. దాంతో కథనం ఎటు పోవాలో దారి తెలియని అయోమయ స్థితిలో పడి ప్రేక్షకులలో అసహనాన్ని మిగిలిస్తోంది. ఇక హీరోగా ప్రభాస్ తన దైన శైలిలో హీమ్యాన్ గా కనపడి గోదావరి జిల్లాల యాసతో కొంత తమిళం కలగలిపి మాట్లాడి నవ్వించినా ఫలితం లేకుండా పోయింది.

    రజనీకాంత్ వీర ప్యాన్ అయిన బుజ్జిగాడు (ప్రభాస్) పన్నెండేళ్ళు తరువాత తన గర్ల్ ఫ్రెండ్ చిట్టిని (త్రిష) వెతకటానికి చెన్నై వదిలిపెట్టి తన సొంత ఊరు బయిలుదేరతాడు. ఈ క్రమంలో అతని మజిల్ పవర్ చూసినవాళ్ళు అతనికి శివన్న (మోహన్ బాబు) అనే లోకల్ గూండాని చంపటానికి కోటి రూపాయల ఆఫర్ ఇస్తాడు. ఒప్పుకుని ఆ పనిలో ఉన్న అతనికి శివన్న మరెవరో కాదు చిట్టి అన్న అని తెలుస్తుంది. అప్పుడు బుజ్జిగాడేం చేసాడు అన్నది తెరపై చూడాల్సిందే.

    కథలో మెయిన్ డ్రాబ్యాక్ హీరోకి సినిమా మొత్తంలో సీరియస్ గా ఎదుర్కోవాల్సిన సమస్య ఎక్కడా తగలకపోవటమే. అందులోనూ సినిమా లవ్ స్టోరీనో, యాక్షన్ స్టోరీనో, లేక ప్రేమ కోసం యాక్షన్ లోకి దిగే కథో విభజన లేకుండా కన్ఫూజన్ గా సాగుతుంది. అంతే గాక హీరో పాత్రకి మేనరిజమ్స్ ,డార్లింగ్ అనే ఊతపదం పెట్టటంలో శ్రధ్ధ చూపారు గాని ఆ పాత్రకో సమస్య, అందులోంచి పుట్టే లక్ష్యం యేర్పాటు చేయలేదు. దాంతో ఆ పాత్ర నిమషానికోరకంగా బిహేవ్ చేస్తుంది. ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్ళే పాత్ర హఠాత్తుగా ప్రొపిషనల్ కిల్లర్ లా మారుతుంది. అలా అర్ధం లేని మరో డ్రామాకి దారి తీస్తుంది. గర్ల్ ప్రెండు ఎవరో తెలిసినా పలకరించకుండా పాసివ్ గా మిగిలి పోతుంది.

    ఇక దర్శకత్వ పరంగా పూరీ ఎందుకనో ఈ సినిమాలో తన మ్యాజిక్ ని చూపలేదు. అతని బలమైన ఆలీ కామిడీ అసలు పండలేదు. సునిల్ ఉన్నంతలో బెటర్. అలాగే మోహన్ బాబు వంటి టాలెంటు ఉన్న నటుడుని 'ఢీ' లో శ్రీహరి లాంటి డాన్ పాత్రంలో ఇరికించాలని చూసి వేస్ట్ చేసారు. అలాగే ఆయన 'సిల్లీ ఫెలో' అనే డైలాగు వజ్రోత్సవాలలో జరిగిన సంఘటన గుర్తున్న వారు మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతారు. మెయిన్ విలన్ గా చేసిన కోట ఎప్పటిలాగే ఉన్న కాసేపు ఆకట్టుకున్నాడు. హీరోయిన్లు త్రిష,సంజన గ్లామర్ డాల్స్ మాత్రమే. సందీప్ చౌతా పాటల్లో రెండు మాత్రమే బాగున్నాయి. ఎడిటింగ్ టైటిల్ సాంగ్ లో బాగా వర్కవుట్ అయింది. ప్రభాస్ కిచ్చిన డార్లింగ్ ఊతపదం మాత్రం చాలా బాగుంది. డైలాగులు పోకిరిని గుర్తు చేసేలా పంచ్ లతో బాగున్నాయి.

    యేదైమైనా ప్రభాస్ అభిమానులుకు నచ్చే ఈ సినిమా లో హింస, అశ్లీలత (కొన్ని చోట్ల) ఉండటంతో ఫ్యామిలీలకు పట్టడం కష్టమే. ఇక మామూలుగా టైం పాస్ కోసం ... డైలాగులు ఎంజాయ్ చేయాటానికి వెళ్ళచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X