For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  C U Soon మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, దర్శన రాజేంద్రన్
  Director: మహేష్ నారాయణ్

  Talasani Sai Kiran Yadav Ditributing Groceries to Journalists & Film Workers

  కరోనావైరస్ లాక్‌డౌన్‌ను ఎదిరిస్తూ సంచలనాత్మక చిత్రాలను అందిస్తున్న మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మరో భావోద్వేగమైన చిత్రం సీ యూ సూన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కప్పేలా‌ ఫేమ్ రోషన్ మ్యాథ్యూ, సూపర్ డీలక్స్, ట్రాన్స్ లాంటి చిత్రాలతో ఆకట్టుకొన్ని ఫాహీద్ ఫాజిల్ కాంబినేషన్‌లో సీ యూ సూన్ చిత్రం ఓనం సందర్భంగా రిలీజైంది. విభిన్నమైన టేకింగ్, సాంకేతిక విలువలు, ఫీల్‌గుడ్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే..

  C U Soon కథ

  C U Soon కథ

  దుబాయ్‌లో ఫైనాన్సియల్ సెక్టార్‌లో పనిచేసే జిమ్మి కురియన్ (రోషన్ మ్యాథ్యూ)కి డేటింగ్ యాప్ ద్వారా అను సెబాస్టియన్ (దర్శనా రాజేంద్రన్)‌ అనే యువతితో పరిచయం జరుగుతుంది. గూగూల్ హ్యాంగ్ అవుట్, స్కైప్ లాంటి చాటింగ్ ద్వారా వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ సందర్భంలో అనుతో డేటింగ్ విషయాన్ని తన కజిన్, సైబర్ సెక్యూరిటీ ట్రాక్ చేసే కెవిన్ థామస్ (ఫాహద్ ఫాజిల్)కు చెప్పి ఏదో సహాయం కోరుతాడు. ఈ క్రమంలో అను తాను కష్టాల్లో ఉన్నానని, తాను ఉంటున్న ప్రదేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అంటూ అను సెబాస్టియన్ సహాయం కోరుతుంది. దాంతో అను సెబాస్టియన్‌ను ఓ అపార్ట్‌మెంట్ నుంచి తన ఫ్లాట్‌కు తీసుకొస్తాడు. ఆ తర్వాత అను సెబాస్టియన్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకొంటారు. చట్టవ్యతిరేకంగా సహజీవనం చేసినందుకు దుబాయ్ పోలీసులు జిమ్మిని కూడా అరెస్ట్ చేస్తారు.

  C U Soon మూవీలో ట్విస్టులు

  C U Soon మూవీలో ట్విస్టులు

  అను సెబాస్టియన్‌ ఎవరు? ఆమెను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అలాగే అను వల్ల జిమ్మికి ఎదురైన సమస్యలేమిటి? ఏ విధంగా జిమ్మి దుబాయ్ పోలీసుల నుంచి బయటపడ్డారు. జిమ్మికి ఎదురైన సమస్యను ఎలా కెవిన్ ఎలా పరిష్కరించారు. అను సెబాస్టియన్‌ గతాన్ని, ఆమెకు ఎదురైన సమస్యను టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీని ఉపయోగించి ఎలా కెవిన్ తెలుసుకొన్నాడు? జిమ్మి, అను మధ్య అనుసంధాన కర్తగా ఎలా మారాడు అనే ప్రశ్నలకు సమాధానమే సీ యూ సూన్.

  C U Soon అనాలిసిస్

  C U Soon అనాలిసిస్

  రొటీన్‌కు భిన్నంగా బ్యాక్ డ్రాప్‌ను ఎంచుకోవడంలో మలయాల చిత్ర పరిశ్రమది విభిన్నమైన శైలి. ఈ చిత్రంలో కేరళలోని ఓ సామాజిక సమస్యకు టెక్నాలజీ జోడించి చేసిన తెరపైన విన్యాసమే సీ యూ సూన్. ప్రస్తుత జనరేషన్‌లో విషయాలు, ఫేస్ బుక్, గుగూల్ హ్యాంగ్‌ అవుట్, స్కైప్ లాంటి వెబ్ ఛాటింగ్ యాప్స్ ఉపయోగించి సమాచారాన్ని సేకరించడం లాంటి అంశాలను తెరపైన చక్కగా చూపించారు. మొబైల్, కంపూటర్ల మధ్య జరిగే చాటింగ్ ద్వారా పూర్తిగా సినిమాను నడిపించడం ఈ సినిమాలో హైలెట్ అంశంగా చెప్పుకోవచ్చు. అనూహ్య పరిస్థితుల్లో ఇద్దరు ప్రేమికులు జైల్లో ఎందుకు పడ్డారనే విషయానికి సస్పెన్స్, మిస్టరీ, థ్రిలర్ అంశాలు జోడించి కథను నడిపించి తీరే ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు.

  దర్శకుడు మహేష్ నారాయణ్ టేకింగ్

  దర్శకుడు మహేష్ నారాయణ్ టేకింగ్

  ఉద్యోగాల ఎరతో యువతీ యువకులు ఎలాంటి సమస్యల్లో కూరుకుపోతున్నారనే కథను హృదయాన్ని పిండేసేలా చెప్పడం మహేష్ నారాయణ్ ప్రతిభకు అద్ధం పట్టింది. కథ రాసుకొన్న విధానం, దానిని నేటి యువతకు సులభంగా అర్ధమయ్యే రితీలో చెప్పిన తీరు చాలా బాగుంది. అంతేకాకుండా కథలో సస్సెన్స్‌ను చివరి దాకా కొనసాగించిన తీరు ఆకట్టుకొనేలా ఉంది. పాత్రల్లో భావోద్వేగాలను తెరపైన చూపించిన విధంగా కొత్తగా ఉంది.

  ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ యాక్టింగ్

  ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ యాక్టింగ్

  సూపర్ డీలక్స్, ట్రాన్స్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరనైన ఫాహద్ ఫాజిల్ మరోసారి అద్బుతమైన నటనను ప్రదర్శించాడు. హంగు, ఆర్బాటాలు లేకుండా సాదాసీదాగా నడిచే కథలో సైబర్ సెక్యూరిటీ, హ్యాకర్‌ పాత్రలో జీవించాడు. క్లైమాక్స్‌లో తన కళ్ల ద్వారా ఎమోషనల్‌గా పలికించిన నటన అభిమానులను మరింత ఆకట్టుకొంటుంది. ఇక మలయాళ చిత్రం కపేలాలో నెగిటివ్ షేడ్‌తో అభిమానులను సంపాదించుకొన్న రోషన్ ఈ సారి ఓ సానుభూతి పొందే పాత్రలో నటించి మెప్పించాడు. ఫీల్ గుడ్ సన్నివేశాల్లోనే కాకుండా కీలక సమయాల్లో తన నటనతో భావోద్వేగానికి గురిచేస్తాడు.

  దర్శనా రాజేంద్రన్ ఫెర్పార్మెన్స్

  దర్శనా రాజేంద్రన్ ఫెర్పార్మెన్స్

  ఇక అను సెబాస్టియన్ పాత్రలో ఇరుంబు థిరై ఫేమ్ దర్శనా రాజేంద్రన్ జీవించిందనే చెప్పాలి. కేరళ యువతులు ఎదుర్కొంటున్న సమస్యను చెప్పే పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిందనే చెప్పాలి. డైలాగ్స్ తక్కువగా, ఎమోషన్స్ ఎక్కువగా పలికించే స్కోప్ ఉన్న పాత్ర లభించడంతో కేవలం కళ్లతోనే మ్యాజిక్ చేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. డాక్టర్ ప్రశాంత్‌గా సైజు కురుప్, జిమ్మి తల్లిగా మాలా పార్వతి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

  మ్యూజిక్, సినిమాటోగ్రఫి

  మ్యూజిక్, సినిమాటోగ్రఫి

  సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణంగా మారింది. సబిన్ ఉలికాందీ, వర్చువల్ సినిమాటోగ్రఫి, మహేష్ నారాయణ్ సినిమాటోగ్రఫి, మహేష్ నారాయణ్ ఎడిటింగ్ పనితీరులో ఉత్తమ విలువలు కనిపిస్తాయి. ఈ సినిమాకు ఫాహద్ ఫాజిల్, నజ్రియా నాజింతోపాటు మరికొంత మంది స్నేహితులు నిర్మాతలుగా వ్యవహారించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

  సామాజిక సమస్యకు టెక్నాలజీ జోడించి

  సామాజిక సమస్యకు టెక్నాలజీ జోడించి

  దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో యువతులు వెళ్లి పడే కష్టాలను సీ యూ సూన్ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. పాయింట్ పాతదే అయినా కొత్తగా చూపించడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఓ సోషల్ ప్రాబ్లెంకు టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే విధంగా ఈ చిత్రం రూపొందింది. యూత్‌కే కాకుండా అశ్లీల, అసభ్యతకు చోటు లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా ఆకట్టుకొనే విధంగా ఈ సినిమాను ఫీల్ గుడ్‌గా మలిచారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజైంది. ఇతర భాషా ప్రేక్షకులకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండటం గమనార్హం.

  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  చిత్రం: సీ యూ సూన్ (మలయాళం)
  నటీనటులు: ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, దర్శన రాజేంద్రన్
  రచన, దర్శకత్శం: మహేష్ నారాయణ్
  నిర్మాతలు: ఫాహద్ పాజిల్, నజ్రియా నాజిం
  మ్యూజిక్: గోపి సుందర్
  సినిమాటోగ్రఫి: సబిన్ ఉలికాందీ, వర్చువల్ సినిమాటోగ్రఫి, మహేష్ నారాయణ్
  బ్యానర్: ఫాహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  రిలీజ్ డేట్: 2020-08-01

  English summary
  C U Soon is mystery thriller film written and directed by Mahesh Narayanan.The film stars Fahadh Faasil, Roshan Mathew and Darshana Rajendran in lead roles, with Saiju Kurup and Maala Parvathi in supporting roles. Produced by Fahadh Faasil and Nazriya Nazim, the film released on Amazon Prime Video on September 1, 2020.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X