twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    C/o సూర్య మూవీ రివ్యూ: రొటీన్ క్రైమ్ థ్రిల్లర్

    మహానగర, శమంతకమణి, నక్షత్రం చిత్రాలతో ఆకట్టుకొంటున్న యువ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం C/o సూర్య. తమిళ దర్శకుడు సుశీంద్రన్ రూపొందించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్‌గా మెహ్రీన్ పిర్జా

    By Rajababu
    |

    Rating:
    2.0/5
    Star Cast: సందీప్ కిషన్, మెహ్రీన్ పిర్జాదా, సత్య, ప్రవీణ్, నాగినీడు
    Director: సుశీంద్రన్

    మహానగర, శమంతకమణి, నక్షత్రం చిత్రాలతో ఆకట్టుకొంటున్న యువ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం C/o సూర్య. తమిళ దర్శకుడు సుశీంద్రన్ రూపొందించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్‌గా మెహ్రీన్ పిర్జాదీ నటించింది. సస్సెన్స్ థ్రిల్లర్‌ కథాంశంతో చక్రీ చిగురుపాటి నిర్మించిన C/o సూర్య నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    C/o సూర్య స్టోరీ..

    C/o సూర్య స్టోరీ..

    ఓ పోలీస్ ఆఫీసర్ (నాగినీడు) కొడుకైన సూర్య (సందీప్ కిషన్). ఎంబీఏ చదివి తన ప్రాణస్నేహితుడు మహేశ్‌తో కలిసి కేటరింగ్ బిజినెస్ చేస్తుంటాడు. సూర్య సోదరి అను, మహేశ్ ప్రేమించుకొంటారు. ఈ విషయాన్ని సూర్యకు వెల్లడించాలని మహేశ్ అనుకొంటే సమయం వచ్చినప్పుడు చెబుతామని అను ఆపుతుంది. ఈ క్రమంలో కాంట్రాక్టు కిల్లర్ సాంబశివుడు (హరీష్ ఉత్తమన్) మహేశ్‌ను చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ విషయంపై సూర్య ఆరా తీస్తే తన సోదరిని అనును మట్టుబెట్టడానికి సాంబశివుడు ప్రయత్నిస్తున్నాడనే విషయంతో సినిమా కొత్త మలుపు తిరుగుతుంది.

    Recommended Video

    C/o Surya Teaser : Funny కేరాఫ్ సూర్య టీజర్
    చిక్కుముడులకు జవాబు

    చిక్కుముడులకు జవాబు

    అసలు అనును సాంబశివుడు ఎందుకు చంపాలనుకొంటాడు. సాంబశివుడు ప్రయత్నాలను సూర్య ఏవిధంగా అడ్డుకొన్నాడు. ఆ క్రమంలో మహేశ్ పరిస్థితి ఏమిటీ? ఈ కథాంశంతో స్టోరి ఎలాంటి మలుపులు తిరిగింది అనే అంశాన్ని తెలుసుకోవాలంటే C/o సూర్య చూడాల్సిందే.

    ఫస్టాఫ్ నడించిందిలా

    ఫస్టాఫ్ నడించిందిలా

    వైద్య విద్య, వైద్య రంగంలో జరుగుతున్న లోపాలను పాయింట్‌గా చేసుకొని అల్లుకొన్న రెండు గంటల కథే C/o సూర్య. తొలి భాగంలో చాలా నెమ్మదిగా క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు సుశీంద్రన్ చాలా సమయం తీసుకొన్నాడు. కథలోకి వెళ్లడానికి ఆలస్యం చేయడంతో ప్రేక్షకులకు ఏం జరుగుతుందో, సినిమా లక్ష్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ వేయడంతో రెండో భాగంలో ఏం జరుగుతుందో అనే విషయం కంటే.. ఏం చూడాల్సి వస్తుందో అనే అంశాలే వెంటాడుతుంటాయి.

    సెకండాఫ్‌లో ఇలా..

    సెకండాఫ్‌లో ఇలా..

    సెకండాఫ్‌లోనైనా వెంటనే అసలు ముడి విప్పి కథ వేగం పెంచుతాడా అని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. ప్రీ క్లైమాక్స్‌లో మెడికల్ సీటు అనే ఓ చిన్న ముడిని విప్పడం ‘కొండంత రాగం తీసి..' అనే సామెత గుర్తుకొస్తుంది. విలన్ గ్యాంగ్ చెరలో ఉన్న తన స్నేహితుడు, కాబోయే బావను, చెల్లెలిని ఎలా కాపాడుకొన్నాడు అనే రొటీన్ పాయింట్‌తో శుభం కార్డు వేయడం సాదాసీదాగా జరిగిపోతుంది. సుశీంద్రన్, సందీప్ కిషన్ కాంబినేషన్‌లో ఓ వెరైటీ చిత్రం చూడాలనే ప్రేక్షకులు అసంతృప్తితోనే వెనుతిరుగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

    పట్టుబిగించని సుశీంద్రన్

    పట్టుబిగించని సుశీంద్రన్

    క్రైమ్ థ్రిల్లర్‌తో వచ్చిన దర్శకుడు సుశీంద్రన్ ప్రేక్షకుల అంచనాలకు దిగువనే ఉన్నట్టు కనిపించాడు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఉండాల్సిన సీరియస్ అంశాలు, స్క్రీన్ ప్లేను పేలవంగా రాసుకొన్నాడని అనిపిస్తుంది. బలమైన సన్నివేశాలు లేకపోవడం, సస్పెన్స్ కోసం పరిస్థితులను గందరగోళంగా మార్చడం సినిమాకు అడ్డుగా మారాయి.

    రొటీన్ పాత్రలో సందీప్ కిషన్

    రొటీన్ పాత్రలో సందీప్ కిషన్

    సందీప్ కిషన్ ఇలాంటి పాత్రలను గతంలో చాలా సినిమాల్లో కనిపించాడు. మహానగరం లాంటి చిత్రం తర్వాత C/o సూర్య వస్తుందంటే ప్రేక్షకులు అంచనాలు బాగానే ఉంటాయి. కెరీర్లో సందీప్‌కు సూర్య పాత్ర చాలా రొటీన్. ఈ సినిమా ద్వారా సందీప్ కిషన్‌కు ఒరిగేదేమీ ఉండదు.

    పాటలకే పరిమితమైన మెహ్రీన్

    పాటలకే పరిమితమైన మెహ్రీన్

    మెహ్రీన్ వరుసగా మూడు సక్సెస్‌లతో దూసుకెళ్తున్న సమయంలో విడుదలైన చిత్రం C/o సూర్య. మెహ్రీన్ అందంగా కనిపించినప్పటికీ గత చిత్రాల్లో మాదిరిగా యాక్టింగ్‌కు స్కోప్ లేదు. కేవలం పాటలకు మాత్రమే పరిమితమైంది.

    హరీశ్ ఉత్తమన్ విలనిజం

    హరీశ్ ఉత్తమన్ విలనిజం

    ఈ సినిమాలో ఈ పాత్రల తర్వాత బాగా గుర్తుండేది సాంబశివుడు పాత్ర. ఈ పాత్రను హరీశ్ ఉత్తమన్ తన మేరకు ఫర్వాలేదనిపించాడు. అంతేగానీ గొప్పగా చెప్పుకొనే విలనిజం కనిపించదు. మిగితా పాత్రల్లో కమెడియన్లు సత్య, ప్రవీణ్, సందీప్ కిషన్ తల్లి తులసి ఒకే అనిపించారు.

    టెక్నికల్ డిపార్ట్ మెంట్

    టెక్నికల్ డిపార్ట్ మెంట్

    C/o సూర్య చిత్రంలో నటీనటుల గురించి కాకుండా బాగా మెప్పించిన అంశాలు సినిమాటోగ్రఫి, ఎడిటింగ్. ఎమోషనల్ ఫీలింగ్స్‌ను అద్భుతంగా తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ లక్ష్మణ్ కుమార్ తన వంతు పాత్రను పోషించాడు. కాశీ విశ్వనాథన్ ఎడిటింగ్ సినిమాను నిలబెట్టింది. కానీ అక్కడక్కడ కొన్ని సీన్లపై కత్తెర వేయవచ్చు అనే అభిప్రాయం కలుగుతుంది.

    ఇమామ్ సంగీతం గుడ్

    ఇమామ్ సంగీతం గుడ్

    అనేక ట్విస్టులతో సాగే ఈ చిత్రానికి ఇమామ్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. కీలక సన్నివేశాల్లో ఇమామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొన్నది. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఆయన సంగీతం ఉంది. కానీ పాటలు ఈ చిత్రానికి మైనస్.

    ఫైనల్ జడ్జిమెంట్

    ఫైనల్ జడ్జిమెంట్

    C/o సూర్య చిత్రంలో ఎమోషన్స్ ఉన్నాయి. కుటుంబపరమైన భావోద్వేగాలు ఉన్నాయి. సస్పెన్స్ ఉంది. కానీ ఓవరాల్ ప్యాకేజీగా చూస్తే ఓ మంచి ప్రొడక్ట్ బయటకు వచ్చిందనే ఫీలింగ్ కలుగదు. కథ చెప్పే విషయంలో దర్శకుడు పడిన తడబాటు C/o సూర్యకు ప్రధానమైన మైనస్.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    సందీప్ కిషన్, ఇతర పాత్రలు
    సినిమాటోగ్రఫి
    ఎడిటింగ్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనం
    డైరెక్షన్
    ఫస్టాఫ్

    తెర ముందు.. తెర వెనుక

    తెర ముందు.. తెర వెనుక

    నటీనటులు: సందీప్ కిషన్, మెహ్రీన్ పిర్జాదా, సత్య, ప్రవీణ్, హరీష్ ఉత్తమన్, తులసి, నాగినీడు తదితరులు
    దర్శకత్వం: సుశీంద్రన్
    నిర్మాత: చక్రి చిగురుపాటి
    సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్ కుమార్
    ఎడిటింగ్: కాశీ విశ్వనాథ్
    బ్యానర్: లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్
    నిడివి: 129 నిమిషాలు
    రిలీజ్ డేట్: నవంబర్ 10. 2017

    English summary
    C/o Surya is an upcoming Indian bilingual action drama film produced by Chakri Chigurupati under Lakshmi Narasimha Entertainments, written and directed by Suseenthiran. The movie stars Sundeep Kishan and Mehreen Pirzada in the lead role while Harish Uthaman also in a pivotal role. The soundtrack for this movie is composed by D. Imman. Kasi Viswanathanand Laxman Kumar handle the editing and cinematography respective.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X