For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  C/o కంచరపాలెం రివ్యూ అండ్ రేటింగ్

  By Rajababu
  |
  C/o Kancharapalem Movie Review C/o కంచరపాలెం మూవీ రివ్యూ

  Rating:
  3.0/5
  Star Cast: సుబ్బారావు, రాధ బెస్సీ, మోహన్‌ భగత్‌, ప్రణీత పట్నాయక్‌, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్‌ రత్నం, విజయ ప్రవీణ,
  Director: వెంకటేష్ మహాశైలి

  టాలీవుడ్‌లో ఓ ఏడాదిలో 100కు పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్నే సినిమాలే ప్రేక్షకుల హృదయాన్ని బలంగా తాకుతాయి. కమర్షియల్‌గా బాక్సాఫీస్‌ను కుదిపేస్తుంటాయి. కమర్షియల్ విలువలను పక్కన పెట్టేస్తే.. అలాంటి కోవలో వచ్చిన చిత్రం C/o కంచరపాలెం. రిలీజ్‌కు ఈ చిత్రం ఆడియెన్స్ మదిలో చక్కటి అనుభూతి నింపే సినిమా అనే టాక్‌ను సంపాదించుకొన్నది. ప్రముఖులు, సినీ విమర్శకులు సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి ఊదరగొట్టేస్తున్నారు. సహజత్వానికి చాలా దగ్గరగా, భావోద్వేగాలు మేలివించిన ఈ చిత్రం అందరి ప్రశంసలు ఎందుకు అందుకొంటుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా కథ, దర్శక, నటీనటుల ప్రతిభను సమీక్షించాల్సిందే.

  C/o కంచరపాలెం కథ

  కంచర్లపాలెంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ రాజు (సుబ్బారావు) 50 ఏళ్లు దగ్గరపడినా పెళ్లికాని బ్రహ్మాచారి. అదే కార్యాలయానికి అధికారిగా ట్రాన్స్‌ఫర్‌గా రాధ (రాధ జెస్సీ) వస్తుంది. అప్పటికే భర్త చనిపోయి 20 ఏళ్ల కూతురు ఆమెకు ఉంటుంది. రోజులు గడిచిన కొద్ది రాజు, రాధ లేటు వయసులో ఆకర్షణకు లోనవుతారు. ఒకరంటే ఒకరికి గౌరవం, ఇష్టం పెరుగుతుంది. అలా వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొంటారు.

  కంచర్లపాలెంలో సమస్యలు

  లేటు వయసులో రాజు, రాధ పెళ్లికి కలిగిన అడ్డంకులు ఏమిటి? వారిద్దరు వివాహం చేసుకొని ఒక్కటయ్యారా? తల్లి ప్రేమకు కూతురు అంగీకారం తెలిపిందా? రాజు పెళ్లిపై కంచర్లపాలెం గ్రామస్థుల రియాక్షన్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం C/o కంచరపాలెం కథ.

  సినిమా గొప్పతనమేమింటంటే

  కథంటీ ఇంతా సింపులగా ఉంది. సినిమా గురించి గొప్పగా చెబుతున్నారనే వారికి చెప్పేదేమిటంటే.. ఈ సినిమాలో కథా గమనంలో నాలుగు రకాల ప్రేమ కథలు సాగుతుంటాయి. బాల్యం, యవ్వనం, మధ్య వయసు, లేటు వయసులో జరిగిన ప్రేమ కథలను దర్శకుడు వెంకటేష్ మహా ప్రేక్షకుడికి ముద్ద ముద్దగా కలిపి పెట్టిన తీరు ఈ చిత్రానికి గొప్ప సంపద అని చెప్పవచ్చు.

  మరోస్థాయికి తీసుకెళ్లిన నటీనటులు

  జోసెఫ్ (కార్తీక్ రత్నం), భార్గవి (ప్రణీతా పట్నాయక్)- గెడ్డం (మోహన్ భగత్), సలీమా(విజయ ప్రవీణ)-సుందరం (కేశవ కర్రి), సునీత (నిత్య శ్రీ), రాజు, రాధ (సుబ్బరావు, రాధ జెస్సీ) ప్రేమ కథలు ఫీల్‌గుడ్‌గా సాగుతూ సినిమాను ప్రతీ నిమిషం మరో మెట్టును ఎక్కించే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ ప్రయత్నమే ఈ సినిమాను ప్రతీ ఒక్కరు గుండెల్లో దాచుకోవడానికి కారణమైందని చెప్పవచ్చు.

  ఫస్టాఫ్‌లో

  C/o కంచరపాలెం సినిమాకు ప్రధానమైన బలం స్క్రీన్‌ప్లే, నేటివిటి. గ్రామంలో ఉండే వైరుధ్యాలు, కుల, మత వైషమ్యాలు అంతర్లీనంగా కనిపిస్తూ కథ నదిపై నావగా తొణుకు బెణుకు లేకుండా సాగిపోతుంది. పాత్రలు తెర మీద కదలాడకుండా ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. ఏదో ఒక్క కారణంతో కనెక్ట్ అవుతుంటాయి. అలాంటి అంశాలతో చక్కటి భావనతో ఇంటర్వెల్ పడుతుంది.

  రెండో భాగంలో

  ఇక రెండో భాగంలో రాజు, రాధ ఆకర్షణ, ప్రేమ మాత్రమే కీలకంగా మారుతుంది. రెగ్యులర్ ప్యాటర్న్‌కు భిన్నంగా సాగే ఈ ప్రేమ కథను దర్శకుడు ఎలా ముగిస్తాడో అనే ఆసక్తి ప్రేక్షకులను కదిలిస్తూ ఉంటుంది. చివర్లో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ఓ మ్యాజిక్ సినిమాను ఆకాశానికి ఎత్తేసేలా ఉంటుంది. వినాయకుడి విగ్రహం తయారీ ఎపిసోడ్, ఊరిలో రాజకీయాలు, తాగుబోతుల హంగామా లాంటి ఎపిసోడ్స్ చాలా సహజత్వంగా ఉంటాయి.

  దర్శకుడు వెంకటేష్ విజన్

  C/o కంచరపాలెం చిత్రానికి కర్త, కర్మ, క్రియ దర్శకుడు వెంకటేష్ మహా మాత్రమే. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకు చెందాల్సిందే. వందలు, వేల కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటూ ప్రచారంలో మునిగితేలే దర్శకులకు కనివిప్పు కలిగించేలా వెంకటేష్ తన ప్రతిభను చాటుకొన్నారు. కథ, కథనాలు, సాంకేతిక అంశాలను చక్కగా మేలివించి తెలుగు సినీ ప్రపంచాన్నంతా తనవైపు చూసేలా చేసుకొన్నాడు. ప్రతీ సన్నివేశాన్ని బలంగా రాసుకొని తన టాలెంట్‌ను చాటుకొన్నాడు. సుమారు 60 మందికి పైగా కొత్తవాళ్లతో సినిమా చేసి శభాష్ అనిపించుకొన్నారు.

  ఊరు, పేరు లేని నటులు

  జోసెఫ్ పాత్రలో కార్తీక్ రత్నం, భార్గవిగా ప్రణీతా పట్నాయక్, గెడ్డంగా మోహన్ భగత్, సలీమాగా ప్రవీణ పరుచూరి, సుందరంగా కేశవ కర్రి, సునీతగా నిత్య శ్రీ, రాజు పాత్రలో సుబ్బరావు, రాధగా రాధ జెస్సీ నటించారు. వీరి పేర్లను కనీసం ఏ ప్రేక్షకుడు కూడా విని ఉండడు. అలాంటి వీరు తమ ప్రతిభతో ప్రేక్షకుడ్ని కట్టిపడేస్తారు.

  సినీ తెరపై కంచర్లపాలెం కథను

  C/o కంచరపాలెం చిత్రానికి రెండో ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. ీ చిత్రానికి ఆదిత్య జువ్వాడి, వరుణ్ చాపేకర్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపడంలో వీరు సఫలీకృతులయ్యారు. ముసలివాళ్ల ముచ్చట్లు, గ్రామంలో ఉండే కుల, మతాల సంఘర్షణ, పిల్లాడు సైకిల్ తొక్కే సీన్లు, తాగుబోతుల హంగామా లాంటి సీన్లను చక్కగా ఒడిసిపట్టుకొన్నారు.

  రొటీన్‌కు భిన్నంగా మ్యూజిక్

  C/o కంచరపాలెం చిత్రానికి మరో ప్లస్ పాయింట్ సంగీతం. గ్రామీణ నేపథ్యానికి చక్కగా అమరే విధంగా స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. పట్టి పట్టి నన్నే సూత్తాంటే, ఏమి జన్మమూ... ఏమి జీవమూ' హరికథ పాట రొటీన్‌కు భిన్నంగా సాగుతాయి.

  ఎడిటింగ్, సౌండ్ డిజైన్

  కంచర్లపాలెం చిత్రానికి ఎడిటింగ్, సౌండ్ డిజైన్ మరో అదనపు ఆకర్షణ. ఎడిటర్‌గా రవితేజ గురిజాల, సౌండ్ ఎడిటర్‌గా నాగార్జున తాళ్లపల్లి అద్భుతమైన పనితీరును కనబరిచారు.

  నిర్మాణ విలువలు

  C/o కంచరపాలెం సినిమాను నిర్మించే బాధ్యతను ఎత్తుకొన్న నిర్మాత ప్రవీణా పరుచూరిని అభినందించకపోతే ఈ సినిమాకు అర్థం ఉండదు. కథలోని బలాన్ని అంచనా వేసి ఓ విజన్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చిన తీరు అద్బుతం. నిర్మాణ బాధ్యతలనే కాకుండా చిత్రంలో వేశ్యగా అద్భుతమైన పాత్రను చేసి కూడా మెప్పించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథలోని దమ్ము చూసి రానా దగ్గుబాటి నిర్మాతగా మారడంతో సినిమా హైప్‌ను తెచ్చిపెట్టింది.

  ఫైనల్‌గా

  గ్రామీణ వాతావరణంలో అద్భుతంగా రూపొందిన సహజ చిత్రం C/o కంచరపాలెం. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రతీ పాత్ర, సన్నివేశం ప్రేక్షకుడిని వెంటాడే సినిమా ఇది. కమర్షియల్‌గా ఈ సినిమా ఎంత సక్సెస్ ఏ రేంజ్ అనేది ఓవర్సీస్, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ బట్టే తేలుతుంది.

  బలం, బలహీనత

  ప్లస్ పాయింట్స్
  డైరెక్టర్ వెంకటేష్ మహా
  నటీనటులు ప్రతిభ
  కెమెరా
  ఎడిటింగ్
  సౌండ్ డిజైనింగ్
  మ్యూజిక్

  మైనస్ పాయింట్స్
  బీ, సీ సెంటర్లకు నచ్చే
  కమర్షియల్ విలువలు లేకపోవడం

  తెర ముందు, తెర వెనుక

  సుబ్బారావు, రాధ బెస్సీ, ప్రవీణా పరుచూరి, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్‌ రత్నం, మోహన్‌ భగత్‌, ప్రణీత పట్నాయక్‌
  కథ, రచన, దర్శకత్వం: వెంకటేష్ మహా
  నిర్మాత: ప్రవీణా పరుచూరి, రానా దగ్గుబాటి
  సంగీతం: స్వీకర్ అగస్తి
  సినిమాటోగ్రఫి: ఆదిత్య జవ్వాడి, వరుణ్‌ ఛాపేకర్
  ఎడిటింగ్: రవితేజ గిరిజాల
  సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి
  రిలీజ్: 2018-09-07

  English summary
  C/o Kancharapalem movie is an unconventional love story set in the town and including the people of Kancherapalem. Director Maha Venkatesh's vision and Script, Technical brilliance are highlights of the movie. This movie released on 7th September. In this occassion, Telugu filmibeat brings exclusive review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more