twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vijayanand Review: బిజినెస్ మ్యాన్ బయోపిక్ గా 'విజయానంద్'.. ఆకట్టుకుందా అంటే?

    |

    Rating:
    2.5/5

    టైటిల్: విజయానంద్ (కన్నడ డబ్బింగ్)

    నటీనటులు: నిహాల్, రవిచంద్రన్, అనంత్ నాగ్, భరత్ బోపన్న, సిరి ప్రహ్లాద్, అనీష్ కురువిల్ల తదితరులు
    సినిమాటోగ్రఫీ: కీర్తన్ పూజారి
    దర్శకత్వం: రిషిక శర్మ
    సంగీతం: గోపీ సుందర్
    నిర్మాతలు: ఆనంద్ సంకేశ్వర్ (వీఆర్ఎల్ ప్రొడక్షన్స్)
    విడుదల తేది: డిసెంబర్ 9, 2022

    ఇటీవల కాలంలో బయోపిక్ చిత్రాలు అనేకంగా వస్తున్నాయి. దాదాపుగా అన్ని భాషల్లో ఈ బయోపిక్స్ జోరు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన స్పోర్ట్స్ వ్యక్తులు, రాజకీయవేత్తలు, స్కామ్స్ చేసినవాళ్లు ఇలా కథ ఇంట్రెస్టింగ్ ఉంటే ఎవరి జీవితాన్నైనా బయోపిక్ గా తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు వెనుకాడట్లేదు. తెలుగులో రక్తచరిత్ర సినిమాతో బయోపిక్ లు మొదలు పెట్టిన డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల కొండా సినిమాను తెరకెక్కించారు. హిందీలో MS Dhoni సినిమా తర్వాత అనేకంగా బయోపిక్ మూవీస్ వచ్చాయి. ఇప్పుడు తాజాగా కర్ణాటకకు చెందిన వీఆర్ఎల్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు, బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ విజయ్ సంకేశ్వర్ బయోపిక్ ను "విజయానంద్" పేరుతో నిర్మించారు. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథ:

    కథ:


    విజయ్ సంకేశ్వర్ (నిహాల్) తన తండ్రితో (అనంత్ నాగ్) కలిసి కర్ణాటకలోని గడగ్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ను నడుపుతుంటాడు. ఒక్క ప్రింటింగ్ ప్రెస్ తోనే ఆగిపోకూడదని అందరికి ఇష్టం లేకునన్నా ట్రావెల్స్ బిజినెస్ ప్లాన్ చేస్తాడు విజయ్ సంకేశ్వర్. సొంతంగా ఒక లారీ కొనుక్కొని తన బిజినెస్ ప్రారంభిస్తాడు. అలా ఒకే ఒక్క లారీతో మొదలైన విజయ్ సంకేశ్వర్ వ్యాపారం పెద్ద లాజిస్టిక్ కంపెనీ అయిన విజయానంద్ రోడ్ లైన్స్ ను ఎలా స్థాపించాడు? దాన్ని ఎలా నిర్వహించాడు? అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు? అతను పడిన అవమానాలు ఎంటి? చివరిగా ఏం సాధించాడు? ఏం కోల్పోయాడు? వంటి అనేక ఇంట్రెస్టింగ్ అంశాలే కథే ఈ విజయానంద్.

    విశ్లేషణ:

    విశ్లేషణ:


    సాధరణంగానే బయోపిక్ సినిమాలు అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ మ్యాన్ విజయ్ సంకేశ్వర్ బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు నిర్మించారు. ఇక ఈ సినిమా భావోద్వేగాలు, స్ఫూర్తినింపే అంశాలతో బాగానే ఆకట్టుకుంది. విజయ్ సంకేశ్వర్ జీవితంలో జరిగిన పలు సంఘటనలు చాలా ఎమోషనల్ గా చూపించారు. ఒక మాములు మధ్య తరగతి స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎలా చేరుకున్నాడనే యాంగిల్ లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఇది 70, 80 సంవత్సరం కాలంలో జరిగిన కథ కాబట్టి అందుకు తగినట్లుగా, అప్పటి పరిస్థితులను చూపించడంలో దర్శకురాలు విజయం సాధించారనే చెప్పవచ్చు. రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపించిన విధానం, విజయ్ సంకేశ్వర్ జీవిత ప్రయాణానికి సంబంధించిన సన్నివేశాలు, పాత్రలను ఎలివేట్ చేయడం ఆకట్టుకుంటాయి.

    ఎవరెలా చేశారంటే..

    ఎవరెలా చేశారంటే..


    విజయ్ సంకేశ్వర్ పాత్రలో కనిపించిన నిహాల్ చక్కని నటన కనబర్చారు. తన హావాభావాలతో నటన పరంగా మంచి మార్కులు కొట్టేశారు. ఇక తదితర పాత్రలు చేసిన అనంత్ నాగ్, భరతో బోపన్న, రవిచంద్రన్, ప్రకాష్ బేలావాడి, సిరి ప్రహ్లాద్ తదితరులు పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు. అలనాటి దర్శకులు జీవి అయ్యర్ ముని మనువరాలు రిషికా శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బయోపిక్ అయినా దానికి కొన్ని క్రియేటివ్ అంశాలు జోడించి తెరకెక్కిస్తారు. రిషికా శర్మ కూడా అలాగే చేశారు. అయితే కొన్నిచోట్ల అంతగా వర్కౌట్ కాలేదనిపించింది. కొంచెం స్లోగా సాగడంతో డ్యాక్యుమెంటరీలా అనిపిస్తుంది. కానీ సినిమాలో చెప్పిన మెసేజ్ బాగుంది. పాటలు, సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో ఎంతో బ్యూటిఫుల్ గా మలిచారు.

    English summary
    Karnataka Business Tycoon Vijay Sankeshwar Biopic Vijayanand Kannada Movie Review And Rating In Telugu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X