Bun Butter Jam Movie Review: బన్ బటర్ జామ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: రాజు జయమోహన్, పావ్య, ఆదిత్య ప్రసాద్, భవ్య త్రిక, శరణ్య పొన్వన్నన్, దేవ దర్శిని, ఛార్లీ, మైఖేల్ తంగదురై తదితరులు
కథ, దర్శకత్వం: రాఘవ్ మిర్దాత్
నిర్మాత: సురేష్ సుబ్రమణ్యం
సినిమాటోగ్రఫి: బాబు కుమార్ ఐఈ
ఎడిటర్: జాన్ అబ్రహం
మ్యూజిక్: నివాస్ కే ప్రసన్న
బ్యానర్: రెయిన్ ఆఫ్ ఆరోస్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2025-08-22
ఇరుగు పొరుగున ఉండే లలిత (శరణ్య పొన్వన్నన్), ఉమా (దేవ దర్శిని) తమ పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత లవ్, అఫైర్లు, డేటింగ్ అంటూ చెడిపోకుండా ఉండటానికి ముందే తమ పిల్లలు చందు (రాజు జయమోహన్)కు మధుమిత (ఆద్యిత ప్రసాద్)ను ఒకరిని మరొకరికి పరిచయం చేసి ప్రేమలో పడేలా చేద్దామని ప్లాన్ చేస్తారు. ఇద్దరు తల్లులు ప్లాన్‌కు విరుద్దంగా అయితే మధుమితతో రాజు గొడవ పడుతుంటాడు. కాలేజీలో ఇన్స్‌టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ నందిని (భవ్య త్రిఖా)తో చందూ ప్రేమలో పడుతాడు. అయితే చందూ ప్రేమ వ్యవహారం నచ్చక ప్రాణ స్నేహితుడు తమ ఫ్రెండ్‌షిప్‌కు బ్రేకప్ చెబుతాడు. మధుమితకు మరో బాయ్‌ఫ్రెండ్ ఉంటాడు.
తమ పిల్లలు ప్రేమించుకొనేలా లలిత, ఉమ ఎందుకు ప్లాన్ చేశారు? లలిత, ఉమ ఉద్దేశం ఏమిటి? నందినితో చందు ప్రేమలో పడితే ఏం జరిగింది? చందూతో క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు విడిపోయాడు? నందినితో చందు రొమాంటిక్ లైఫ్ ఎలా కొనసాగింది? నందినితో చందు ప్రేమ విషయం ఇద్దరు తల్లులకు తెలిసిందా? మధుమితను చందు అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకొన్నాడా? లేదా నందినితో లవ్ మ్యారేజ్ చేసుకొన్నాడా? చివరకు ఇద్దరు తల్లుల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది ఈ సినిమా కథ.

బన్ బటర్ జామ్ సినిమా నేటి యూత్‌కు ప్రేమ, పెళ్లి, రిలేషన్స్ విషయంలో ఉండే ఆలోచనా విధానాన్ని పాయింట్‌గా చేసుకొని రాసుకొన్న ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ కూడిన కథ. పేరెంట్స్ అరెంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ గురించి ఎలా అలోచిస్తారనే పాయింట్ ఈ కథలో కొత్తగా అనిపిస్తుంది. పాయింట్ బాగానే ఉంది కానీ.. కథగా విస్తరించిన తీరే బాగాలేదు. సన్నివేశాలు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ ఉండాల్సిందనిపిస్తుంది. కామెడీ సీన్లు చూస్తే.. ప్రస్తుతం ఉండే స్పీడ్ లేకపోవడం వల్ల జనరేషన్ గ్యాప్ ఎక్కువగా ఉందనిపిస్తుంది. దాంతో ఫన్ పెద్దగా వర్కవుట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఫ్రెండ్‌షిప్, బ్రేకప్స్, రిలేషన్‌షిప్ అంశాల విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేదనిపిస్తుంది. దర్శకుడు రాఘవ్ మిర్దాజ్ ఈ చిత్రాన్ని ఒక వినోదాత్మక కామెడీ చిత్రంగా రూపొందించే విషయంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
రాజు జయమోహన్ ఫెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, శివకార్తికేయన్ నటించిన డాన్ సినిమాలో నెగెటివ్ రోల్‌లో మెప్పించిన ఆయన హీరోగా కొత్త అవతారంలో కనిపించారు. బిగ్‌బాస్ విజేతగా తనకు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకొనే ప్రయత్నం చేశాడు. తన పాత్ర వరకు పూర్తిగా న్యాయం చేశాడు. పేలవమైన కంటెంట్ ఉన్నప్పటికీ.. యాక్టింగ్ పరంగా మంచి మార్కులే సంపాదించుకొన్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో అతని కామెడీ సెన్స్ ఎంతగానో పేలింది. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా అతని కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు థియేటర్లలో నవ్వుకున్నారు. రాజు సినిమా చూసి సరదాగా నవ్వుకోవాలని అనుకునే వారిని ఆయన ఎక్కడా నిరాశపరచలేదు.
పావ్య, ఆథియా తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించేలా నటించారు. శరణ్య పొన్వణ్ణన్, దేవదర్శిని కాంబినేషన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. శివకార్తికేయన్‌ను అనుకరిస్తూ జయ టీవీ పప్పు చేసే విన్యాసాలు, విక్రాంత్ సెల్వ పాత్రలో నటించిన విధానం అన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే... నివాస్ కే ప్రసన్న అందించిన నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ బాబు కుమార్ యువతను ఆకట్టుకునే రంగులను తెరపై చూపించారు. రెయిన్ ఆఫ్ ఆరోస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ సుబ్రమణ్యం అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రలకు తగినట్టుగా నటీనటుల ఎంపిక ఈ సినిమా బలంగా మారింది. కథ, కథనాలపై నిర్మాత ఇంకా కొంత వర్కవుట్ చేసి ఉంటే ఈ మధ్యకాలంలో తమిళ ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాల సరసన బన్ బటర్ జామ్ సినిమా చేరి ఉండేది.
ఫైనల్‌గా ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తే.. స్టోరి పాయింట్ బాగుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎమోషన్స్‌ను టచ్ చేసే సబ్జెక్ట్ ఉంది. కానీ సినిమాలో స్క్రిప్టు పరంగా లోపాలు ఉన్నాయి. నేటితరం ఆడియెన్స్‌ను మెప్పించే ఫన్ ఎలిమెంట్స్ వర్కవుట్ కాలేదనిపిస్తుంది. కానీ, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే కంటెంట్ ఉండటం కొంత రిలీఫ్. కామెడీ బేస్ట్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి ఈ సినిమాలో నచ్చే కొన్ని అంశాలు ఉన్నాయి. లాజిక్‌లు పట్టించుకోకుండా స్నేహితులతో కలిసి సరదాగా చూడాలనుకుంటే ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











