twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Cab Stories Movie Review: బిగ్‌బాస్ ఫేమ్ దివి వద్యా ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే!

    |

    Rating: 2.5/5

    టాలీవుడ్ ప్రేక్షకులు ఇటీవల కాలంలో వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు. వస్తున్న సినిమా చిన్నదా, పెద్దదా, పెద్ద స్టార్ హీరోనా లేక కొత్త హీరోనా అనే అంశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా బిగ్ బాస్ సేమ్ వి లీడ్ రోల్ లో నటించిన క్యాబ్ స్టోరీస్ వాల్యూం వన్ స్పార్క్ ఓటీటీలో రిలీజ్ అయింది.. థ్రిల్లర్ కథాంశం కావడం, తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి పెంచడంతో సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఆ మేరకు అంచనాలను అందుకుందో లేదో? అసలు ఏమిటి ఈ క్యాబ్ స్టోరీస్ ఏంటి అనే విషయాల్లో కి వెళితే..

    కథేమిటి

    కథేమిటి

    గిరిధర్ ఒక క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. గిరి క్యాబ్ లో ఎక్కిన ఒక వ్యక్తి తీసుకు వెళుతున్న డ్రగ్స్ బ్యాగ్ నుంచి ఒక ప్యాకెట్ గిరి క్యాబ్లో పడుతుంది. స్వతహాగా చాలా నిజాయితీపరుడైన గిరి డ్రగ్స్ అంటే భారీగా డబ్బు సంపాదించవచ్చు అని భావించి దానిని కొట్టేసేందుకు ప్లాన్ వేస్తాడు.

    ఆ డ్రగ్ ప్యాకెట్ కొట్టేసేందుకు వేసిన ప్లాన్ గిరి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఆ ప్యాకెట్ పోగొట్టుకున్న వ్యక్తి దిగిన వెంటనే క్యాబ్ ఎక్కిన శాలిని(దివి), ఈ కథ మొత్తాన్ని ఒక కీలక మలుపు తిప్పుతుంది. అలా శాలిని తిప్పిన మలుపు ఏంటి, చివరికి డ్రగ్ ప్యాకెట్ ను గిరి ఏం చేశాడు? గిరిని డ్రగ్ మాఫియా ఏం చేసింది ? అనే కథాంశం చుట్టూ ఈ సినిమాను తెరకెక్కించారు.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి గురించి చెప్పాలంటే, రొటీన్ పాయింట్ అయినా కూడా తనదైన శైలిలో థ్రిల్లర్ కథాంశానికి తగ్గట్టుగా రూపొందించాడు దర్శకుడు రాజేష్. మొదటి సినిమానే అయినా ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటులను తీసుకోవడమే కాక బిగ్ బాస్ తో మంచి ఫేమ్ అందుకున్న దివి ఈ సినిమాలోకి తీసుకుని సినిమా మీద క్రేజ్ పెంచారు.

    ప్రస్తుతం సమాజంలో ఉన్న డ్రగ్స్ అలాగే అమ్మాయిల విషయంలో అబ్బాయిలు ఎలా ఆలోచిస్తున్నారు అనే అంశాలను చూపించారు. కేవలం కంటెంట్ ను నమ్ముకుని చేసిన ఈ ప్రయత్నం బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఎక్కడా ఎలాంటి హంగులకి పోకుండా, ఎక్కడా ఇబ్బందికర సన్నివేశాలు లేకుండా ఈ సినిమాని పూర్తి చేశారు. ఒక థ్రిల్లర్ కథాంశం ఎలా ఉండాలో అలా ఉండేలా దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. ప్రేక్షకులను తన ట్విస్ట్ లతో ఆకట్టుకోవడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం సఫలం ఇచ్చిందనే చెప్పాలి.

    నటీనటుల పెర్ఫార్మెన్స్

    నటీనటుల పెర్ఫార్మెన్స్

    ఇక నటీనటుల విషయానికి వస్తే మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో కేవలం ఒక్క సీన్ లో మాత్రమే కనిపించిన దివి ఈ సినిమాలో ఫుల్ లెన్త్ లీడ్ రోల్ లో నటించింది. కధ మొత్తాన్ని మలుపు తిప్పిన పాత్రలో నటించిన ఆమె అద్భుతంగా నటించింది. షాలిని పాత్రలో నటించిన దివి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది,అలా ఏ మాత్రం వంకలు పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. ఇక గిరిధర్, ధనరాజ్ కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. శ్రీహాన్, ప్రవీణ్, సిరి అలాగే మరికొందరు నూతన నటీనటులు ఎవరి పరిధి మేరకు వారు నటించి ఆకట్టుకున్నారు.

    టెక్నికల్ టీమ్

    టెక్నికల్ టీమ్

    ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన సాయి కార్తీక్ తన సంగీతంతో మరోసారి ఆకట్టుకొన్నాడు. టైటిల్ సాంగ్ విషయంలో కూడా ఆయన పనితనం కనిపించింది. సుజాత సిద్ధార్థ్ కెమెరా పనితనం దాదాపు అన్ని ఫ్రేములోనూ కొట్టొచ్చినట్లు కనిపించింది. సినిమా చాలా భాగం క్యాబ్లో నడుస్తూ ఉండడంతో క్యాబ్ సీన్స్ కూడా ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఇక ఎడిటర్ తమ్మిరాజు అనుభవం సినిమా నిడివి విషయంలో బాగా పనికొచ్చింది. ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా సాగతీత లేకుండా సినిమా తీర్చిదిద్దారు.

    నిర్మాత ప్రొడక్షన్ వాల్యూస్

    నిర్మాత ప్రొడక్షన్ వాల్యూస్

    ఇమేజ్ పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ఈ సినిమాను ఎస్ కృష్ణ నిర్మించారు. ప్రొడక్షన్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లుగా అనిపించింది. ఎక్కడా హంగులు ఆర్భాటాలకు పోకుండా కథ డిమాండ్ మేరకు అవసరమైన చోట ఖర్చు పెట్టారు. ఎక్కడా అనవసరమైన విషయాలు చూపించకుండా సినిమాను క్లీన్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. థ్రిల్లర్ కథాంశమే అయినా ఏ మాత్రం వెనుకాడకుండా నిర్మాణ విలువలు తగ్గకుండా సినిమాను పూర్తిచేశారు.

    ఫైనల్ గా

    ఫైనల్ గా

    రొటీన్ సినిమానే అయినా దర్శకుడు కథను హ్యాండిల్ చేసిన విధానం అలాగే నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. థ్రిల్లర్ కధాంశాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పక నచ్చి తీరుతుంది. మొత్తం మీదఈ వీకెండ్ కి మంచి థ్రిల్లర్ దొరికిందని మాత్రం చెప్పక తప్పదు. ఆకట్టుకునే ట్విస్టులతో ఉత్కంఠ రేపుతూ సినిమా ఆద్యంతం సాగిపోతుంది. కాకపోతే ఇది వాల్యూం వన్ అని పేర్కొన్నారు కాబట్టి ఈ సిరీస్లో మరిన్ని ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Recommended Video

    YVS Chowdary పట్టు వదలని విక్రమార్కుడు.. మళ్ళీ Love Story తో..!! || Filmibeat Telugu
     తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: దివి వధ్యా, గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహాన్‌, సిరి తదితరులు
    డైరెక్టర్: కేవీఎన్‌ రాజేష్‌
    నిర్మాత : ఎస్‌.కృష్ణ
    ఎడిటర్ :- తమ్మిరాజు
    బ్యానర్: ఇమేజ్‌స్పార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

    English summary
    Cab stories movie starring divi, giridhar, dhanraj released in spark OTT platform on 28th May. here is the review and rating of cab stories volume 1.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X