For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Captain movie review ఆకట్టుకోలేని కథ, కథనాలు.. ఆర్య ఒంటరిపోరాటం ఎలా ఉందంటే?

  |

  Rating:
  2.0/5

  నటీనటులు: ఆర్య, సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, హరీష్ ఉత్తమన్, కావ్యశెట్టి, ఆదిత్య మీనన్ తదితరులు
  రచన, దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్
  నిర్మాత: ఆర్య
  డీవోపీ: ఎస్ యువ
  ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్
  మ్యూజిక్: ఇమాన్
  ఆర్ట్: రాహుల్ ఘోష్
  స్టంట్ డైరెక్టర్: ఆర్ శక్తి శరవణన్, కే గణేష్
  బ్యానర్: శ్రేష్ట్ మూవీస్, థింక్ స్టూడియోస్, స్టేజ్ 03
  రిలీజ్ డేట్: 2022-09-08

  కెప్టెన్ మూవీ కథ..

  కెప్టెన్ మూవీ కథ..

  విజయ్ (ఆర్య) ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేస్తుంటాడు. 50 ఏళ్లుగా మిలిటరీ, జన జీవన సంచారం లేని ప్రాంతానికి వెళ్లిన ప్రతీ ఒక్కరు వెనక్కి తిరిగిరాని పరిస్థితి ఉంటుంది. అంతుపట్టని ఆ ప్రాంతానికి విజయ్ తన టీమ్‌తో వెళ్తాడు. టీమ్ మెంబర్ కార్తీక్ మాధవన్ (హరీష్ ఉత్తమన్) తోటి జవాన్లను కాల్చి తనను తాను కాల్చి చచ్చిపోతాడు. ఆ తర్వాత సైంటిస్టులకు కూడా అంతుచిక్కని విధంగా ఓ స్పైడర్‌ ఆధారంగా ప్రజలను పొట్టన పెట్టుకొనే మేనియేటర్ అనే ఒక వింత, భయంకర జంతువు అందుకు కారణమని తెలుస్తుంది.

  కెప్టెన్ మూవీలో ట్విస్టులు

  కెప్టెన్ మూవీలో ట్విస్టులు


  మేనియర్ ఎందుకు సైనికులను, ప్రజలను పొట్టనపెట్టుకొన్నది? కార్తీక్ ఎందుకు తనను తాను కాల్చుకొని ప్రాణాలు తీసుకొన్నాడు? దేశద్రోహం ఆరోపణలు పడిన తన స్నేహితుడు కార్తీక్ కోసం విజయ్ ఎలాంటి రిస్క్ తీసుకొన్నాడు? ఆర్మీ జవాన్లకు సవాల్‌గా నిలిచిన మేనియేటర్ వెనుక అసలు కథ ఏమిటి? కార్తీక్ మీద పడిన మచ్చను విజయ్ ఎలా తొలగించాడు? మేనియేటర్ పుట్టుక వెనుక అసలు కారణం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే కెప్టెన్ సినిమా కథ.

  కెప్టెన్ మూవీ ఎలా ఉందంటే?

  కెప్టెన్ మూవీ ఎలా ఉందంటే?

  ఈశాన్య భారతంలోని సెక్టార్ 42 ప్రాంతంలో 50 ఏళ్లుగా ఎలాంటి జన సంచారం లేని ప్రాంతంలో మనుషులు, సైన్యం ప్రాణాలు కోల్పోవడం, అదృశ్యం కావడం అనే అంశంతో సినిమా ఆసక్తికరంగా మొదలైందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ కథ, కథనాల్లో బలం లేకపోవడం, పేలవమైన సన్నివేశాలు ఉండటంతో నిస్సారంగా కథ సాగుతుంది. అయితే అంతటి బలహీనమైన స్క్రిప్టును కూడా ఆర్య తన ఫెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లోనైనా కథలో మలుపులు ఆసక్తికరంగా ఉంటాయని భావించిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. చివర్లో లాజిక్‌ లేకుండా యాక్షన్ ఎపిసోడ్‌తో ముగించే ప్రయత్నం చేశారు. కానీ చివర్లో కార్తీక్ సంబంధించిన ఎమోషనల్ పాయింట్ ఆకట్టుకొనేలా ఉంటుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే స్పష్టమవుతుంది.

  దర్శకుడు రాజన్ విఫలం

  దర్శకుడు రాజన్ విఫలం

  హాలీవుడ్ సినిమాల ప్రభావంతో దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ రాసుకొన్న పాయింట్ బాగానే ఉంది. కానీ ఆ పాయింట్‌ను టెక్నికల్, సైంటిఫిక్ అంశాలతో సాధారణ ప్రేక్షకుడికి అర్ధం అయ్యేలా కథ, కథనాలను రాసుకోలేకపోయాడని చెప్పవచ్చు. కేవలం యాక్షన్, గ్రాఫిక్స్ అంశాలను నమ్ముకొని సినిమా తీసినట్టు అనిపిస్తుంది. కథ, కథనాల్లో బలంగా భావోద్వేగాలను జొప్పించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా దర్శకుడు ప్రయత్నం చేయలేదనిది కనిపిస్తుంది.

  ఆర్య, సిమ్రాన్ ఫెర్ఫార్మెన్స్ ఇలా..

  ఆర్య, సిమ్రాన్ ఫెర్ఫార్మెన్స్ ఇలా..

  కెప్టెన్ సినిమాకు ఆర్య పెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది. కెప్టెన్ పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా యాటిట్యూడ్, హావభావాలతో ఆకట్టుకొన్నాడు. యాక్షన్ సీన్లలో మెప్పించాడు. కథ, సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల తన పాత్రను మరో రేంజ్‌కు తీసుకెళ్లలేదని చెప్పాలి. సిమ్రాన్ పాత్ర కూడా సరిగా ఉండదు. సైంటిస్టుకు ఉండాల్సిన లక్షణాలు కూడా కనిపించవు. సిమ్రాన్ పాత్ర మరీ పేలవంగా కనిపిస్తుంది. కార్తీక్‌గా హరీష్ ఉత్తమన్ పాత్ర చుట్టు ఎమోషన్స్ అల్లుకోవడానికి ఛాన్స్ ఉన్నా ఆ ప్రయత్నం చేయకపోవడంతో ఆ పాత్ర నామమాత్రంగానే కనిపిస్తుంది. ఐశ్వర్య లక్ష్మి పాత్ర అతిథి పాత్రగానే ఉంటుంది.

  సాంకేతిక విభాగాల గురించి

  సాంకేతిక విభాగాల గురించి

  ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. డీ ఇమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. యువ అందించిన సినిమాటోగ్రఫి సన్నివేశాలను రిచ్‌గా చూపించారు. యాక్షన్ సీన్లను మంచి క్వాలిటీతో రూపొందించారు. ఆర్ శక్తి శరవణన్, కే గణేష్ ఫైట్స్ బాగా డిజైన్ చేశారు. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు పర్వాలేదనిపిస్తాయి.

  ఫైనల్ ఎలా ఉందంటే?

  ఫైనల్ ఎలా ఉందంటే?

  ఎమోషన్స్, దేశభక్తి, యాక్షన్ లాంటి అంశాలకు స్కోప్ ఉన్న చిత్రం కెప్టెన్. అయితే అలాంటి అంశాలు ఫర్‌ఫెక్ట్‌గా తెరమీద అందించడంలో దారుణంగా విఫలమయ్యారు. బయో రేడియో సిగ్నల్ లాంటి అంశాలను అర్ధం అయ్యేలా చెప్పలేకపోయారు. దాంతో ఈ సినిమా అన్ని రకాల ప్రమాణాలకు దిగువన ఉన్నట్టు కనిపిస్తుంది. థియేట్రికల్ రిలీజ్ కంటే.. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఫలితం ఉండేదేమో అనిపిస్తుంది. ఆర్మీ, యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. కమర్షియల్‌ సక్సెస్‌పై భారీ అనుమానాలే ఉన్నాయని చెప్పవచ్చు.

  English summary
  Tamil Actor Arya's Captain has released in Theatres on September 08th. Here is the exclusive review from Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X