Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్‌లు ఏమిటంటే?

Rating: 2.75/5

నటీనటులు: అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్యస్వామి తదితరులు
దర్శకత్వం: శౌరీ చంద్రశేఖర్ టీ రమేష్
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
ఎడిటర్: నవీన్ నూలి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
రిలీజ్ డేట్: 2023-02-04

బుట్టబొమ్మ కథ ఏమిటంటే?

బుట్టబొమ్మ కథ ఏమిటంటే?

వైజాగ్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సత్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి. స్మార్ట్ ఫోన్‌తో రీల్స్ చేసి సెలబ్రిటీగా మారాలని కలలు కంటుంది. నార్మల్ ఫీచర్ ఫోన్‌ను ఉపయోగిస్తూ.. ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఓ రోజు తప్పుదారిని ఒకరికి ఫోన్ చేయబోయి.. నంబర్ టైప్ చేయడంలో పొరపడి మురళీ (సూర్య వశిష్ట) అనే ఆటో డ్రైవర్‌కు కాల్ చేస్తుంది. సత్య గొంతు విన్న మురళీ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. వారి మధ్య ఫోన్ పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో ఇంటిలో తమ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి సంబంధం ఖాయం చేయాలని అనుకొంటుండగా.. మురళీని కలిసేందుకు వైజాగ్ వెళ్తుంది. వైజాగ్ బస్టాండ్‌లో సత్యను రామకృష్ణ అలియాస్ ఆర్కే అనే యువకుడు వెంటాడుతుంటాడు.

బుట్టబొమ్మలో ట్విస్టులు

బుట్టబొమ్మలో ట్విస్టులు


వైజాగ్‌లో సత్యను రామకృష్ణ ఎందుకు వెంటాడాడు? సత్యను కలిసిన మురళీపై రామకృష్ణ ఎందుకు దాడి చేస్తాడు? మురళీని కలిసిన సత్యకు ఎలాంటి అనుభవం ఎదురైంది? వెంటాడుతున్న రామకృష్ణను సత్య, మురళీ ఏం చేశారు? మురళీతో సత్య ప్రేమ ఎంత వరకు వెళ్లింది? వైజాగ్‌కు వెళ్లిన తర్వాత సత్య ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నదనే ప్రశ్నలకు సమాధానమే బుట్టబొమ్మ సినిమా కథ.

దర్శకుడి హానెస్ట్ అటెంప్ట్

దర్శకుడి హానెస్ట్ అటెంప్ట్

బుట్టబొమ్మ సినిమా విషయానికి వస్తే..మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకొన్న కపేలా సినిమాకు బుట్టబొమ్మ సినిమా రీమేక్. అయితే మలయాళం వెర్షన్‌ను మక్కికి మక్కీ కాపీ చేయకుండా తెలుగు నేటివిటి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ టీ రమేష్ చాలా హానెస్ట్‌గా సినిమాకు మార్పులు చేయడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కపేలా సినిమా చూసిన వారికి కూడా కొత్తగా అనిపించేలా దర్శకుడు స్క్రిప్టు పరంగా మార్పులు చేశారు. ఒరిజినల్‌ సినిమాలో మాదిరిగా కాకుండా మురళీ క్యారెక్టర్, అలాగే రామకృష్ణ క్యారెక్టర్‌ను ఇంప్రూవైజ్ చేసిన విధానం బాగుంది. రామకృష్ణ లవర్ (నవ్యస్వామి) క్యారెక్టర్‌ను యాడ్ చేయడం మరింత ఫీల్‌గుడ్‌గా మార్చేసింది.

ఫస్టాఫ్ స్లోగా, రొటీన్‌గా.. సెకండాఫ్ అలా..

ఫస్టాఫ్ స్లోగా, రొటీన్‌గా.. సెకండాఫ్ అలా..

బుట్టబొమ్మ విషయానికి వస్తే.. కథా స్వభావం బట్టి.. క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ బట్టి.. తొలి భాగం సినిమా చాలా స్లోగా, రొటీన్‌గా, రెగ్యులర్‌గా సాగినట్టు అనిపిస్తుంది. సత్య క్యారెక్టర్ వైజాగ్ చేరిన తర్వాత కథలో జోష్‌తోపాటు వేగం కూడా పెరుగుతుంది. సెకండాఫ్ ఇంత త్వరగా ముగిసిందనే విధంగా ఉంటుంది. అలాగే మురళీ, రామకృష్ణ క్యారెక్టర్లకు సంబంధించిన ట్విస్టు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. రామకృష్ణ క్యారెక్టర్‌ను దర్శకుడు డ్రైవ్ చేసిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. సెకండాఫ్‌ ఎమోషనల్ డ్రైవ్‌గా సాగడంతో బుట్టబొమ్మ మనసును గెలుచుకొనేలా ఉంటుంది.

అనిక, అర్జున్ దాస్, సూర్య గురించి

అనిక, అర్జున్ దాస్, సూర్య గురించి

నటీనటులు విషయానికి వస్తే.. సత్యగా అనిక సురేంద్రన్ అమాయకమైన యువతిగా తన పాత్రలో ఒదిగిపోయింది. ఆ పాత్రపై సానుభూతి కలిగేలా తన నటనతో ఇంపాక్ట్ చూపించింది. ఇక సత్య ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి తొలి భాగంలో కథను ముందుకు తీసుకుపోయేలా తన వంతు సహకారం అందించింది. ఇక మురళీగా సూర్య వశిష్ట ఫస్టాఫ్‌లో ఒకే అనిపించేలా ఉంటాడు. సెకండాఫ్‌కు వచ్చే సరికి తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటాడు. అలాగే రామకృష్ణగా నటించిన అర్జున్ దాస్ లేటుగా ఎంట్రీ ఇచ్చినా ఫుల్ మార్కులు కొట్టేశారనే చెప్పాలి. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, సస్పీసియస్‌ క్యారెక్టర్‌తో మెప్పించాడు. నవ్య స్వామి పాత్ర పరిధి తక్కువైనా.. టెలివిజన్ రంగంలో అనుభవంతో బాగా నటించింది. ఈ సినిమాకు నవ్యస్వామి బోనస్‌ ఫ్యాక్టర్‌గా అనిపిస్తుంది.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. వైజాగ్ అందాలను, అలాగే గ్రామీణ, అడవి వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్‌ వంశీ పచ్చిపులుసు కెమెరాలో బంధించిన తీరు బాగుంది. ప్రతీ ఫ్రేమ్ పచ్చగా కళకళలాడింది. గోపి సుందర్ అందించిన పాటలు బాగా లేకపోయినా.. సెకండాఫ్‌లో బీజీఎం సినిమాకు ప్లస్‌గా మారింది. నవీన్ నూలి ఎడిటర్‌గా సినిమాలో ఎక్కువ ల్యాగ్ లేకుండా తన వంతు సహకారాన్నిఅందించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా బుట్టబొమ్మ గురించి

ఫైనల్‌గా బుట్టబొమ్మ గురించి


బుట్టబొమ్మ సినిమా తెలుగుదనం ఉట్టిపడే భావోద్వైగమైన చిత్రం. ఈ చిత్రంలోని పాత్రలు ఊర్లో మన ఇంటి ఇరుగు పొరుగువారు పలకరించినట్టు ఉంటాయి. ఒరిజినల్ కథలో ఉండే పరిమితులను దాటి బుట్టబొమ్మ బెటర్‌గా ఉంటుందనిపిస్తుంది. తెలుగు సినిమాకు కొత్తవారైనా నటీనటులు అందరూ బెటర్‌గా ఫెర్ఫార్మ్ చేశారు. ఫ్యామిలీ అంత ఆహ్లాదకరంగా చూసే విధంగా బుట్టబొమ్మ ఉంటుంది. థియేటర్‌లో మంచి తెలుగుదనం ఉట్టిపడే సినిమా చూడాలనిపిస్తే. బుట్టబొమ్మను ఎంచక్కా చూసేయొచ్చు. అతిగా ఊహించుకోకుండా మంచి అనుభూతిని పొందుదామని ఉద్వేశంతో వెళ్తే బుట్టబొమ్మ నిరాశపరచదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X